Watermelon Seed's Benefits: పుచ్చకాయ గింజలు తినడం వల్ల ఎన్ని రోగాలు తగ్గుతాయో తెలుసా..?
Watermelon Seed's Benefits: వేసవిలో పుచ్చకాయలను తినడం వల్ల బాడీ హైడ్రేటెడ్ గా ఉండటంతో పాటుగా అనేక అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే పుచ్చకాయ మాత్రమే కాదు పుచ్చకాయ గింజలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మీకు తెలుసా?

Watermelon Seed's Benefits: వేసవిలో పుష్కలంగా లభించే పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఈ పండును ఈ సీజన్ లో తినడం వల్ల బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ పండులో నీరు శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ పండు శరీరానికి చలువ చేయడంతో పాటుగా మన నిరో నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
పుచ్చకాయ పండులో యాంటీ ఆక్సిడెంట్లు, ఎన్నో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే ఈ పుచ్చకాయతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖం కాంతివంతంగా కూడా మెరిసిపోతుంది.
పుచ్చకాయే కాదు పుచ్చకాయ గింజలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పుచ్చకాయ గింజలు ఎన్నో అనారోగ్య సమస్యలను తొలగించడానికి ఎంతో సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక రక్తపోటు.. పుచ్చకాయలో ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటు సమస్యను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. అంతేకాదు ఈ గింజలు కణ జాలాన్ని మరమ్మత్తు కూడా చేస్తాయి. అలాగే కండరాలను ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి. కండరాల నొప్పిని తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయి. అందుకే హైబీపీ పేషెంట్లు ఈ పుచ్చకాయతో పాటుగా పుచ్చకాయ గింజలను కూడా తినండి. అన్నివిధాలా ఆరోగ్యంగా ఉంటారు.
గుండె సమస్యలను తగ్గిస్తుంది.. పుచ్చకాయ గింజల్లో మోనోశాచురేటెడ్, Polyunsaturated fat ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని తగ్గించడంలో ముందుటాయి. ఈ వేసవిలో ఎండలో కొద్దిసేపు నడిచినా మీకు అలసిపోయిన భావన కలుగుతుంది. అలాంటి పరిస్థితిలో మీరు పుచ్చకాయ విత్తనాలను తింటే.. మీ శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.
బరువు తగ్గుతారు. అధిక బరువు, ఊబకాయం సమస్యతో బాధపడుతున్నట్టైతే మీ రోజు వారి ఆహారంలో పుచ్చకాయ విత్తనాలను చేర్చండి. ఎందుకంటే పుచ్చకాయ గింజల్లో కేలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మీరు అధిక బరువు తగ్గేందుకు ఎంతో సహాయపడతాయి. పుచ్చకాయ గింజల్ని మీ రోజు వారి ఆహారంలో సలాడ్లుగా లేదా కూరగాయల్లో లేదా స్నాక్స్ గా తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.