Telugu

చలికాలంలో తులసి మొక్కను ఇలా కాపాడుకోండి

Telugu

తులసి మొక్కను పెంచే చిట్కాలు

చలికాలంలో తులసి మొక్క బలహీనపడి ఎండిపోయినట్టు అవుతుంది. మీరు తులసి మొక్కను  బతికించుకోవాలంటే కొన్ని ఇంటి చిట్కాలను పాటించాలి.

Image credits: google
Telugu

పసుపు, సైంధవ లవణం లేపనం

తులసి మొక్క కాండం నల్లగా మారుతుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని భావించాలి. ఇందుకోసం చిటికెడు పసుపు, చిటికెడు సైంధవ లవణం నీటితో కలిపి పేస్ట్ చేసి అప్లై చేయాలి.

Image credits: Social media
Telugu

తులసి మట్టిలో ఎండిన బూడిద

పల్లెటూళ్లలో ఎక్కువగా పాటించే పద్ధతి ఇది. చెక్క కాలిన తరువాత వచ్చే బూడిదను తులసి మొక్క నాటిన మట్టి పైపొరలో కలపాలి.

Image credits: Social media
Telugu

చల్లగాలి తగలకుండా

ఈ పద్ధతి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. రాత్రి చలి ఎక్కువగా ఉంటే మట్టి కుండను లేదా ఏదైనా పెద్ద గిన్నెలను తులసిపై బోర్లించాలి. ఇది మొక్కను చలి నుంచి కాపాడుతుంది.

Image credits: facebook
Telugu

బెల్లం అల్లంతో కషాయం

ఒక గ్లాసు నీటిలో పావు స్పూను బెల్లం తురుము, అల్లం తురుము వేసి మరిగించాలి. దాన్ని చల్లార్చి వారానికి ఒకసారి మొక్క అంచుల్లో పోయాలి. ఇది మట్టిలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది.

Image credits: social media
Telugu

ఎండిన ఆకులను తీయొద్దు

చాలామంది ఎండిన ఆకులను దీసి పడేస్తారు. కానీ చలికాలంలో వాటిని తీయకూడదు. ఇది మట్టిని వెచ్చగా ఉంచి, వేర్లను చలి నుంచి కాపాడుతుంది. అవన్నీ మొక్క మొదట్లోనే వేయడం మంచిది.

Image credits: facebook
Telugu

చలికాలంలో రక్షణ

రాత్రిపూట చలి అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ మొక్కని రాత్రి హాల్లో చల్లగాలి తగలకుండా కాపాడుకోవాలి. ఉదయం పూట బయటపెట్టుకోవాలి.

Image credits: Getty
Telugu

సూర్య కాంతి

చలికాలంలో ఉదయం కొంత సమయం ఎండకాస్తుంది. ఆ సమయంలో ఎండ తగిలేలా తులసి మొక్కను ఉంచాలి.

Image credits: Getty

బీపీని కంట్రోల్ చేసే 5 బెస్ట్ ఫుడ్స్ ఇవిగో!

1 గ్రాములో గోల్డ్ రింగ్స్.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో

సమంత జ్యువెలరీ కలెక్షన్ అదుర్స్

చియా సీడ్స్ ఎక్కువగా తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?