MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • మీ జుట్టు చిన్నగా ఉందా? పెరగాలంటే ఇలా చేయండి

మీ జుట్టు చిన్నగా ఉందా? పెరగాలంటే ఇలా చేయండి

జుట్టు పెరగడానికి ఎన్నో చిట్కాలను పాటిస్తుంటారు. నిపుణుల ప్రకారం.. విటమిన్ బి పుష్కలంగా ఉండే  ఆహారాలను తింటే చాలు జుట్టు మీరు కోరుకున్నంత పొడవు పెరుగుతుంది.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 26 2023, 03:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
hair care

hair care

పొట్టిగా, సన్నని జుట్టున్న వాళ్లు జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరిగేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. నిజానికి జుట్టు పెరిగేందుకు కొన్ని ఆహారాలు ఎంతో మేలు చేస్తాయి. అందులో విటమిన్ బి  ఆహారాలు ముందుంటాయి. జుట్టు పెరుగుదలకు మీరు తప్పనిసరిగా తీసుకోవలసిన విటమిన్ బి రిచ్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

26
hair care

hair care

జుట్టు పెరుగుదలకు విటమిన్ బి

ఎన్నో విటమిన్లు ఉంటాయి. కానీ జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరిగేందుకు విటమిన్ బి చాలా చాలా అవసరం. ఎందుకంటే బి 7 (బయోటిన్), ఫోలేట్, బి 12 వంటి బి విటమిన్లు జుట్టు కణాలతో సహా కొత్త కణాల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. బయోటిన్ జుట్టును బలోపేతం చేయడానికి, పెరిగేందుకు సహాయపడుతుంది. ఫోలేట్, విటమిన్ బి 12 విషయానికొస్తే ఇవి ఎర్ర రక్త కణాలను రూపొందించడంలో పాల్గొంటాయి. ఇవి జుట్టు కుదుళ్లకు ఆక్సిజన్, పోషకాలను తీసుకువెళతాయి. అలాగే జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. విటమిన్ బి ఏయే ఆహారాల్లో ఉంటుందంటే.. 
 

36

పాలు, పాల ఉత్పత్తులు

పాలు, పాల ఉత్పత్తుల్లో కాల్షియం పుస్కలంగా ఉంటుంది. ఇవి ఎముకలను దృఢంగా మారుస్తాయి. కానీ వాటిలో జుట్టు ఆరోగ్యానికి అవసరమైన బయోటిన్ కూడా ఉంటుంది తెలుసా? 

గుడ్లు

మీరు గుడ్లను ఎన్నో విధాలుగా తినొచ్చు. నిజానికి గుడ్లు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. గుడ్లలో బయోటిన్ తో సహా బి విటమిన్ల పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు పెరిగేందుకు, బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. 
 

46
hair care

hair care

ఆకుకూరలు

బచ్చలికూర, కాలే వంటి కూరగాయలు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే వీటిలో ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టును బలంగా ఉంచేందుకు సహాయపడుతుంది.

చేపలు

సాల్మన్, మాకేరెల్ వంటి చేపలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు,  విటమిన్ బి 12  అధికంగా ఉంటాయి. ఇది జుట్టు పెరిగేందుకు సహాయపడుతుది. అలాగే నెత్తిని ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

56
hair care

hair care

చిక్కుళ్లు

జుట్టు బాగా పెరిగేందుకు అవసరమైన ఫోలేట్ తో సహా బి విటమిన్లు కాయధాన్యాలు, బీన్స్ లో కూడా పుష్కలంగా ఉంటాయి. 

గింజలు, విత్తనాలు

మన ఆరోగ్యానికి గింజలు, విత్తనాలు కూడా ఎంతో మేలు చేస్తాయి. అందుకే జుట్టు పెరుగుదలకు బాదం లేదా పొద్దుతిరుగుడు విత్తనాలను తీసుకోండి. వీటిలో బయోటిన్, ఇతర బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

66
hair care

hair care

తృణధాన్యాలు

బ్రౌన్ రైస్, ఓట్స్ లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఎందుకంటే వాటిలో బి విటమిన్లు ఉంటాయి. ఇవి జుట్టును బలంగా చేస్తాయి.

సిట్రస్ పండ్లు

నారింజ, నిమ్మకాయలలో ఫోలేట్ తో పాటుగా విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు ఆరోగ్యానికి బి విటమిన్లను గ్రహించడానికి సహాయపడుతుంది.
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Coca Cola Formula : 100 ఏళ్ల కోకా కోలా తయారీ సీక్రేట్ లీక్..? ఏకంగా యూట్యూబ్ లో వీడియో
Recommended image2
కాలేజీ అమ్మాయిల కోసం అదిరిపోయే డిజైన్లలో రింగ్స్.. చూసేయండి
Recommended image3
అదిరిపోయే డిజైన్లలో సల్వార్ సూట్స్.. ఓసారి ట్రై చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved