How to Control Anger: కోపం వచ్చినప్పుడు అలా చేయండి..వెంటనే మనసు ప్రశాంతం అవుతుంది
How to Control Anger: కోపం రావడం సహజమే. కొందరు చిన్న విషయానికి కోప్పడిపోతారు. అదే ఆలోచనలో ఉండి డే అంతా చికాకుగా ఉంటారు. కొన్ని చిన్న అలవాట్లు పాటిస్తే కోపాన్ని ఈజీగా తగ్గించుకోవచ్చు.

మరి కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలుసా?
మనిషికి కోపం రావడం సహజం, కానీ ఆ కోపాన్ని ఎలా నియంత్రించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్కసారిగా వచ్చే కోపం వల్ల మాటలు, నిర్ణయాలు తప్పుగా మారే అవకాశం ఉంటుంది. చాలా సార్లు కోపంలో మాట్లాడిన మాటలు అనర్థాలకు దారి తీస్తుంది.అందుకే అంటారు...కాలు జారితే తీసుకోవచ్చు గానీ, నోరు జారితే తీసుకోలేమని. కోపంలో తప్పుగా మాట్లాడితే మనసుపై, బంధాలపై ప్రభావం చూపుతుంది. అందుకే కోపాన్ని కంట్రోల్ చేయడం ప్రతి ఒక్కరికీ అవసరం. మరి కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలుసా?
మాట్లాడే ముందు 10 సెకన్లు ఆగండి లేదా అంకెలు లెక్కపెట్టండి
కోపంగా ఉన్నప్పుడు వెంటనే రియాక్ట్ కావడం మంచిది కాదు. ఆ సమయంలో మన భావోద్వేగాలు ఎక్కువగా పనిచేస్తాయి. అందుకే కోపం వచ్చినప్పుడు కాసేపు ఆగి 10 సెకన్ల మౌనం చాలా పెద్ద గొడవను తప్పిస్తుంది. 10 సెకన్లు ఆగడం వల్ల 10 గంటల మనశ్శాంతిని ఇస్తుంది.
గొడవ జరిగే ప్రదేశం నుంచి కాసేపు దూరంగా వెళ్లండి
కోపం ఎక్కువగా ఉన్నప్పుడు అదే చోట ఉంటే పెరిగే అవకాశం ఉంటుంది.అలాంటి సమయంలో కాసేపు పక్కకు వెళ్లిపోవడం చాలా ఉత్తమం. ప్లేస్ మారితే ఆలోచనలు కూడా కొంచెం మారుతాయి. దూరంగం ఉండటం వల్ల మనసు ప్రశాంతంగా మారి పరిస్థితిని స్పష్టంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.
డీప్‍గా ఊపిరిపీల్చుకోండి
డీప్ బ్రీతింగ్ అంటే లోతుగా ఊపిరి పీల్చి పీల్చుకోవాలి. ఇది మనసులో ఉన్న చికాకును క్లీన్ చేస్తుంది. నీరు తాగడం వల్ల శరీరం, గొంతు చల్లబడుతుంది. దాంతో మనసు కూడా కొంత ప్రశాంతంగా మారుతుంది. ఇది చిన్న అలవాటు అయినా కోపాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
కోపం వచ్చినప్పుడు గ్లాస్ చల్లని నీరు తాగండి
బాగా కోపం వచ్చినప్పుడు శరీరం వేడెక్కినట్లు అనిపిస్తుంది. కొందరికి చెమటలు పడతాయి. అలాంటి సమయంలో ఒక గ్లాస్ చల్లని నీరు తాగడం మంచిది. నీరు తాగడం వల్ల శరీరం, గొంత చల్లబడుతుంది. దాంతో మనసు కూడా కొంత ప్రశాంతంగా మారుతుంది.
కొద్దిసేపు వాకింగ్ లేదా వ్యాయామం చేయడం
కోపం ఎక్కువగా ఉన్నప్పుడు కాసేపు వాకింగ్ చేస్తే మనసు తేలికపడుతుంది. వ్యాయామం చేయడం వల్ల బాడీలో ఉండే కొలెస్ట్రాల్‌తో పాటు కోపం కూడా కరుగుతుంది. 10 నిమిషాలు వాకింగ్ చేస్తే టెన్షన్ తగ్గుతుంది.

