ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు ఇలా ప్రవర్తిస్తారట..
తీవ్రమైన డిప్రెషన్ తో బాధపడేవారు లేదా ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారి ప్రవర్తన తేడాగా ఉంటుంది. ఇతర వ్యక్తులుగా వీరు అస్సలు ఉండరు. మరి ఇలాంటి వారి లక్షణాలు ఎలా ఉంటాయి? వారెలా ప్రవర్తిస్తారు? వారి పనులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం పదండి..

ప్రస్తుత కాలంలో సూసైడ్ చేసుకునే వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. గణాంకాల ప్రకారం.. ఆత్మహత్యలకు పాల్పడే వారి సంఖ్య ఏడాదికేడాదికి పెరిగిపోతోందట. పరీక్షల్లో తప్పామనో, బెస్ట్ ర్యాంక్ రావడం లేదనో, పెళ్లి కావడం లేదనో, భర్త వేధింపులను తట్టుకోలేక, వరకట్న వేధింపుని.. ఎన్నో కారణాలతో ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నారు.
అయితే ఆత్మ హత్య చేసుకోవాలనుకునే వారు చనిపోవడానికి కొన్ని రోజుల మందు విచిత్రంగా ప్రవర్తిస్తారట. అందరిలా కాకుండా డిఫరెంట్ గా ప్రవర్తిస్తుంటారని మానసిక నిపుణులు చెబుతున్నారు. అందులోనూ వారు మానసిక వేదనకు గురవుతారట. ముఖ్యంగా వీరిలో ఎంతోమంది తీవ్రమైన డిప్రెషన్ లో బాధపడుతున్నట్టు తేలింది. వీరు కుటుంబ సభ్యుల ముందు లేదా స్నేహితుల ముందు నవ్వుతూ కనిపించినా.. మనసులో మాత్రం విపరీతమైన బాధతో కుమిలిపోతుంటారట. వారి బాధ ఎవరికీ కనిపించనిది. ఇలాగే కొంతకాలం పాటు డిప్రెషన్ తో తో బాధపడి చివరకు ఆత్మహత్యకు పాల్పడతారని మానసిక నిపుణులు చెబుతన్నారు.
ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన ఉన్నవారిని, తీవ్రమైన డిప్రెషన్ తో బాధపడేవారిని కొన్ని లక్షణాల ద్వారా కనిపెట్టొచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు. అలాంటి వారిని గుర్తిస్తే వారికి కౌన్సిలింగ్, వైద్యం చేయించి తిరిగి మామూలు మనుషులుగా చేయొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
లక్షణాలు: ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు తీవ్రమైన నిద్రలేమి సమస్యతో బాధపడతారు. ముఖ్యంగా వీరు అర్థరాత్రైనా మేల్కొనే ఉంటారు. తెల్లవార్లూ ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు.
ఆహారాన్ని తినడానికి ఇంట్రెస్ట్ చూపకపోవడం. బలవంతం చేసినా.. ఏదో తిన్నామా అంటే తిన్నామనిపించడం. కొసరికొసరి తినడం. లేదా అతిగా తినడం వంటివి చేస్తుంటారు.
ఎలాంటి పనులు చేయకపోయినా అలసిపోతుంటారు. అంతేకాదు పనులు అస్సలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపరు. ప్రతి విషయానికి కూడా విసుగుపడుతూ ఉంటారు.
వాళ్లకు వాళ్లే గాయలు చేసుకోవాలనుకుంటారు. ముఖ్యంగా నాకెవ్వరూ లేరు. నాకు ఎవరూ సాయం చేయడం లేదని.. అన్నదే మళ్లీ మళ్లీ అంటూ బాధపడుతుంటారు.
నలుగురితో మాట్లాడటానికి అస్సలు ఇష్టపడరు. ముఖ్యంగా మందిలో ఉండలేరు. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికే ప్రయత్నిస్తారు. ఎప్పుడూ ఈ లోకంతో పనిలేదన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారి లోకం వారిదే.
ఈ మార్పులు మీ కుటుంబ సభ్యుల్లో లేదా స్నేహితుల్లలో గుర్తిస్తే వారిని నిత్యం గమనిస్తూ ఉండాలి. అయితే వారు డిప్రెషన్ తో బాధపడుతున్నారా లేదో అడిగి తెలుసుకోవాలి. వారి ఆరోగ్యం బాగుందో లేదో కనుక్కోవాలి. ఎలాంటి లక్షణాలున్నాయో అడగాలి. మీరు తక్కువగా మాట్లాడుతూ.. వారిని ఎక్కువ మాట్లాడేలా చూసుకోవాలి. అప్పుడే వారు వారి ఫీలింగ్స్ ను మీతో చెప్పుకోగలుగుతారు. దాంతో వారు రిలాక్స్ గా ఫీలవుతారు. అంతేకాదు వారిని మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్తే వారి మైండ్ సెట్ మారొచ్చు. వారి మానసిక, ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు మెడిసిన్స్ కూడా ఇవ్వొచ్చు.