Second Child: మొదటి బిడ్డకీ.. రెండో బిడ్డకు ఎంత గ్యాప్ తీసుకోవాలి..?
చాలా మందికి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉండాలని అనే కోరిక ఉంటుంది. కానీ.. మొదటి బిడ్డ పుట్టిన తర్వాత... ఎన్ని సంవత్సరాల తర్వాత రెండో బిడ్డకు ప్లాన్ చేయాలి అనే విషయంలో చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయి.

రెండో సంతానం...
పెళ్లి తర్వాత పిల్లలను ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి అని ప్రతి దంపతులు ఒక ప్లాన్ చేసుకుంటారు. కానీ, మొదటి బిడ్డ పుట్టిన తర్వాత... రెండో బిడ్డ ను ఎప్పుడు కనాలి అనే విషయంలో మాత్రం చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలా మందికి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉండాలని అనే కోరిక ఉంటుంది. కానీ.. మొదటి బిడ్డ పుట్టిన తర్వాత... ఎన్ని సంవత్సరాల తర్వాత రెండో బిడ్డకు ప్లాన్ చేయాలి అనే విషయంలో చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయి. కొందరు వెంటనే గ్యాప్ లేకుండా కనేస్తుంటారు.. మరి కొందరు.. కనీసం పదేళ్ల గ్యాప్ తీసుకుంటారు. రెండింటిలో ఏది కరెక్ట్..? మరి, దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం....
WHO ఏం చెబుతోంది..?
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. మొదటి బిడ్డ పుట్టిన తర్వాత ఒక స్త్రీ కనీసం 2 నుంచి 3 సంవత్సరాల గ్యాప్ కచ్చితంగా ఉండాలి. ఈ గ్యాప్ ఇస్తే.. మహిళలు.. తిరిగి కోలుకోవడానికి, పోషక స్థాయిలు తిరిగి నింపడానికి తగినంత సమయం లభిస్తుంది. దీనితో పాటు.. రెండోసారి గర్భంలో పిల్లల ఆరోగ్యకరమైన అభివృద్ధికి ఈ సమయం ముఖ్యమైనది పరిగణిస్తారు.
రెండో సంతానం ఆరోగ్య ప్రభావం...
WHO మార్గదర్శకాల ప్రకారం... వెంట వెంటనే గర్భం దాల్చితే..రెండో బిడ్డ ఆరోగ్యం చాలా ప్రభావితమౌతుంది. రెండవ బిడ్డను చాలా త్వరగా కలిగి ఉండటం తరచుగా తక్కువ బరువు గల శిశువు జననానికి దారితీస్తుంది. అకాల జనన ప్రమాదం పెరుగుతుంది.
రెండో బిడ్డకు ప్లాన్ చేసుకునేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
రెండవ బిడ్డను కనాలని ప్లాన్ చేసుకునే ముందు తల్లిదండ్రులు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా సిద్ధంగా ఉండాలని వైద్యులు అంటున్నారు.మొదటి బిడ్డను జాగ్రత్తగా చూసుకోవడం, వారి అవసరాలు తీర్చడంతో పాటు..రెండో బిడ్డను చూసుకునే బాధ్యతకు కూడా శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండాలి.అటువంటి పరిస్థితిలో, తల్లిదండ్రులు మానసికంగా సిద్ధంగా లేకుంటే రెండవ బిడ్డను ప్లాన్ చేయడం మంచిది కాదు.
తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ఎందుకు అవసరం?
గర్భధారణ , ప్రసవ సమయంలో స్త్రీ శరీరం చాలా పోషకాలు, శక్తి కోల్పోతుంది. ఒక స్త్రీ చాలా త్వరగా మళ్ళీ గర్భవతి అయితే, ఆమె శరీరం కోలుకోవడానికి సమయం ఉండదు. ఇది రక్తహీనత, బలహీనత, అధిక రక్తపోటు, గర్భస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది. ఎక్కువ విరామంతో తల్లి శరీరం మళ్ళీ బలపడుతుంది. తదుపరి గర్భం సురక్షితంగా ఉంటుంది.
ఏ విషయాలను గుర్తుంచుకోవాలి?
వైద్యుడిని సంప్రదించి మీ ఆరోగ్య స్థితిని తనిఖీ చేసుకోండి. సమతుల్య ఆహారం , క్రమం తప్పకుండా వ్యాయామంతో మీ శరీరాన్ని బలోపేతం చేసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. తగినంత నిద్రపోవాలి.మీ మొదటి బిడ్డను జాగ్రత్తగా చూసుకోవడానికి తగిన సహాయక వ్యవస్థను సిద్ధంగా ఉంచండి. అప్పుడే.. రెండో బిడ్డ కోసం ప్లాన్ చేసుకోవాలి.