- Home
- Life
- Weight gain Tips:అమ్మాయిలూ.. సన్నగా ఉన్నామని బాధపడుతున్నారా..? అయితే ఈ టిప్స్ ను ఫాలో అయిపోండి..
Weight gain Tips:అమ్మాయిలూ.. సన్నగా ఉన్నామని బాధపడుతున్నారా..? అయితే ఈ టిప్స్ ను ఫాలో అయిపోండి..
Weight gain Tips for Girls: సన్నగా ఉన్నామని బాధపడే అమ్మాయిలూ.. ఇకనుంచి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ అద్బుత చిట్కాలను పాటిస్తే ఈజీగా బరువు పెరుగుతారు.

Weight gain Tips for Girls: కొంతమంది లావుగా ఉన్నామని బాధపడితే.. మరికొంతమంది సన్నగా ఉన్నామని బాధపడుతుంటారు. మరీ సన్నగా ఉన్నా.. లావుగా ఉన్నా.. శరీరాకృతి అంతగా బాగోదు. వయసుకు తగ్గట్టుగా నాజుగ్గా ఉంటేనే అందం, ఆరోగ్యం.
అయితే కొంతమంది వయసు పెరిగినా.. బరువు మాత్రం పెరగరు. సన్నగా, చూడటానికి పుల్లలా కనిపిస్తుంటారు. ఒంటికి కాస్త కండ పట్టాలంటే మాత్రం కొన్ని చిట్కాలను తప్పక పాటించాల్సిందే.
అమ్మాయిల కంటే.. అబ్బాయిలు ఎక్కువ బరువు ఉండటానికి కారణం.. వారు ఎక్కువగా ఆటలు ఆడుతుంటారు. దీనివల్ల వారికి ఆకలి అవుతుంది. ఇది సహజం. అయితే అమ్మాయిలు కూడా చాలా సులభంగా బరువు పెరగేందుకు ఇక్కడ చిట్కాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి..
తినాలి.. తింటేనే బరువు పెరుగుతారన్న ముచ్చట మీకు తెలిసి ఉండాలి. మీరు తినే ఆహారంలో మంచి కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలనే తింటూ ఉండాలి.
ముఖ్యంగా రోజుకు మూడు పూటలే తినాలి. ఎక్కువగా తినకూడదనే అపోహను వీడినప్పుడే మీరు బరువు పెరుగుతారు. రోజుకు నాలుగైదు సార్లు కొంచెం కొంచెంగా తినండి. ఇలా తింటే మీరు చక్కగా బరువు పెరుగుతారు.
ఒక టైం టేబుల్ ను తయారుచేసుకోండి. ప్రతి 3 గంటలకోసారి కొంచెం కొంచెం తినండి. మీరు తీసుకునే ఆహారంలో పాలు, పండ్లు, కూరగాయలు, మాంసం, గుడ్లు ఉండేట్టు చూసుకోండి. రోజంతా తినాలని ఒక్క భోజనాన్నే తినకండి. వీటితో పాటుగా మధ్య మధ్యలో ఆరోగ్యానికి మంచి చేసే స్నాక్స్ తినండి.
వ్యాయామం.. రోజు ఎక్సర్ సైజెస్ చేయడమో లేకపోతే.. ఇంట్లో పనులను చేస్తూ ఉండాలి. పనులను చేస్తే ఒంట్లో ఉండే కేలరీలు ఖర్చైపోతాయి.దాంతో మీ బాడీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. లేదంటే మీ ఒంట్లో కొవ్వు నిల్వలు పెరిగిపోయే ప్రమాదం ఉంది. దీంతో మీ శరీరాకృతి దెబ్బతినే ప్రమాదం ఉంది. జిమ్ కు వెళ్లే వారు ట్రేడ్ మిల్ పై ఒక అర్థగంట పై రన్నింగ్ చేస్తే చాలు మీ బాడీ పర్ఫెక్ట్ గా తయారవుతుంది.
కేలరీలను లెక్కించండి.. బరువు పెరిగేందుకు ఆహార నియమాలను ఒక పట్టికలో రాసుకోండి. అంతేకాదు ప్రతి వారం మీరు ఎంత బరువు పెరుగుతున్నారో చూసుకోండి. ఇలా చేయడం వల్ల మీరు బరువు పెరుగుతున్నారో లేదో ఇట్టే తెలిసిపోతుంది.
ముఖ్యంగా బరువు పెరగాలని ఏవి పడితే అవి అస్సలు తినకూడదు. కేలరీలు ఎక్కువ ఉండి.. షుగర్ కంటెంట్ తక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. ఇలా ప్రణాళికను సిద్దం చేసుకుంటే మీరు సులువుగా బరువు పెరుగుతారు.