Banana Peel: తొక్కే కదా అని తీసిపారేస్తే ఎన్నో బెనిఫిట్స్ ను మిస్ అయినట్టే మరి..
Banana Peel: పండ్లే కాదు.. వాటి తొక్కలు కూడా మనకు మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ తొక్కలు మనకు ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయట మరి..

Banana Peel: పండ్లు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలిసిందే. ఇక పండ్లకున్న తొక్కలు కూడా ఎంతో ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందులో అరటి పండంటే ఇష్టంగా లాగించే వారు చాలా మందే ఉన్నారు. అయితే అరటిపండును తింటారు.. కానీ దాని తొక్కను మాత్రం విసిరిపారేస్తుంటారు.
వాస్తవానికి అరటి పండు తినడం వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో.. దాని తొక్కతో కూడా అంతకంటే ఎక్కువ ప్రయోజనాలే కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఈ తొక్క మనకు ఏవిధంగా ఉపయోగపడుతుందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి.
అరటి పండు తొక్కలో ఐరన్, ప్రోటీన్లు, మెగ్నీషియం, ఫైబర్, పొటాషియం వంటి ఇతర పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవన్నీ మలబద్దక సమస్యను దూరం చేస్తాయి. అరటి పండు తొక్కలో ఉండే సెరొటోనిన్ అనే సమ్మోళనం వల్ల డిప్రెషన్ తగ్గుతుంది. మూడ్ ను కూడా ఛేంజ్ అవుతుంది. కాబట్టి అరటి తొక్కలను కూడా తినాలని వైద్యులు సూచిస్తున్నారు.
పసుపు పచ్చ దంతాలు మిలమిల తెల్లగా మెరవాటంటే అరటి తొక్కతో దంతాలను తోమాలట. వీటితో దంతాలను తోమడం వల్ల తెల్లగా కావడమే కాదు చిగుళ్ల సమస్యలు కూడా పోతాయట. అలాగే దంతాలు దృఢంగా అవుతాయి. అంతేకాదు నీళ్లల్లో ఉండే విషపదార్థాలను, లోహాలను తొలగించడానికి కూడా ఉపయోగపడతాయి. ఇందుకోసం అరటి తొక్కలను తీసుకుని నీటిలో వేస్తే ఆ నీళ్లన్నీ శుభ్రంగా తయారవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పండ్లు, కాలిన గాయాలు, దెబ్బలను తొందరగా తగ్గించడానికి కూడా అరటి తొక్కలు ఎంతో సహాయపడతాయి. గాయాలపై అరటి తొక్కతో మసాజ్ చేయాలి. ఇలా చేస్తే గాయాలు తొందరగా తగ్గుతాయి. ఈ తొక్కల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి వీటిని ముఖంపై మర్దన చేయవచ్చు. ఇలా చేస్తే మొటిమల సమస్య పోతుంది. ముఖ్యంగా ముఖ సౌందర్యం రెట్టంపు అవుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.