ఎక్కువ సేపు సాక్స్ లు వేసుకుంటే ఏమౌతుందో తెలుసా?
స్కూల్ పిల్లల నుంచి ఆఫీసులకు వెళ్లేవారి వరకు చాలా మంది సాక్సులను పొద్దంతా వేసుకుంటుంటారు. కానీ ఇలా చాలా సేపటి వరకు సాక్సులను వేసుకుంటే ఏమౌతుందో తెలిస్తే మళ్లీ మీరు అలా వేసుకునే సాహసం కూడా చేయరు తెలుసా?

socks
స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలతో పాటుగా ఆఫీసులకు వెళ్లే చాలా మంది సాక్సులను ఖచ్చితంగా వేసుకుంటారు. వీళ్లు సుమారుగా ఏడెనిమిది గంటలైనా సాక్సులను ఖచ్చితంగా వేసుకుంటుంటారు. కానీ సాక్సులను ఎక్కువ సేపు వేసుకుంటే ఎన్నో సమస్యలు వస్తాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. సాక్సులను ఎక్కువ సేపు వేసుకుంటే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బాక్టీరియల్ ఇన్ఫెక్షన్
సాక్సులను ఎక్కువ సేపు వేసుకోవడం వల్ల కాళ్లలో విపరీతమైన చెమట పడుతుంది. ఎక్కువ సేపు చెమట ఉండటం వల్ల బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సమస్య, పాదాలపై పుండ్లు ఏర్పడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నిద్రకు భంగం
కొంతమంది నిద్రపోయేటప్పుడు కూడా సాక్సులను వేసుకుంటుంటారు. ముఖ్యంగా చలికాలంలో. ఎందుకంటే సాక్సులను వేసుకోవడం వల్ల కాళ్లకు చలి ఎక్కువగా పెట్టదు. కానీ నిద్రపోయేటప్పుడు సాక్సులను వేసుకోవడం వల్ల కాళ్లలో అసౌకర్యం కలుగుతుంది. దీంతో మీకు సరిగ్గా నిద్రపట్టదు.
రక్త ప్రవాహం ప్రభావితం
సాక్సులను ఎక్కువ సేపు వేసుకోవడం వల్ల కాళ్లలో రక్త ప్రవాహం దెబ్బతింటుంది. అంటే కాళ్లక రక్తం సరిగ్గా అందదు. దీనివల్ల కాళ్లు తిమ్మిరి పడతాయి. అలాగే కాళ్లు వాపు కూడా వస్తాయి. అందుకే సాక్సులను ఎక్కువ సేపు వేసుకోకూడదు.
వాసన
ఈ అనుభవం చాలా మందికి ఉంటుంది. సాక్సులను చాలా సేపటిదాకా వేసుకోవడం వల్ల విపరీతంగా చెమట పడుతుంది. దీనివల్ల పాదాల నుంచి దుర్వాసన వస్తుంది. దీనివల్ల మీరు ఇతరుల ముందు అసౌకర్యంగా, ఇబ్బందిగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది.
వేడి పెరగడం
చలికాలంలో సాక్సులను వేసుకుంటే పాదాలు వేడిగా ఉంటాయి. కాళ్లలో వేడి పెరుగుతుంది. కానీ ఎక్కువ సాక్సులను వేసుకోవడం వల్ల వచ్చే వేడి రక్త నాళాలు విస్తరించేలా చేస్తుంది. ఇది మీకు ఎన్నో అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది.