విజయ్ సేతుపతి ఫవరేట్ ఫుడ్ ఏంటో తెలుసా?
అంతేకాకుండా, విజయ్ సేతుపతికి పొరియాల్ అనే వంటకం కూడా బాగా నచ్చుతుంది. దీనిని ఆయన సాంబార్, రసం కాంబినేషన్ తో తినడం అంటే చాలా ఇష్టమట.
విజయ్ సేతుపతి పరిచయం అవసరం లేని పేరు. ఆయన దక్షిణాదిన అన్ని సినిమాల్లోనూ అవకాశాలు అందుకొని అదరగొడుతున్నారు. ఓ వైపు హీరోగా చేస్తూనే, మరో వైపు విలన్ రోల్స్ కూడా పోషిస్తున్నారు. రీసెంట్ గా జవాన్ మూవీలో స్టైలిష్ విలన్ గా నటించి, బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా తన సత్తా చాటాడు. నిజానికి, ఇండస్ట్రీలో ఉన్నవారు., ముఖ్యంగా హీరోలుు ఫుడ్ విషయంలో చాలా ఆంక్షలు పెట్టుకుంటూ ఉంటారు. అవి తింటే లావు అయిపోతాం. ఇవి తినకూడదు ఇలా చాలా అనుకుంటూ ఉంటారు. అయితే, విజయ్ సేతుపతి మాత్రం తనకు నచ్చిన ఆహారాన్ని తినేస్తూ ఉంటారట.
vijay sethupathi profile
ఆయనకు కొన్ని రకాల సౌత్ ఫుడ్స్ లేకుంటే, అసలు భోజనమే చేయరట. మరి ఆయనకు నచ్చిన ఫుడ్స్ ఏంటో ఓసారి చూద్దాం..
ఓ ఇంటర్వ్యూలో ఆయన తనకు నచ్చిన ఫుడ్స్ ఏంటో చెప్పేశాడు. తనకు అల్పాహారంలో ఇంట్లో, అది కూడా వాళ్ల అమ్మ చేసే ఇడ్లీ, కొబ్బరి చట్నీ అంటే విపరీతంగా ఇష్టమట. ఇది మాత్రమే కాదు, వాళ్ల అమ్మ చేతితో చేసే తోగ్యాల్ డిష్ అంటే చాలా ఇష్టమట. దీనిని బీరకాయతో తయారు చేస్తారు. బీరకాయ, కొబ్బరితో కలిపి చేసే చట్నీని తోగ్యాల్ అంటారట.
అంతేకాకుండా, విజయ్ సేతుపతికి పొరియాల్ అనే వంటకం కూడా బాగా నచ్చుతుంది. దీనిని ఆయన సాంబార్, రసం కాంబినేషన్ తో తినడం అంటే చాలా ఇష్టమట.
విజయ్ సేతుపతి ఫేవరేట్ స్నాక్స్ మురుకులట. వీటిని ఇష్టంగా తింటారట. ఆయన పిల్లలు కూడా ఈ మురుకులను ఇష్టంగా తింటారని ఆయన చెప్పడం విశేషం.
Hyderabadi Biryani
ఇక, దక్షిణాది ప్రజలకు ఎంతో ఇష్టమైన బిర్యానీ అంటే ఆయనకు కూడా చాలా ఇష్టమట. ఇక, ఆయన వంట చేయడం నేర్చుకున్న తర్వాత ముందు చేసిన వంటకం బిర్యానీ నే అంట. ఆయన బిర్యానీ చాలా అద్బుతంగా తయారు చేస్తారట.
Sambar
ఆయనకు నచ్చిన మరో ఫేవరేట్ వంటకం పులి కుజంబు. దీనిని వైట్ రైస్ లో కలిపి తీసుకోవడానికి ఆయన ఇష్టపడతారట. దీనిని తయారు చేయడానికి అన్ని రకాల కూరగాయలు, టమాటలు, ఉల్లిపాయలు, చింతపండు గుజ్జు, మసాలాలు అన్నీ కలిపి దీనిని తయారు చేస్తారు.
Image: Freepik
ఇక, ఆయన సాంబార్ ని కూడా ఇష్టంగా తింటారట. ఇక, భోజనం చివరలో కచ్చితంగా ఆయనకు పెరుగు ఉండాలట. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.