వెండి ఉంగరాలు పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
చాలా మంది బంగారు ఉంగరాలనే పెట్టుకుంటుంటారు. ఎక్కడో కొంతమంది మాత్రమే వెండి ఉంగరాలను పెట్టుకుంటారు. కానీ ఈ వెండి ఉంగరాలను పెట్టుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?
బంగారం కంటే వెండి ఆభరణాలకే ధర తక్కువగా ఉంటుంది. కానీ వెండికంటే బంగారు ఆభరణాలనే చాలా మంది ధరిస్తారు. కానీ వెండి ఆభరణాలు కూడా మీరు అందంగా కనిపించేలా చేస్తాయి. అంతకు మించి మీకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా వెండి ఉంగరాలను వేళ్లకు ధరించడం వల్ల మీరు నమ్మలేని ప్రయోజనాలను పొందుతారు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం పదండి.
ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది
మన ఇమ్యూనిటీ పవర్ ఎంత ఎక్కువగా ఉంటే.. మనం అంత ఆరోగ్యంగా ఉంటాం.. ఎన్నో రోగాలకు దూరంగా ఉంటాం. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే దగ్గు, జలుబు, సీజనల్ వ్యాధులతో పాటుగా ఎన్నో రోగాలు వస్తాయి.
అయితే వెండి ఉంగరాలను ధరించడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎలా అంటే.. వెండిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో అంటువ్యాధులకు మీరు దూరంగా ఉంటారు.
రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
మన శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటే మనం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటాం. అయితే వెండి మన శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపర్చడానికి బాగా ఉపయోగపడుతుంది.
వెండి శరీరంలో విద్యుదయస్కాంత వికిరణాన్ని ప్రతిబింబించే వాహక క్షేత్రాన్ని సృష్టిస్తుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది
శారీరక ఆరోగ్యమే కాదు.. మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే. మానసిక ఆరోగ్యం దెబ్బతింటే శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అయితే వెండి మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడానికి సహాయపడుతుంది.
వెండిలో ఉండే శీతలీకరణ గుణాలు మనసును శాంతపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇది ఒత్తిడిని తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.
నొప్పి నివారణ
వెండి ఆభరణాలు కూడా నొప్పి నివారణగా ఉపయోగపడతాయి. వెండిలో యాంటీ అలర్జీ లక్షణాలు ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులతో పాటుగా శరీర అసౌకర్యాన్ని తగ్గించడానికి కూడా సహాయపడతాయి.
పాజిటివ్ ఎనర్జీ
వెండి ఆభరణాలు మనకు పాజిటీవ్ ఎనర్జీని అందించడానికి కూడా ఉపయోగపడతాయి. శుక్రుడి నుంచి వెలువడే పాజిటివ్ ఎనర్జీ శారీరక శక్తిని, మానసిక స్పష్టతను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
పిత్తం లక్షణాలు తెలుస్తాయి
వెండి ఉంగరాలు పెట్టుకున్న కొన్ని రోజులకు రంగుల మారడం చాలా సహజం. అయితే మీరు ధరించిన వెండి ఉంగరం కాలక్రమేణా నలుపు రంగులోకి మారినట్టైతే మీ శరీరంలో పిత్తం ఎక్కువగా లేదా వేడి ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతారు. అది నలుపు రంగులోకి మారకపోతే మీ శరీరం బాగుందని అర్థం.
వెండి ఉంగరాలే కాదు వెండి ఆభరణాలను ధరించిన ఆడవారు, మగవారు దగ్గు, జలుబు, సంక్రమణ, ఫ్లూ, వైరస్, బ్యాక్టీరియా మొదలైన వాటికి దూరంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు,
వెండి ఆభరనాలు మన ఎముకల నిర్మాణానికి కూడా సహాయపడతాయట. అలాగే చర్మానని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
మీరు ధరించిన వెండి ఆభరణాలు కొన్ని రోజుల తర్వాత నీలం రంగులోకి మారితే.. మీ శరీరంలో సోడియం స్థాయిలు ఎక్కువగా ఉన్నట్టు అర్థం చేసుకోవాలి.ఇలా వెండి ఆభరణాలు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.