MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Most Selling Alcohol: ప్రపంచంలో ఎక్కువ మంది తాగే మందు ఇదే.. ఈ బ్రాండ్ సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా?

Most Selling Alcohol: ప్రపంచంలో ఎక్కువ మంది తాగే మందు ఇదే.. ఈ బ్రాండ్ సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా?

Most Selling Alcohol: ఆల్కహాల్ లో చాలా రకాలు ఉంటాయి. ఒక్కో దేశంలో చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి. అయితే.. ఎన్ని బ్రాండ్స్ ఉన్నా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది మెచ్చిన ఆల్కహాల్ ఒకటి ఉంది. అదేంటి? దాని స్పెషాలిటీ ఏంటి? 

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 11 2026, 04:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఎక్కువ మంది మెచ్చిన బ్రాండ్ ఇది..
Image Credit : Getty

ఎక్కువ మంది మెచ్చిన బ్రాండ్ ఇది..

ప్రపంచ వ్యాప్తంగా మద్యం సేవించే వారు చాలా మంది ఉంటారు. చాలా మందికి ఆల్కహాల్ అనగానే ముందుగా.. బీర్, విస్కీ వోడ్కా, టకీలా లాంటి బ్రాండ్ పేర్లు చెబుతారు. ఇవి మాత్రమే మద్యం అనే భావన ఉంటుంది. కానీ, నిజానికి దాదాపు 25 ఏళ్లుగా.. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడౌతున్న మద్యం బ్రాండ్ ఒకటి ఉంది. అదే జిన్రో. దక్షిణా కొరియాకు చెందిన సోజు బ్రాండ్ ఇది. దీనిని ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. గత ఏడాది కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో దాదాపు 10 కోట్లు అంటే 100 మిలియన్ ఈ మందు కేసులు అమ్ముడయ్యాయి. దీని దరిదాపుల్లో ఇంకో బ్రాండ్ ఏదీ లేకపోవడం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
 జిన్రో బ్రాండ్ ని సక్సెస్ వెనక చాలా కారణాలు ఉన్నాయి...
Image Credit : chat GPT

జిన్రో బ్రాండ్ ని సక్సెస్ వెనక చాలా కారణాలు ఉన్నాయి...

యువతను ఆకట్టుకునే ఫ్లేవర్స్...

ఈ బ్రాండ్ ని సక్సెస్ చేయడానికి కంపెనీ చాలా కష్టపడింది. ముఖ్యంగా యూత్ ని ఆకట్టుకునే ఫ్లేవర్స్ తీసుకువచ్చింది. గ్రీన్ గ్రేప్, పీచ్, లీచీ, స్ట్రాబెర్రీ వంటి ఫ్లేవర్స్ లో అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో యూత్ దీనికి చాలా తొందరగా కనెక్ట్ అయ్యారు.ఈ ఫ్లేవర్స్ ఎక్కువ మందికి నచ్చడంతో.. అమ్మకాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి.

బాటిల్ కలర్...

ఈ జిన్రోని ఆకుపచ్చ రంగు సీసాల్లో విక్రయిస్తారు. ఆ బాటిల్ కనిపించగానే.. అది జిన్రో అని గుర్తు పట్టేలా దానికి బ్రాండింగ్ చేశారు. అందుకే చాలా తక్కువ సమయంలో.. ఇది ప్రజలకు చేరువైంది.

Related Articles

Related image1
Floating Village: గ్రామం మొత్తం నీటిపైనే తేలుతుంది..ఇంట్లో కి అడుగుపెట్టాలన్నా నీటిలో ఈదాల్సిందే
Related image2
Oldest Bazar: మన దేశంలో అతి పాత బజార్ ఇదే..350 ఏళ్లుగా నడుస్తోంది..ఇక్కడ దొరకనిది అంటూ ఏదీ లేదు
33
మందు తాగే విధానంలోనూ ఒక ట్రెడిషన్...
Image Credit : AI Image

మందు తాగే విధానంలోనూ ఒక ట్రెడిషన్...

కొరియాలో.. ఈ బ్రాండ్ తాగడానికి సరి కొత్త ట్రెడిషన్ ని తీసుకువచ్చారు. ఆ ట్రెడిషన్ కూడా ఫుల్ పాపులర్ అయ్యింది. రెండు చేతులతో బాటిల్ పట్టుకోవడం, తాగడానికి ముందు పెద్దవారికి గ్లాసులో కొంచెం పోయడం లాంటి పద్దతులను అనుసరిస్తారు. ఈ ట్రెడిషన్ కారణంగా కూడా ఎక్కువ మందికి ఈ బ్రాండ్ తెలిసింది.

సినిమాలు, వెబ్ సిరీస్ లతో..

దీనిని తయారు చేసింది దక్షిణ కొరియా అయినప్పటికీ.. ప్రపంచానికి పరిచయం చేసింది మాత్రం సినిమాలు, వెబ్ సిరీస్ లు. చాలా కొరియన్ సినిమాలు,వెబ్ సిరీస్ లు, యూట్యూబ్ వీడియోల్లో తరచుగా ఈ జిన్రో బ్రాండ్ కనిపించేలా, వాటి ద్వారా ప్రమోషన్స్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కొరియన్ కల్చర్ కీ , ఆ సినిమాలకు ఫ్యాన్స్ ఉండటంతో... వారికి ఈ జిన్రో బ్రాండ్ పై ఆసక్తి కలిగింది. దీంతో.. ప్రపంచ వ్యాప్తంగా ఈ బ్రాండ్ అమ్మకాలు పెరిగాయి. ఈ సింపుల్ టెక్నిక్స్ ఫాలో అవ్వడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడౌతున్న ఆల్కహాల్ గా జిన్రో నిలిచింది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Post Office: నీటిపై తేలే పోస్టాఫీస్.. మన దేశంలో ఎక్కడ ఉందో తెలుసా?
Recommended image2
Skincare Tips: ముఖం ఎప్పుడూ అందంగా ఉండాలంటే ఉదయం ఈ తప్పులు అస్సలు చేయొద్దు!
Recommended image3
Coin Necklace: పట్టుచీరల మీదకు అదిరిపోయే కాసుల నక్లెస్ డిజైన్లు
Related Stories
Recommended image1
Floating Village: గ్రామం మొత్తం నీటిపైనే తేలుతుంది..ఇంట్లో కి అడుగుపెట్టాలన్నా నీటిలో ఈదాల్సిందే
Recommended image2
Oldest Bazar: మన దేశంలో అతి పాత బజార్ ఇదే..350 ఏళ్లుగా నడుస్తోంది..ఇక్కడ దొరకనిది అంటూ ఏదీ లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved