MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Clay pot: మట్టికుండను ఇలా శుభ్రం చేశాకే దాన్ని వాడండి, నీళ్లు చల్లగా తాజాగా ఉంటాయి

Clay pot: మట్టికుండను ఇలా శుభ్రం చేశాకే దాన్ని వాడండి, నీళ్లు చల్లగా తాజాగా ఉంటాయి

Clay pot: వేసవిలో మట్టి కుండను అధికంగా వాడుతారు. నిజానికి ఫ్రిజ్ కన్నా మట్టి కుండ వాడడమే ఆరోగ్యకరం. అయితే మట్టి కుండను వాడేముందు ఎలా క్లీన్ చేయాలో తెలుసుకోండి. ఇక్కడ కొన్ని చిట్కాలు ఇచ్చాము. 

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 03 2026, 02:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
చల్లని నీళ్ల కోసం మట్టికుండ
Image Credit : Chat gpt

చల్లని నీళ్ల కోసం మట్టికుండ

వేసవికాలం వచ్చేసింది. చల్లని నీళ్ల కోసం ఎంతోమంది మట్టి కుండ తెచ్చుకుంటారు. కానీ చాలా మంది ఫ్రిజ్ నీళ్లు తాగుతూ ఉంటారు. ఈ నీళ్ల కన్నా మట్టికుండలో నిల్వ చేసిన నీళ్లు తాగడమే ఆరోగ్యం. మట్టికుండలో నీళ్లు సహజంగా చల్లగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచివని చెబుతారు. అయితే మట్టికుండను సరిగ్గా శుభ్రం చేయకపోతే నీటిలో దుర్వాసన రావడం, రుచి మారడం, బ్యాక్టీరియా పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే మట్టికుండను ఉపయోగించే ముందు దాన్ని శుభ్రపరచుకోవాలి. ముఖ్యంగా వేసవిలో ఎక్కువ కాలం పాటూ నీరు నిల్వ చేయడం వల్ల కుండ త్వరగా మురికి పడే అవకాశం ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వేటితో శుభ్రం చేయాలి?
Image Credit : Getty

వేటితో శుభ్రం చేయాలి?

మట్టికుండను వాడే ముందు పరిశుభ్రం చేసుకోవాలి. కుండను వాడేటప్పుడు ప్రతి 2 నుంచి 3 రోజులకు ఒకసారి కుండను క్లీన్ చేయడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల కుండలో ఉండే మలినాలు, వాసనలు తొలగిపోతాయి. కుండను శుభ్రం చేసే సమయంలో సబ్బులు, కెమికల్ క్లీనర్లు వాడకూడదు. ఇవి కుండలోని రంధ్రాలలో ఇరుక్కుపోయి నీటి రుచిని చెడగొడతాయి. అందుకే సహజ పదార్థాలు వాడాలి. నిమ్మరసం, ఉప్పు లేదా బేకింగ్ సోడా వంటివి ఉపయోగిస్తే కుండలోని మురికి సులభంగా తొలగిపోతుంది. ముందుగా కుండలో నీరు పోసి కొద్దిసేపు నానబెట్టి, తర్వాత ఈ పదార్థాలతో మెల్లగా రుద్దితే మంచి ఫలితం కనిపిస్తుంది.

Related Articles

Related image1
Periods in March: మార్చి నెలలో అమ్మాయిలకు పీరియడ్స్ ఆలస్యంగా వస్తాయి.. ఎందుకలా?
Related image2
Mercury Transit: బుధుడి నక్షత్ర సంచారంతో ఈ 4 రాశులదే హవా.. డబ్బే డబ్బు, ప్రమోషన్ పక్కా
34
కొత్త కుండ అయితే
Image Credit : Getty

కొత్త కుండ అయితే

శుభ్రం చేసిన తర్వాత కుండను బాగా కడిగి పూర్తిగా ఆరబెట్టాలి. కుండలో తడి ఉండగానే నీరు పోయకూడదు. కుండ లేదా కుండలోని నీరు దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కుండను నీడలో పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే ఉపయోగించాలి. అలాగే కొత్తగా కొనుగోలు చేసిన మట్టికుండ అయితే దాన్ని వెంటనే వాడకూడదు. దాన్ని కనీసం 24 గంటలు నీటిలో నానబెట్టి, తర్వాత బాగా కడిగి ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల మట్టిలో ఉన్న దుమ్ము, మలినాలు తొలగిపోతాయి. దీంతో నీటి రుచి కూడా బావుంటుంది.

44
మట్టికుండ ఎక్కడ పెట్టాలి?
Image Credit : Getty

మట్టికుండ ఎక్కడ పెట్టాలి?

మట్టికుండను ఇంట్లో ఎక్కడ పెట్టాలన్నది కూడా ఎంతో ముఖ్యం. కుండను ఎప్పుడూ శుభ్రమైన, గాలి వచ్చే ప్రదేశంలో ఉంచాలి. కింద నుంచి కూడా గాలి ప్రసారం అయ్యేలా స్టాండ్‌పై కుండను ఉంచితే మంచిది. కుండపై మూత పెట్టడం కూడా అవసరం. దీనివల్ల దుమ్ము పడకుండా ఉంటుంది. మట్టికుండలో నీళ్లు ఆరోగ్యకరంగా ఉండాలంటే శుభ్రంగా ఉంచడం మంచిది. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే వేసవిలో చల్లటి, శుభ్రమైన నీటిని తాగవచ్చు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Saree Designs: పండగలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే చీరల డిజైన్లు
Recommended image2
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image3
Birds: ఈ గ్రామంలో పక్షులన్నీ ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటాయి.. అది కూడా సెప్టెంబర్ నెలలోనే.. ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
Periods in March: మార్చి నెలలో అమ్మాయిలకు పీరియడ్స్ ఆలస్యంగా వస్తాయి.. ఎందుకలా?
Recommended image2
Mercury Transit: బుధుడి నక్షత్ర సంచారంతో ఈ 4 రాశులదే హవా.. డబ్బే డబ్బు, ప్రమోషన్ పక్కా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved