Telugu

రోజూ అవకాడో తింటే శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులివే!

Telugu

మంచి కొలెస్ట్రాల్‌

అవకాడోలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు మెండుగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి తోడ్పడతాయి.

Image credits: freepik
Telugu

గుండె ఆరోగ్యానికి..

రోజూ అవకాడో తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ముప్పు గణనీయంగా తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

Image credits: Getty
Telugu

ఆకలి నియంత్రణ

అవకాడోలో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇది కడుపు నిండిన భావనను కలిగించి, అతిగా తినడాన్ని నివారిస్తుంది.

Image credits: freepik
Telugu

మలబద్ధకానికి చెక్

అవకాడోలో కరిగే, కరగని ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం రాకుండా చూస్తుంది.

Image credits: Getty
Telugu

కంటికి రక్షణ

అవకాడోలో ఉండే ల్యూటిన్, జియాక్సంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు వయసుతో పాటు వచ్చే మాక్యులార్ డీజెనరేషన్ నుంచి కళ్లను కాపాడతాయి.

Image credits: Getty
Telugu

బీపీ కంట్రోల్

అవకాడోలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలోని సోడియం స్థాయిలను తగ్గించి, రక్తనాళాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది.

Image credits: Getty
Telugu

ఫోలెట్ పుష్కలం

గర్భధారణ సమయంలో శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమైన ఫోలేట్ అవకాడోలో పుష్కలంగా లభిస్తుంది.

Image credits: Getty
Telugu

చర్మ సంరక్షణకు బెస్ట్

అవకాడోలో ఉండే విటమిన్ సి, విటమిన్ ఇ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడతాయి. 

Image credits: Getty

Sarees: పండుగలకు ఇలాంటి చీరలు అదిరిపోవడం ఖాయం

Saree Designs: పండగ వేళ మీ అందాన్ని రెట్టింపు చేసే చీరల డిజైన్లు

Gold Ring: గ్రాండ్ లుక్ ఇచ్చే గోల్డ్ రింగ్స్.. చూస్తే ఫిదా అయిపోతారు!

Anklet Designs: మగువలు మెచ్చే గోల్డ్ ప్లేటెడ్ పట్టీలు.. ఎంత బాగున్నాయో