క్రికెట్ మ్యాచ్ కోసం ముఖానికి పెయింట్ వేసుకుంటున్నారా? అయితే మీరిది ఖచ్చితంగా చదవాల్సిందే..!
క్రికెట్ అభిమానులంటే ఇలాగే ఉంటారు మరి. మన దేశమే గెలవాలని పూజలు చేస్తారు. ముఖానికి రంగులను కూడా వేసుకుంటుంటారు. కానీ ఈ రంగులు మీ చర్మాన్ని ఏం పాడు చేయవా? మీకు చర్మ సమస్యలు రావొద్దంటే మాత్రం..
Cricket Fans
క్రికెట్ పై ఉన్న అభిమానమే.. ప్రమాదాలను లెక్కచేయకుండా చేస్తుంది. సాధారణంగా క్రికెట్ ఫ్యాన్స్ ముఖానికి, జుట్టుకు, పెదాలకు రంగులను వేసుకుంటూ ఉంటారు. ఇవి వారి అభిమానాన్ని తెలియజేస్తాయి. కానీ ఈ రంగులు మీ జుట్టును, చర్మాన్ని దెబ్బతీస్తాయి తెలుసా? అవును ఈ కలర్స్ లో ఎన్నో డేంజర్ కెమికల్స్ ఉంటాయి. ఈ రంగుల్లో ఉపయోగించే రసాయనాలు మన చర్మం గ్రహించడంతో అవి శరీరంలోకి వెళతాయి. ఆ తర్వాత మన శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. పెయింట్ల వల్ల వచ్చే అలెర్జీలు ఎంతో ఇబ్బంది పెడతాయని నిపుణులు చెబుతున్నారు.
Cricket Fans
సెమీ పర్మినెంట్, పర్మినెంట్ అంటూ మార్కెట్ లో ఎన్నో రకాల పెయింట్లు మనకు అందుబాటులో ఉంటాయి. వీటిని జుట్టుకు, ముఖానికి, పెదాలకు, చేతులకు వేసుకుంటూ ఉంటారు. కానీ వీటిని జుట్టుకు అప్లై చేయడం వల్ల ఆ రంగులు షాఫ్ట్ లోకి చొచ్చుకుపోతాయి. ఇవి అలెర్జీ, దద్దుర్లు, జుట్టు సమస్యలను కలిగిస్తాయి.
Cricket Fans
తాత్కాలిక రంగు మీరు జుట్టును వాష్ చేసే వరకు మాత్రమే ఉంటుందనుకోవచ్చు. కానీ వీటిలో మనకు హాని చేసే ఎన్నో రసాయనాలు ఉంటాయి. ఇవి మీ జుట్టును డల్ గా, పొడిగా చేస్తాయి. చాలా మందికి ఈ కలర్ వేసుకున్న తర్వాత హెయిర్ ఫాల్, జుట్టు తెగిపోవడం, స్కిన్ అలెర్జీ వంటి చర్మ సమస్యలు వచ్చే ఉంటాయి.
చాలా రంగులల్లో ఉండే రసాయనాలు మీ చర్మాన్ని దెబ్బతీస్తాయి. ఇవి దద్దుర్లు, ఎరుపు, వాపు, అలెర్జీ వంటి సమస్యలను కలిగిస్తాయి. ఇవి సూర్యరశ్మికి మీ చర్మం దెబ్బతినేలా చేస్తాయని నిపుణులు అంటున్నారు.
మీరు గమనించారా? స్టేడియంలో కూర్చున్నంత సేపు ఎండ తగులుతూనే ఉంటుంది. ఇది మీ చర్మానికి అస్సలు మంచిది కాదు. అందుకే మీరు స్టేడియంలో ఉంటే ప్రతి రెండు గంటలకోసారి ఖచ్చితంగా సన్ స్క్రీన్ ను అప్లై చేయాలి. దీంతో టానింగ్ సమస్య వచ్చే అవకాశమే ఉండదు. అలాగే ఎండలో మ్యాచ్ ను చూడటానికి వెళితే ఎస్పీఎఫ్ 50+ సన్ స్క్రీన్ ను వాడాలి. అంటే మీరు బయటకు వెళ్లడానికి 20 నిమిషాల ముందే దీన్నిఉపయోగించాలి. అలాగే కాటన్ వంటి గాలి ప్రవేశించే బట్టలనే వేసుకోవాలి. ఎండ తగలకుండా ఉండే ఫుల్ స్లీవ్స్ దుస్తువులనే ధరించాలని నిపుణులు చెబుతున్నారు.
ముఖానికి వేసుకున్ని ఫేస్ పెయింట్ ను రిమూవ్ చేసేటప్పుడు ముందు మీ ముఖానికి బేబీఆయిల్ ను పెట్టి రెండు గంటల పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత పొడి దూదితో తుడవండి. అలాగే సున్నితమైన క్లెన్సర్ తో కడగండి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ ను అప్లై చేయండి.
మీరు ఆట పట్ల మీకున్న అభిమానాన్ని చూపించడానికి ఇలా పెయింట్ ను వేసుకుంటారు. కానీ ఇది మీ జుట్టుకు, చర్మానికి అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అందుకే పెయింట్ ను వేసుకోకపోవడమే మంచిది. ఒకవేళ మీరు ఖచ్చితంగా ఫేస్ పెయింట్ ను వేసుకోవాలనుకుంటే హైపో అలెర్జీ బాడీ పెయింట్లను ఉపయోగించండి. అది కూడా వీలైనంత తక్కువ సేపు మాత్రమే ఉంచుకోండి. ఫేస్ పెయింట్ కంటే ఎయిర్ బ్రషింగ్ యే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అమ్మోనియా లేని ప్రొడక్ట్స్ ను మాత్రమే వాడండి. అలాగే మీరు ఏదైనా ఉపయోగించే ముందు అలెర్జీ టెస్ట్ ను చేయండి. ప్రొఫేషనల్ సలహా తీసుకోండి.