బరువు తగ్గాలా..? బాగా నమలండి...!
ఆహారాన్ని బాగా నమలండి, నెమ్మదిగా తినండి.. తినేప్పుడు దిక్కులు చూడొద్దు. టీవీలు, ఫోన్లు, పుస్తకాలు చదువుతూ తినొద్దు.. ఇది మన చిన్నప్పుడు పెద్దవాళ్లు చెప్పే మాట. ఇలా నెమ్మదిగా, బాగా నమిలి తినడం వల్ల ఆహారంలోని పోషకాలు శరీరానికి సరిగ్గా చేరుకుంటాయి.

తినే తిండి మీదే దృష్టి పెట్టడం వల్ల అందులోని సుగుణాలన్నీ శరీరం అందుకుంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆహారాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించగలుగుతారు. దీంతో పాటు ఇలా నెమ్మదిగా తినడం వల్ల మరో అద్భుతమైన ప్రయోజనం ఉంది.. అదే బరువు తగ్గడం..
mobile
కొంతమంది సెకన్లలో భోజనం ముగించేస్తుంటారు. పెద్ద పెద్ద బుక్కలు, గబ,గబా తినడం వల్ల ఆహారం సరిగా పచనం కాదు. దీనివల్ల బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
నెమ్మదిగా తినేవారితో పోల్చితే వేగంగా తినేవారిలో 115 శాతం ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల ఊబకాయం పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని 4వేల మంది మధ్యవయస్కుల మీద జరిపిన అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా పురుషుల్లో ఇలా తొందరగా తినే అలవాటు వల్ల 20యేళ్లకే ఊబకాయం తొందరగా వచ్చేస్తుందట.

నెమ్మదిగా తినడం బరువు తగ్గడానికి అనేక రకాలుగా దోహదపడుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా కడుపునిండిన భావనను కలిగిస్తుంది. గబగబా తినడం వల్ల ఈ భావన కలగక ఎక్కువగా తినేస్తారు. అంతేకాదు కడుపునిండిన భావన మెదడుకు చేరడానికి సమయం లేక తినాల్సిన దానికంటే ఎక్కువగా తింటారు.

ఆహారాన్ని మింగడానికి ముందు బాగా నమలడం వల్ల శరీరంలోకి వెళ్లే కేలరీలు తగ్గుతాయి. దీనివల్ల బరువు తగ్గుతుంది. ఇది అనేక అధ్యయనాల్లో తేలింది. అధిక బరువుతో బాధపడుతున్నవారు ఇతరులతో పోలిస్తే ఆహారాన్ని సరిగ్గా నమలడం లేదని కనుగొన్నారు. తీసుకునే క్యాలరీల పరంగా చూస్తే సాధారణంగా నమిలే దానికంటే 1.5 రెట్లు ఎక్కువగా నమలడం వల్ల 9.5శాతం, రెండు రెట్లు అధికంగా నమలడం వల్ల 15 శాతం కేలరీల ఇన్ టేక్ తగ్గుతుందని తేలింది.
సరే ఎంత సమయంలో భోజనం పూర్తిచేయాలి? ఇదో వింతైన ప్రశ్న... దీనికి అధ్యయనం ప్రకారం, ప్రతీ బుక్క 30 సెకన్ల పాటు నమలాలి. దీనివల్ల భోజనం తరువాత ఏదైనా తినాలన్న కోరిక కలగదు. దీంతో అనారోగ్యకరమైన ఆహారాలు తినడం తగ్గుతుంది
అయితే ఇంతసేపు నమలడం వల్ల ఆహారాన్ని ఆస్వాదించలేకపోతారు. అది అవసరం లేదు కదా.. అందుకే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలంటే.. ఆహారాన్ని 10, 15 సెకన్ల పాటు నమలండి. భోజనాన్ని 20 ని.లపాటు తినాలి.
మరి వేగంగా తినే అలవాటును ఎలా మానుకోవాలి.. అంటే అది కొంచెం కష్టమే.. కానీ ప్రయత్నిస్తే అది పెద్ద కష్టం కాదు. ముందుగా మీరు టైంని సెట్ చేసి పెట్టుకోండి. అలాగే కొన్ని చిట్కాలను పాటించండి..
ఎక్కువసేపు ఆకలితో ఉండకండి.. బాగా ఆకలి అయ్యేవరకు తినకుండా ఉండకండి. దీనివల్ల ఆహారాన్ని గబగబా తినేస్తారు. అందుకే మధ్యలో ఏదైనా స్నాక్స్ తినండి.
తినేప్పుడు తినే ఆహారం మీదే దృష్టి పెట్టండి. ఎన్నిసార్లు నమలారో లెక్కించండి. మరింత నెమ్మదిగా నమలడం ద్వారా నమిలే సంఖ్యను పెంచడానికి ప్రయత్నించండి.
ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి: మీ ఆహారంలో ఫైబర్ ను చేర్చడం వల్ల మీ జీర్ణవ్యవస్థ బాగుంటుంది. అంతేకాదు ఫైబర్ పదార్థాలను ఎక్కువగా నమలాల్సి ఉంటుంది.
నీరు త్రాగండి : భోజనానికి ముందు ఒక గ్లాసు నీళ్లు తాగాలి. దీనివల్ల క్యాలరీల ఇన్ టేక్ తగ్గుతుంది. అలాగే తినేప్పుడు టీవీ చూడడం, ఫోన్ చూడడం లాంటివి తగ్గించండి.. దృష్టిని ఆహారం మీదే కేంద్రీకరించండి. ఎటో చూస్తూ తినడం వల్ల ఎక్కువగా తింటారు.