- Home
- Life
- Weight loss: నల్ల మిరియాలతో ఫాస్ట్ గా బరువు తగ్గడమే కాదు.. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి తెలుసా..
Weight loss: నల్ల మిరియాలతో ఫాస్ట్ గా బరువు తగ్గడమే కాదు.. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి తెలుసా..
Weight loss: నల్ల మిరియాల్లో ఎన్నో ఔషద గుణాలు దాగున్నాయి. వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటుగా చెడు కొలెస్ట్రాల్ సులువుగా కరిగిపోతుంది.

నల్ల మిరియాలు మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను సైతం తగ్గిస్తాయి. అందుకే ప్రతి వంటగదిలో ఇవి ఖచ్చితంగా దర్శనమిస్తుంటాయి. ఈ నల్లమిరియాలను ఆయుర్వేద మందుల్లో కూడా ఉపయోగిస్తారు. వీటిలో సోడియం, విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఎన్నో రోగాలను సైతం నయం చేస్తాయి. నల్ల మిరియాల వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కొలెస్ట్రాల్ పెరగదు
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను పెరగకుండా చేయడంలో నల్ల మిరియాలు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. నల్ల మిరియాలను తరచుగా తీసుకోవడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో గుండెపోటు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.
బరువు తగ్గుతారు
ప్రస్తుతం చాలా మంది అధిక బరువు, ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. దీనికంతటికి కారణం మారుతున్న జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్లు. ఇలాంటి పరిస్థితిలో నల్లమిరియాలను తీసుకుంటే అధిక బరువు సమస్య నుంచి సులువుగా బయటపడతారు. నల్లమిరియాల టీని తాగినా చక్కటి ఫలితం ఉంటుంది. ఇవి కేలరీలను కరిగిస్తాయి. దీనిలో ఉండే ఫైబర్ వల్ల ఆకలి తొందరగా కాదు.
కీళ్ల నొప్పులు తగ్గుతాయి
నల్ల మిరియాలు కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా ఎంతో సహాపడతాయి. వీటిని తరచుగా తీసుకుంటే వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి.
సీజనల్ వ్యాధులను తగ్గిస్తుంది
వర్షకాలం రాకతో చాలా మంది దగ్గు, జలువు, వైరల్ ఫీవర్ బారిన పడుతుంటారు. అయితే నల్ల మిరియాలను తీసుకోవడం వల్ల దీనిలో ఉండే పెప్పరిన్ అనే సమ్మేళనం ఈ సమస్యలను తగ్గిస్తుంది. ఇది శరీరానికి చాలా ప్రయోజనకరంగా కూడా ఉంటుంది.
నల్ల మిరియాల టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ఈ టీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. టెన్షన్, ఒత్తిడి, డిప్రెషన్ వంటి ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.