MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • స్పెర్మ్ కౌంట్ పెరగడానికి ఏం చేయాలి?

స్పెర్మ్ కౌంట్ పెరగడానికి ఏం చేయాలి?

స్పెర్మ్ సంబంధిత సమస్యలను వదిలించుకోవడానికి మీరు కొన్ని ఆహారాలను ఖచ్చితంగా తినాలి. ఈ ఆహారాలు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మీ సంతానోత్పత్తిని కూడా పెంచుతాయి.  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Feb 28 2024, 01:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రస్తుత కాలంలో చాలా మంది మగవారు ఈ సమస్యతో బాధపడుతున్నారు. వీర్యకణాల ఉత్పత్తి, స్పెర్మ్ కౌంట్, వీర్యకణాల వేగం, వీర్యకణాల ఆరోగ్యం వంటి సమస్యలు సంతాన సమస్యలను కలిగిస్తాయి. ఒకవేళ మీరు హాస్పటల్ కు వెళ్లి ట్యాబ్లెట్స్ వాడుతున్నా.. హెల్తీ డైట్ ను ఖచ్చితంగా తీసుకోవాలి. స్పెర్మ్ సంబంధిత సమస్యల నుంచి బయటపడటానికి ఏమేమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

26

వ్యాయామం

క్రమం తప్పకుండా వ్యాయామం చేసే పురుషులకు ఇలాంటి సమస్య వచ్చే అవకాశం లేదు. శారీరక శ్రమ టెస్టోస్టెరాన్ స్థాయిలు స్థాయిలను పెంచుతుంది. అలాగే వీరిలో మెరుగైన వీర్య కణాలు కూడా ఉంటాయని పలు అధ్యయనాలు చూపిస్తున్నాయి .అయినప్పటికీ మరీ ఎక్కువ వ్యాయామాలను చేయకూడదు. ఎందుకంటే ఇది మీ టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తుంది. 
 

36

జింక్

జింక్ కూడా సంతానోత్పత్తిని పెంచడానికి బాగా సహాయపడుతుంది. మీరు ప్రతి రోజూ వ్యాయామం చేస్తున్నట్టైతే.. మీ సంతానోత్పత్తిని మెరుగుపరచాలనుకుంటే మీరు  ఆహారంలో జింక్ ఉండేలా చూసుకోండి. 
 

46

తగినంత విటమిన్ సి 

విటమిన్ సి మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుందన్న సంగతి అందరికీ తెలుసు. కానీ ఇది సంతానోత్పత్తిని పెంచడానికి కూడా సహాయపడుతుందన్న సంగతి చాలా మందికి తెలియదు.  విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి మెరుగుపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
 

56

విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించడం

మీరు ఒత్తిడికి గురైనప్పుడు మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనివల్ల మీకు సెక్స్ కోరికలు కూడా తగ్గుతాయి. నిపుణుల ప్రకారం.. ఒత్తిడి మీ లైంగిక సంతృప్తిని తగ్గిస్తుంది. అలాగే మీ సంతానోత్పత్తిని కూడా దెబ్బతీస్తుంది. ఒత్తిడికి కారణమైన కార్టిసాల్ హార్మోన్ లైంగిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని చాలా పరిశోధనల్లో తేలింది. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఇందుకోసం బయట కాసేపు నడవడం, ధ్యానం చేయడం, వ్యాయామం చేయడం లేదా స్నేహితులతో మాట్లాడటం వంటివి చేయండి. 
 

66

తగినంత విటమిన్ డి 

విటమిన్ డి మగ, ఆడ సంతానోత్పత్తికి చాలా ముఖ్యమైనది. ఇది టెస్టోస్టెరాన్ స్థాయిలను బాగా పెంచుతుంది. విటమిన్-డి లోపం ఉన్న పురుషులు తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలను కలిగి ఉంటారని ఒక పరిశోధనల్లో తేలింది.  విటమిన్ డి లెవెల్స్ ఎక్కువగా ఉంటే స్పెర్మ్ చలనశీలత బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే  తగినంత విటమిన్ డిని పొందండి. ఇవి మీ స్పెర్మ్ కౌంట్ ను పెంచుతాయి.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Eggplant: కొంచెం స్థలంలోనే వంగ మొక్కల్ని ఇలా పెంచండి
Recommended image2
Junk Food: జంక్ ఫుడ్ 60 రోజులు పాటు తినడం మానేయండి.. మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Recommended image3
Pearl Drop Earrings: ముఖానికి అందాన్నిచ్చే ముత్యాల చెవిపోగులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved