Weight Loss Diet: ఈ పప్పు దినుసులతో ఈజీగా బరువు తగ్గొచ్చు తెలుసా..
Weight Loss Diet: మిగతా కూరల కంటే పప్పు చారుతోనే ఒక ముద్ద ఎక్కువగా తింటామని చెప్పేవారు చాలా మందే ఉన్నారు. వేడి వేడి అన్నంలో పప్పుు చారుతో తింటుంటే వచ్చే ఆ రుచే వేరబ్బా. ఈ పప్పులు రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు కొన్ని రకాల పప్పులతో శరీర బరువును తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

pulses
Weight Loss Diet: మిగతా కూరల కంటే పప్పు చారుతోనే ఒక ముద్ద ఎక్కువగా తింటామని చెప్పేవారు చాలా మందే ఉన్నారు. వేడి వేడి అన్నంలో పప్పుు చారుతో తింటుంటే వచ్చే ఆ రుచే వేరబ్బా. ఈ పప్పులు రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు కొన్ని రకాల పప్పులతో శరీర బరువును తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పప్పుల్లో ప్రోటీన్లు, ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అంతేకాదు ఇవి కేలరీలు తక్కువగా ఉండే ఆహారం కూడా. ముఖ్యంగా పప్పుల్లలో ప్రోటీన్లు, లెక్టిన్లు, ఫైబర్, పాలీఫెనాల్స్ వంటి ఎన్నో పోషకాలు మెండుగా లభిస్తాయి. ఇవి మనం క్యాన్సర్ బారిన పడకుండా చేస్తాయి. అంతేకాదు ఊబకాయం, గుండె సంబంధిత సమస్యల నివారణలో కూడా చక్కగా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మన శరీరంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తాయి. అయితే ఏయే పప్పు దినుసులు బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..
మినప పప్పు: మినప పప్పుల్లో కేలరీలు, కొవ్వు పదార్థాలు తక్కువ మొత్తంలో ఉంటే పోషకాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేసేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ పప్పులో ఉండే విటమిన్ బి3, ప్రోటీన్ ఎముకలను బలంగా చేస్తాయి. అంతేకాదు ఇది మన స్టామినాను పెంచుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ పప్పును తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు మీ కడుపు నిండుగా ఉందన్న ఫీలింగ్ కలుగుతుంది.
శనగ పప్పు: శనగపప్పుతో చేసిన ఈ కూరైనా బలే టేస్టీగా ఉంటుంది. ఈ పప్పుల్లో కాల్షియం, ప్రోటీన్, పొటాషియం, ఐరన్ మెండుగా ఉంటాయి. ఇవి మీ గుండె ఆరోగ్యంగా ఎంతో అవసరం. అంతేకాదు ఈ శనగ పప్పు డయాబెటీస్ ను నియంత్రణలో ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రక్తపోటు నియంత్రణకు ఈ పప్పు ఎంతో సహాయపడుతుంది.
కందిపప్పు: కంది పప్పులో మాంసకృత్తులు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ పప్పులో ఐరన్, ఫైబర్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ మెండుగా ఉంటాయి. అంతేకాదు ఈ పప్పుల్లో మంచి కార్బోహైడ్రేట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మన ఆకలిని నియంత్రిస్తాయి. ఈ పప్పు హార్ట్ ప్రాబ్లమ్స్ తో బాధపడేవారికి చక్కటి మెడిసిన్ లా ఉపయోగపడుతుంది.
పెసర పప్పు: పెసర పప్పులో ప్రోటీన్లు మెండుగా లభిస్తాయి. డైటింగ్ చేసే వారికి ఇదే చక్కటి ఫుడ్. ఈ పప్పు చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే రక్త ప్రసరణ మెరుగ్గా జరిగేందుకు సహాయపడుతుంది. ఈ పప్పులో ఉండే కాల్షియం, పొటాషియం, ఐరన్ ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడతాయి. అంతేకాదు ఈ పప్పుతో కండరాల తిమ్మిర్ల సమస్య కూడా పోతుంది.