- Home
- Life
- Friendship rescission: ఆర్థిక మాంద్యం అంటే తెలిసి ఉండొచ్చు.. 'ఫ్రెండ్‌షిప్ మాంద్యం' గురించి విన్నారా?
Friendship rescission: ఆర్థిక మాంద్యం అంటే తెలిసి ఉండొచ్చు.. 'ఫ్రెండ్‌షిప్ మాంద్యం' గురించి విన్నారా?
ఆర్థిక మాంద్యం దీని గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచ దేశాలు ఆర్థికంగా దీవాలా తీయడాన్ని ఆర్థిక పరిభాషలో ఆర్థిక మాంద్యంగా పిలుస్తుంటారు. అయితే మీరు ఎప్పుడైనా 'ఫ్రెండ్‌షిప్ రీసెషన్' గురించి విన్నారా.? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ అంశంగా ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఏంటీ ఫ్రెండ్‌షిప్ రీసెషన్.? దీనికి అసలు కారణం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం..

ఇటీవల అమెరికాలో ఎక్కువగా కనిపిస్తున్న ఒక సామాజిక మార్పు ‘ఫ్రెండ్‌షిప్ రీసెషన్’ (Friendship Recession). దీని అర్థం వ్యక్తిగత స్నేహ సంబంధాలు, ముఖాముఖి కలసి మమేకమయ్యే సందర్భాలు తగ్గిపోతున్నాయన్నది. పరిశోధనల్లో తేలిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం చాలా మంది తమకు స్నేహితులు ఉన్నారని చెప్పడం తగ్గించారు, అలాగే వాళ్ల మధ్య స్నేహ బంధాలు లోతుగా ఉండటం, తరచుగా కలవడం కూడా తగ్గిపోయింది. ఇది మనసు మీద ప్రభావం చూపించే పరిస్థితి.
* 1990లో 33% మంది "నాకు 10 మందికి పైగా స్నేహితులు ఉన్నారు" అని చెప్పారు.
* 2021కి వచ్చేసరికి, ఈ సంఖ్య 13%కి పడిపోయింది.
అయితే ఈ మార్పు పురుషులలో ఎక్కువగా కనిపిస్తోంది. 1990లో 3% మంది పురుషులే "నాకు ఒక్క స్నేహితుడూ లేరు" అన్నారు. 2021లో అదే సంఖ్య 15%కి చేరింది.
ఇది చూసి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా, డిజిటల్ చాట్ వేదికలు పెరుగుతున్నా... మనసులో నిలిచిపోయే నిజమైన మనుషుల అనుబంధాలు తగ్గిపోతున్నాయన్నదే అసలైన సమస్య అని వారు చెబుతున్నారు.
మనుషుల మధ్య నిజమైన స్నేహ బంధాలు తగ్గిపోతున్నాయి. సరదాగా కలుసుకోవడం, సమస్యలు పంచుకోవడం, సహాయం చేయడం వంటి నమ్మకమైన సంబంధాలు క్రమంగా క్షీణిస్తున్నాయి. ఈ పరిణామాన క్రమాన్ని సామాజిక నిపుణులు "Friendship Recession"గా చెబుతున్నారు. ఈ పరిస్థితి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది, ఎందుకంటే నిజమైన స్నేహితులు లేకపోవడం ఒంటరితనానికి దారితీస్తోంది.