Father's day 2022: ఫాదర్స్ డే తేది, చరిత్ర, ప్రాముఖ్యత..
Father's day 2022: సంవత్సరంలో వివిధ సమయాల్లో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఫాదర్స్ డేను జరుపకుంటారు. కానీ భారతదేశంలో జూన్ లో మూడవ ఆదివారం నాడే ఫాదర్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఏడాది ఫాదర్స్ డే మన దేశంలో జూన్ 19 ఆదివారం నాడు జరుపుకోబోతున్నాం..

Father's day 2022
పిల్లలే ప్రపంచంగా బతికే తల్లిదండ్రుల గొప్ప మనసును చెప్పడానికి అక్షరాలు సరిపోవు. వీళ్లకు ఎంత సేవ చేసినా.. వాళ్ల రుణం మాత్రం ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేమని పెద్దలు చెప్తుంటారు. అది నిజమే.. చిన్నపిల్లల నుంచి మనం పెరిగి పెద్ద అయ్యే దాక కూడా మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. సుఖాల్లో తోడు లేకపోయినా.. కష్టంలో నీకు నేనున్నానంటూ వెన్నెముకలా నిలబడతారు. ఇలాంటి అమ్మానాన్నల గొప్పతనం గురించి ఎంత వర్ణించినా తక్కువే.
పిల్లల పెంపకంలో తల్లి ఎంత పాత్ర పోషిస్తుందో.. తండ్రి కూడా తన బాధ్యతను నెరవేరుస్తాడు. మన కుటుంబంలో, సమాజంలో తండ్రుల పాత్రను గుర్తించడానికి, వారిని అభినందించడానికే ప్రపంచ వ్యాప్తంగా ఫాదర్స్ డే (Father's day) ను సెలబ్రేట్ చేసుకుంటారు.
Father's day 2022
ఒక తండ్రి ఒక రోల్ మోడల్ , గైడ్, సూపర్ హీరో, స్నేహితుడు, సంరక్షకుడు. నాన్నలు పిల్లలకు అన్ని సమయాల్లో అండగా ఉంటాడు. కస్టమైనా సుఖమైనా.. ఎవరు మనకు తోడుగా ఉన్నా లేకపోయినా.. నాన్న మాత్రం మనతోనే ఉంటారు. జీవిత సత్యాలను భోదిస్తాడు. అందుకే ఒక తండ్రి త్యాగాన్ని గుర్తించడానికి ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఫాదర్స్ డేను జరుపుకుంటారు.
Father's day 2022
ఫాదర్స్ డే యొక్క చరిత్ర:
1910 లో ఫాదర్స్ డే ప్రారంభమైంది. యు.ఎస్ లో మదర్స్ డే యొక్క మొదటి అధికారిక వేడుక జరిగిన రెండు సంవత్సరాల తర్వాత దీన్ని జరుపుకున్నారు. స్పోకెన్ సోనోరా స్మార్ట్ డాడ్ ఫాదర్స్ డేను జరుపుకున్నారు. 'స్పోకెన్ సోనోరాకు తల్లి లేదు. తన తండ్రి సివిల్ వార్ వెటరన్ విలియం జాక్సన్ స్మార్ట్ యే పిల్లలను ఎంతో కష్టపడి పెంచాడు. తన తండ్రి ఒంటరిగా తమను ఎలా కష్టపడి పెంచాడు.. అతను ఎదుర్కొన్న సవాళ్లన్నింటిని దగ్గర నుంచి చూసిన స్పోకెన్ సోనోరా తండ్రుల కష్టానికి గుర్తించడానికి ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలని భావించింది.
అందుకోసం ఆమె స్థానిక ప్రభుత్వ అధికారులు, చర్చిలు,ఇతర స్థానిక సంస్థలపై ప్రచారం చేసింది. కాగా 1910లో వాషింగ్టన్ రాష్ట్రం జూన్ 19 న మొదటి అధికారిక ఫాదర్స్ డేను జరుపుకుంది. ఇది దేశంలో మొట్టమొదటి ఫాదర్స్ డే అని చెప్పొచ్చు.
తరువాతి కొన్ని దశాబ్దాల్లో స్మార్ట్ డాడ్ ఫాదర్స్ డేను జాతీయంగా గుర్తింపు పొందిన సెలవుదినంగా మార్చడానికి తన ప్రచారాన్ని కొనసాగించింది. ఉడ్రో విల్సన్, కాల్విన్ కూలీజ్ లతో సహా అనేక మంది అధ్యక్షులు ఈ రోజు ప్రాముఖ్యతను గుర్తించారు. కాని 1970 వరకు కాంగ్రెస్ ఒక ఉమ్మడి తీర్మానాన్ని ఆమోదించలేదు. ఆ తర్వాత జూన్ లో మూడవ ఆదివారాన్ని ఫాదర్స్ డేగా ప్రకటించారు. ఆ రోజునుంచి ప్రతి ఏడాది ఫాదర్స్ డే ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ఫాదర్స్ డే కోట్స్:
"ఒక త౦డ్రి వ౦దమ౦దికన్నా ఎక్కువ స్కూల్ టీచర్స్ తో సమానం." —జార్జ్ హెర్బర్ట్
"ఒక మంచి త౦డ్రి అత్య౦త విలువైన ఆస్తుల్లో ఒకడు." — బిల్లీ గ్రాహమ్
"మిమ్మల్ని మనిషిగా చేసేది పిల్లల్ని కనే సామర్థ్యం కాదు - ఒకరిని పెంచే ధైర్యం." బరాక్ ఒబామా
"ఒక పిల్లవాడికి సహాయం చేయడానికి వంగినప్పుడు ఆ వ్యక్తి ఎంతో ఎత్తుగా నిలబడడు." - అబ్రహం లింకన్
"ప్రతి గొప్ప కుమార్తె వెనుక నిజంగా అద్భుతమైన తండ్రి ఉంటాడు."