MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Traffic Rules: కారులో తిన్నా, కాఫీ తాగడం కూడా నేరమే, పెట్రోల్ అయిపోయినా ఫైన్ కట్టాల్సిందే

Traffic Rules: కారులో తిన్నా, కాఫీ తాగడం కూడా నేరమే, పెట్రోల్ అయిపోయినా ఫైన్ కట్టాల్సిందే

Traffic Rules: సీటు బెల్టు పెట్టుకోకపోయినా, ఆల్కహాల్ తాగి కారు నడిపినా మన దేశంలో శిక్ష తప్పదు. అయితే, కొన్ని దేశాల్లో కారులో ఫుడ్ తిన్నా నేరమే. మధ్యలో పెట్రోల్, డీజిల్ అయిపోయి కారు ఆగినా  జాలి చూపరు.  వివిధ దేశాల్లో  ట్రాఫిక్ రూల్స్ ఇప్పుడు చూద్దాం 

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 04 2026, 11:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఇలాంటి వింత ట్రాఫిక్ రూల్స్ మీరు విన్నారా?
Image Credit : chat GPT

ఇలాంటి వింత ట్రాఫిక్ రూల్స్ మీరు విన్నారా?

నీళ్లు చింది పడినా నేరమే..

వర్షాకాలం వచ్చిందంటే.. రోడ్డు మీద చాలా నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లల్లో కారులో వెళితే.. పక్కన ఉన్నవాళ్ల మీద ఆ బురద నీళ్లు పడటం చాలా కామన్ గా జరుగుతుంది. మన దగ్గర దీనిని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ.. జపాన్ లో అయితే.. కచ్చితంగా జరిమానా కట్టాల్సిందే. అందుకే అక్కడ కారు నడిపేవారు.. నీటి గుంటలు ఉంటే చాలా జాగ్రత్తగా, చాలా నెమ్మదిగా వాహనాన్ని నడుపుతారు. ఇదే రూల్ యూకే( యునైటెడ్ కింగ్డమ్) లో కూడా ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పెట్రోల్, డీజిల్ అయిపోయినా నేరమే...
Image Credit : chat GPT

పెట్రోల్, డీజిల్ అయిపోయినా నేరమే...

కారు ప్రయాణం చేస్తున్నామంటే చాలా మంది ముందు రోజు ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటారు. ఎప్పుడైనా మర్చిపోయి.. దారి మధ్యలో ఇంధనం ఆగిపోతే..చాలా ఇబ్బందిపడాల్సి ఉంటుంది. ఎవరి కారు అయినా రోడ్డు మీద ఆగిపోతే అయ్యో పాపం అని జాలిపడతాం.. వారికి పెట్రోల్, డీజిల్ తెచ్చుకోవడానికి హెల్ప్ చేసేవాళ్లు కూడా ఉంటారు. అయితే.. ఇదంతా మన దగ్గర.. అదే జర్మనీలో అయితే... పాపం కాదు కదా.. కారు మధ్యలో ఆగిపోయినందుకు ఫైన్ కట్టాలి.

33
కారులో తినడం, తాగడం కూడా నేరమే..
Image Credit : chat GPT

కారులో తినడం, తాగడం కూడా నేరమే..

ఇక, మన దగ్గర ఆల్కహాల్ తాగి వాహనం నడపకూడదు. కానీ.. కాఫీ, టీ , జ్యూస్ లాంటివి తాగడాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ..సైప్రస్ అనే దేశంలో ఇది కూడా నేరమే. మీరు కారులో కాఫీ తాగినా, శాండ్విచ్ లాంటి స్నాక్స్ తిన్నా కూడా భారీగా జరిమానా కట్టాల్సిందే. డ్రైవింగ్ చేస్తూ ఇలాంటివి చేయడం వల్ల ఫోకస్ తగ్గి.. ప్రమాదాలు జరుగుతాయని అక్కడి వారు భావిస్తారు. అందుకే.. ఇంకోసారి అలా చేయకుండా ఉండేందుకు ఫైన్ కట్టాల్సిందే.

కారు డోర్ గట్టిగా వేశారో.. ఫైన్ కట్టాల్సిందే..

ఇక.. మనలో చాలా మంది తమ కోపాన్ని కార్లపై కూడా చూపిస్తారు. కారు డోర్లను గట్టిగా వేస్తారు. ఎవరైనా అడిగితే..నా కారు నా ఇష్టం అని సమాధానం చెబుతారు. కానీ.. స్విట్జర్లాండ్ లో మాత్రం అలా కాదు. మీరు మీ కారు డోర్ గట్టిగా మూసినా కూడా జరిమానా కట్టాల్సిందే.ఇలా కారు గట్టిగా మూయడం వల్ల పక్కన వాళ్లకు ఏమైనా ఇబ్బంది అనిపించి.. వాళ్లు కనుక కంప్లైంట్ చేస్తే.. మీరు ఫైన్ కట్టక తప్పదు.

చెప్పులు వేసుకోకపోయినా, షర్ట్ వేసుకోకపోయినా నేరమే...

మీరు కారు నడిపేటప్పుడు కాళ్లకు చెప్పులు లేకపోతే..స్పెయిన్ లో జరిమానా కట్టాల్సిందే. ఇక.. థాయిలాండ్ లో మీరు కారు లేదా.. బైక్ నడిపేటప్పుడు షర్ట్ ధరించకపోతే.. జరిమానా కట్టాల్సిందే. థాయిలాండ్ లో వేడి తట్టుకోలేక చాలా మంది.. షర్ట లేకుండా తిరగాలి అనుకుంటన్నారు. కానీ.. అలా బయటకు వస్తే ఫైన్ వేస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
DMart : డీమార్ట్‌లో సరుకులు కొంటున్నారా? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే, లేదంటే నష్టపోతారు
Recommended image2
ఎవరో ఏదో అంటున్నార‌ని మనసు పాడు చేసుకుంటున్నారా.? ఈ కథ చదివితే భారం తగ్గడం ఖాయం
Recommended image3
Flight: విమానంలో ఆల్క‌హాల్ తాగితే ఏమ‌వుతుందో తెలుసా.?
Related Stories
Recommended image1
Cleanest Village: ఈ ఊరిలో ఎంత వెతికినా చిన్న చిత్తు కాగితం కూడా దొరకదు.. కానీ ఇక్కడికి ఆదివారం మాత్రం వెళ్లలేరు..!
Recommended image2
Sudheer Babu: సుధీర్ బాబుతో పెళ్లికి.. మహేష్ చెల్లి పెట్టిన కండిషన్ ఏంటి..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved