జర్నీలో వాంతి చేసుకుంటున్నారా? ఈ మూడు వస్తువులను మీ దగ్గర పెట్టుకోండి.. అస్సలు వాంతే కాదు..
Vomiting While Travelling: బస్సు లేదా కారు లాంటి వాహనాల్లో ఎటైనా దూర ప్రయాణం చేసే సమయంలో చాలా మందికి వాంతులు అవుతుంటాయి. అలా కాకూడదంటే ఈ మూడింటినీ మీ దగ్గర ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Vomiting While Travelling: జర్నీలు చేయనివారంటూ ఎవరూ ఉండరేమో.. ఏదో ఒక అవసరం మీదనో బయటకు వెళ్లాల్సి ఉంటుంది. కొంతమందికి జర్నీ అంటే చాలా ఇష్టం ఉంటుంది. మరికొంతమందికి మాత్రం అస్సలు ఉండదు. జర్నీ అంటేనే బయటపడిపోతుంటారు. దీనికి కారణాలు ఉన్నాయి.. జర్నీ చేస్తే ఎక్కక వాంతులు అవుతాయేమోనని భయపడిపోతుంటారు. కొందరికి బస్సులు, ఇంకొందరికి కార్లు, మరికొందరికి రైళ్లలో ప్రాయాణం చేస్తే వాంతులు అవుతాయి. ఈ కారణంగానే ప్రయాణాలంటే భయపడిపోతుంటారు.
ఇక ఆ సమస్య ఉన్న వారు ఖచ్చితంగా వాహనాల్లో కిటికీదగ్గరే కూర్చుంటారు. వాహనాల్లో వచ్చే చెడు స్మెల్ వల్ల కూడా వాంతులు అవుతాయి. ఈ సమస్య పురుషులతో పోల్చితే మహిళల్లోనే ఎక్కువగా ఉంటుంది. మన చెవుల్లో ఉండే లాబ్రింథైన్ క్లీన్ గా లేకపోవడం వల్ల కూడా వాంతులు అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అంటే చెవుల్లో మురికి పోరుకుపోవడం, వాటిని శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల మెదడుకు అందాల్సిన సంకేతాలు చేరకపోవడంతో వికారం, తలనొప్పి వంటి సమస్యలు వచ్చి.. వాంతులు అవుతాయి. ప్రయాణంలో కలిగే వికారం, వాంతులు, తలనొప్పి, మైకము వంటి సమస్యలు రాకుండే చేసేందుకు మీతో పాటుగా కొన్ని వస్తువులను ఉంచుకోండి. ఇవి మీ సమస్యను తొందరగా తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అరటిపండు.. ప్రయాణంలో వాంతులు అవుతాయనుకుంటే.. మీ వెంట ఖచ్చితంగా అరటి పండును తీసుకెళ్లండి. వాంతులు వచ్చినట్టైతే వెంటనే అరటిపండును తినండి. వాంతులు వచ్చే అవకాశం ఉంది. అరటి ఉదర సమస్యలను కూడా తగ్గిస్తుంది.
నిమ్మ.. నిమ్మకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిమ్మరసం అన్ని రకాల ఉదర సమస్యలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వికారం లేదా వాంతులు వచ్చినట్టు అనిపిస్తే.. లెమన్ వాటర్ ను తాగండి. తక్షణమే ఉపశమనం లభిస్తుంది.
అల్లం.. అల్లం వికారం, వాంతులను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. ఇందుకోసం అల్లం మిఠాయిని గానీ, అల్లం టీ ప్యాక్ చేయవచ్చు. ఈ మసాలాలను చూర్ణం చేసి గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే వాంతులు రావు.
పుదీనా.. పుదీనా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఈ వేసవిలో వీటిని తీసుకోవడం వల్ల బాడీ కూల్ గా ఉండటమే కాదు డీహైడ్రేషన్ సమస్య కూడా రాదు. ఎటైనా ప్రయాణిస్తున్నప్పుడు పుదీనా ఆకులు లేదా పుదీనా మాత్రలు లేదా పుదీనా షర్బత్ తను తప్పకుండా తీసుకెళ్లాలి. వీటిని తీసుకోవడం వల్ల వాంతులు కావు.