Home Prosperity ఇంట్లో ఇవి తెరిచి ఉంచితే దరిద్రం.. వెంటనే మూసేయండి
వాస్తు చిట్కాలు : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే కొన్ని వస్తువులను తెరిచి ఉంచకూడదు. అలా చేస్తే దరిద్రం తాండవిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అశాంతి రాజ్యమేలుతుంది. దు:ఖం కలుగుతుంది. మీరు తెలియక అలా చేస్తుంటే ఇకనైనా మేల్కొండి. జాగ్రత్త పడండి.

దరిద్రానికి కారణాలివే..
హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యతనిస్తారు. ఏదైనా పని చేయడానికి ముందు లేదా చేసేటప్పుడు వాస్తు శాస్త్రంలో చెప్పిన నియమాలు పాటించాలని పెద్దలు హితవు చెబుతారు. అవి పాటిస్తే జీవితం శుభప్రదంగా, సానుకూల శక్తితో అనుకూలంగా ఉంటుందని చెబుతారు. అదే సమయంలో వాస్తు శాస్త్రంలో చెప్పిన నియమాలను విస్మరిస్తే ఫలితాలు దారుణంగా ఉంటాయని హెచ్చరిస్తారు. కాబట్టి ఈ కథనంలో మీ ఇంట్లో ఉండే కొన్ని వస్తువుల గురించి చెప్పబోతున్నాం. వాటిని మీరు పొరపాటున కూడా మీ ఇంట్లో తెరిచి ఉంచకూడదు. వాటిలో ఏదైనా ఒకటి తెరిచి ఉంచినా మీ ఇంట్లో త్వరగా పేదరికం, దుఃఖం పెరుగుతాయి. కాబట్టి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పుస్తకం
మీరు పుస్తకాలను చదివిన వెంటనే మూసివేయండి. పుస్తకం చదువుతూ అలాగే తెరిచి ఉంచడం తప్పు అని వాస్తు శాస్త్రంలో చెప్పారు. వేదాల ప్రకారం పుస్తకాలు బుధుడితో సంబంధం కలిగి ఉంటాయి. కాబట్టి అది తెలివితేటలు, ప్రసంగం కారకంగా కూడా పరిగణించబడుతుంది. మీ ఇంట్లో ఎప్పుడూ పుస్తకాలను తెరిచి ఉంచవద్దు. అలా చేస్తే బుధుడు బలహీనమవుతాడు. కష్టాలు మొదలవుతాయి.
ఉప్పు
వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పును ఉపయోగించిన తర్వాత డబ్బాను ఎప్పుడూ తెరిచి ఉంచకూడదు. ఉప్పు చంద్రుడితో సంబంధం కలిగి ఉంటుంది. మీరు ఉప్పు డబ్బాను తెరిచి ఉంచినప్పుడు అది చంద్రుడిని బలహీనపరుస్తుంది. మీ జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే సోమవారం ఉప్పు దానం చేయవచ్చు.
పాలు
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎప్పుడూ పాల పాత్రను తెరిచి ఉంచకూడదు. అలా పాల పాత్ర తెరిచి ఉంటే మీ జాతకంలో శుక్రుడు బలహీనపడే అవకాశం ఉంది. దీనివల్ల ఆరోగ్యం, ఆర్థికపరంగా నష్టాలను మీరు తీవ్రంగా ఎదుర్కోవలసి వస్తుంది.
ఆహార పదార్థాలు
వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో ఆహార పదార్థాలను తెరిచి ఉంచకూడదు. ఇలా చేయడం తప్పు ఒకవేళ అలా తెరిచి ఉంచితే ఆహారం, డబ్బు రెండింటిలోనూ సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అంతేకాకుండా తెరిచి ఉంచిన ఆహారంలో పురుగులు, ధూళి పడతాయి. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.
అలమరా
పొరపాటున కూడా ఇంట్లో ఉండే అలమరాను ఎప్పుడూ తెరిచి ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలా ఒకవేళ తెరిచి ఉంచితే లక్ష్మీదేవి మీపై కోపగించుకుంటుంది. అంతేకాకుండా అలమరా తెరిచి ఉంచిన ఇంట్లో పేదరికం తప్పకుండా పెరుగుతుందని జ్యోతిష నిపుణులు చెబుతుంటారు.