MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Death In Flight: విమానంలో సడెన్ గా ఎవరైనా చనిపోతే ఏం చేస్తారు..?

Death In Flight: విమానంలో సడెన్ గా ఎవరైనా చనిపోతే ఏం చేస్తారు..?

 Death In Flight: విమానం గాలిలో ఎగురుతున్నప్పుడు సడెన్ గా ఎవరైనా చనిపోతే ఏం చేస్తారు? ఎలాంటి చర్యలు తీసుకుంటారు? చనిపోయిన వ్యక్తి బాడీని ఎలా వారి కుటుంబ సభ్యులకు చేరుస్తారో మీకు తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : May 05 2026, 02:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Death in Flight
Image Credit : Getty

Death in Flight

మనిషికి చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఒక్కొక్కరికి ఒక్కో సమయంలో ఒక్కోలా పరిచయం అవుతుంది. అయితే, ఎప్పుడైనా ఊహించారా? పొరపాటున ఎవరైనా సడెన్ గా హార్ట్ ఎటాక్ తో కానీ లేదా ఇంకేదైనా మెడికల్ ఎమర్జెన్సీతో కానీ చనిపోతే ఏం జరుగుతుంది? విమాన సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలుసా? ఇలాంటి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఏం చేయాలి అనే విషయంలో ముందుగానే విమాన సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తారట. మరి, వారు ఎలా స్పందిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
డెడ్ బాడీ ని ఏం చేస్తారు?
Image Credit : X

డెడ్ బాడీ ని ఏం చేస్తారు?

విమానం గాలిలో ఎగురుతున్నప్పుడు సడెన్ గా ఎవరైనా చనిపోతే వెంటనే విమానంలో సిబ్బంది మొదటగా కెప్టెన్ కి తెలియజేస్తారు. విమానంలో డాక్టర్ లేదా వైద్య నిపుణులు ఉంటే.. వారి హెల్ప్ తీసుకుంటారు. వారి మరణాన్ని డాక్టర్లు అధికారికంగా నిర్ధారించాల్సి ఉంటుంది.

వాళ్లు నిజంగా చనిపోయారు అని నిర్ధారించుకున్న తర్వాత డెడ్ బాడీని ఎక్కడికీ తరలించరు. మరణించిన వ్యక్తి కళ్లకు గంతలు కట్టి, దుప్పటితో కప్పుతారు. మృతదేహాన్ని సీట్ బెల్ట్ తో టై చేస్తారు. విమానంలో ఖాళీ ఉంటే.. వేరే సీటుకు మారుస్తారు.

33
ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తారా?
Image Credit : X

ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తారా?

ప్రయాణికుడు చనిపోయిన వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయరు.విమానం ఎక్కడ ఉంది? ఎంత దూరం ప్రయాణించాలి? అనే విషయాలపై ఆధారపడి ఉంటుంది. అంతేకాదు, వైద్యుల సలహా మేరకు కెప్టెన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటారు.విమానం ల్యాండ్ చేసిన తర్వాత, మొదట ఇతర ప్రయాణికులను సురక్షితంగా దించుతారు. ఆ తర్వాత సంబంధిత అధికారుల సమక్షంలో మృతదేహాన్ని బయటకు తీస్తారు.

అలా కాకుండా, ప్రయాణికుడు బతకడానికి చిన్న అవకాశం ఉన్నా.. విమానాన్ని సమీపంలోని విమానాశ్రయంలో ఎమర్జెనీ ల్యాండింగ్ చేస్తారు. అలా కాకుండా విమానంలోనే ప్రాణాలు కోల్పోతే వీలైనంత వరకు అత్యవసర ల్యాండింగ్ చేయరు. విదేశాల్లో ల్యాండింగ్ చేయాల్సి వస్తే.. మృతదేహాన్ని అక్కడే దించాల్సి వస్తుంది. దీని వల్ల పోస్టుమార్టం సహా, చాలా లీగల్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే.. గమ్యస్థానం వచ్చే వరకు డెడ్ బాడీని విమానంలోనే ఉంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

విమానం ల్యాండ్ కావడానికి ముందు పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి తెలియజేస్తారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత, వైద్య బృందాలు , పోలీసులు విమానంలోకి ప్రవేశించి తనిఖీలు నిర్వహిస్తారు. ఆ తర్వాతే మృతదేహాన్ని కిందకు దించుతారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chitti Mutyalu Mutton Pulav: వీకెండ్ సెట్ చేసే టాప్ నాచ్ మటన్ పులావ్..
Recommended image2
Cockroaches: ఇంట్లో బొద్దింకలు తిరుగుతున్నాయా? ఇదొక్కటి చేస్తే.. మళ్లీ ఇంట్లో బొద్దింకలు తిరగవు..!
Recommended image3
Vinayaka Chavithi Prasadam Recipes: బొజ్జ గణపయ్యకు ఇష్టమైన 5 ప్రసాదాలు..హడావిడి లేకుండా గంటలో రెడీ
Related Stories
Recommended image1
Things Ban In Flight: విమానం ఎక్కుతున్నారా? మీ బ్యాగ్ లో ఇవి ఉంటే.. విమానం ఎక్కలేరు..!
Recommended image2
Garlic Storage: ఇలా నిల్వ చేస్తే సంవత్సరమైనా వెల్లుల్లి తాజా ఉంటుంది, ఒక్క రెబ్బ కూడా పాడవ్వదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved