MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Weight Loss Tips: బరువు తగ్గాలనుకునే వారికి నిపుణులు సూచిస్తున్న మార్గాలివే..

Weight Loss Tips: బరువు తగ్గాలనుకునే వారికి నిపుణులు సూచిస్తున్న మార్గాలివే..

Weight Loss Tips: అధిక బరువును తగ్గించుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. కొందరు వ్యాయామాలు చేస్తే.. మరికొందరు సరైన డైట్ ను ఫాలో అవుతుంటారు. వీటితో పాటుగా వంటగదిలో కొన్ని మార్పులు చేయడం ద్వారా కూడా శరీర బరువును ఈజీగా కోల్పోవచ్చంటున్నారు నిపుణులు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 06 2022, 11:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

Weight Loss Tips: ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య స్థూలకాయం. ఈ సమస్య నుంచి త్వరగా బయటపడేందుకు చాలా మంచి రకరకాల పద్దతులను అనుసరిస్తున్నారు. కొందరు సరైన డైట్ విధానాన్ని పాటిస్తే.. మరికొందరు వ్యాయామాలు చేస్తున్నారు. అయితే వీటితో పాటుగా కిచెన్ లో కొన్ని రకాల మార్పులు చేయడం ద్వారా కూడా వెయిట్ లాస్ అవ్వొచ్చంటున్నారు నిపుణులు. వీటిని క్రమం తప్పకుండా పాటిస్తే నెలకు కిలో చెప్పున బరువు కోల్పోవచ్చని మరో అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఇంతకి వంటింట్లో ఎలాంటి మార్పులు చేయాలి? పదండి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..

26

చాలా మంది బయట కనిపించిన చిరుతిండ్లను ఇంట్లోకి తెచ్చి కిచెన్ లో కంటికి స్పష్టంగా కనిపించేలా పెడుతుంటారు. ఇక వంటింట్లోకి వెళ్లినప్పుడల్లా అవి కనిపిస్తే మన మనస్సు ఊరుకుంటదా.. వాటిని తినాలని మనసు లాగుతుంటది. ఇంకేముంది వాటిని అందుకుని దర్జాగా తినేస్తుంటాం.. దీని వల్ల కూడా వెయిట్ పెరిగే అవకాశముందని పలు అధ్యయానాలు చెబుతున్నాయి. కాబ్టటి మీ వంటింటి నుంచి బిస్కెట్లు, స్నాక్స్, చిరుతిండ్లు, చిప్స్ వంటివి ఉండకుండా చూసుకోండి. అయితే ఒకవేళ మీకు స్నాక్స్ తినాలనిపిస్తే ఇంట్లో చేసుకున్నవే చేసుకుని మితంగా తినండి. అంతేకాదు మీ కిచెన్ లో ఆరోగ్యానికి మంచి చేసే గింజలు, డ్రై ఫ్రూట్స్ వంటివి ఉండేలా చూడండి.

36

చాలా మంది తమ రిఫ్రిజిరేటర్లలో ఎక్కువగా Soft drinks, Candice‌, ఐస్ క్రీమ్స్ వంటివే ఎక్కువగా నిల్వ చేస్తారు. వీటిలో అధిక క్యాలరీలు ఉంటాయి. వీటిని తినడం వల్ల బరువు పెరగడం పక్కాగా జరుగుతుంది. అందుకే వీటికి బదులుగా సీజనల్ ఫ్రూట్స్, క్యారెట్, బీట్ రూట్ వంటి వాటిని మీ ఫ్రిజ్ లల్లో నిల్వచేయండి. వీటిని మీకు సమయమున్నప్పుడల్లా తింటూ ఉండండి. వీటితో పాటుగా ఫ్రూట్ జ్యూస్ లను కూడా నిల్వ చేసుకుని వీలైనప్పుడల్లా తాగవచ్చు.
 

46

అధిక బరువుతో బాధపడేవారు ఫుడ్ ను ఎక్కువగా తీసుకునే అవకాశముంది. అలాంటి వారు భోజనాన్ని చిన్న ప్లేట్ లో చేస్తే ఆహారం తక్కువగా తీసుకుంటారని ఓ అధ్యయనం చెబుతోంది. దీని వల్ల కూడా మీరు బరువును సులభంగా కోల్పోవచ్చు. సో మీ వంటింట్లో పెద్ద ప్లేట్లకు బదులుగా చిన్న ప్లేట్లే ఉండేలా చూడండి.
 

56

 డైనింగ్ టేబుల్ మీద లేదా   కిచెన్ ప్లాట్ ఫామ్ పై చిరుతిండ్లను అస్సలు పెట్టకండి. వాటికి బదులుగా ఫ్రెష్ పండ్లను పెట్టండి. వీటివల్ల మీకు ఏదైనా తినాలని కోరికపుట్టినప్పుడు మీరు స్నాక్స్ కాకుండా మీకు ఇష్టమైన పండ్లనే తినగలుగుతారు.
 

66

చాలా మంది మాటిమాటికి వంటింట్లోకి ఎందుకు వెళ్లడమని వారికిష్టమైన స్నాక్స్ ను హాల్ లేదా బెడ్ రూమ్స్ లల్లోనే దాచేస్తుంటారు. ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు ఈజీగా తినొచ్చని. కాని వాటివల్ల మీకు ఆకలి వేయకున్నా తినాలనిపిస్తుంది. తద్వారా మీరు కొన్ని రోజుల్లోనే ఊబకాయం సమస్య బారిన పడే ప్రమాదముందని ఓ అధ్యయనం తేల్చి చెప్పింది. కాబట్టి బయట చిరుతిళ్లు ఇంట్లోకి తేకండి. ముఖ్యంగా ఈ అలవాటుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అవసరమనుకుంటే మీరు స్నాక్స్ ను తయారు చేసుకుని మితంగా తిన్నా ఏం ప్రాబ్లం ఉండదు. 

 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Summer Drinks: ఇవి తాగితే చాలు..వేసవి అంతా కూల్ కూల్‍గా ఉండొచ్చు
Recommended image2
Spring Onion Benifits: ఆహారంలో ఇవి తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image3
Baby Anklets: 15 గ్రాముల్లో చిన్నారుల కోసం వెండి పట్టీలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved