Beauty Tips: కాంతివంతమైన ముఖం సొంతం చేసుకోవాలా.. అయితే ఆలుతో ఇలా చేయండి?
Beauty Tips: బంగాళదుంప వంటకాలలోనే కాదు అందాన్ని పెంచుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఏం చేస్తే ముఖం కాంతివంతంగా మెరుస్తుందో ఇక్కడ చూద్దాం.

ముఖాన్ని కాంతివంతంగా కనిపించేలా చేయాలి అంటే బంగాళదుంప బాగా ఉపయోగపడుతుంది. మీరు విన్నది నిజమేనండి బంగాళదుంప లో ఉండే పొటాషియం, విటమిన్ సి మరియు కాటేకోలేస్ అనే ఎంజైమ్ చర్మాన్ని ప్రకాశవంతంగా చేయటానికి పనిచేస్తుంది. అలాగే ముఖం పై టాన్ తొలగించడానికి, కళ్ళ కింద నల్లటి వలయాలని తగ్గించడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.
బంగాళదుంపలలో ఐరన్, విటమిన్ సి మరియు రిబో ఫ్లెవిన్ అధికంగా ఉండటం వలన వృద్ధాప్య వ్యతిరేక ప్రయోజనాలను అందిస్తుంది. దాంతోపాటు ముఖంపై రంద్రాలను మూసివేయటంలో తోడ్పడుతుంది. బంగాళదుంపల జ్యూస్ లో పొటాషియం, ఫైబర్, మ్యాంగనీస్, విటమిన్ సి కలిగి ఉండటం వలన ఇది సహజంగానే బ్లీచింగ్ లాగా పని చేస్తుంది.
ఈ బ్లీచింగ్ ముఖాన్ని తెల్లబరచడంలో సహాయపడుతుంది. అలాగే ముఖం పైన ఉండే టాన్ ని కూడా సమర్థవంతంగా తొలగిస్తుంది. అయితే ఆ ఫేస్ ప్యాక్ ఎలా చేయాలో చూద్దాం. బంగాళదుంపని పీల్ చేసి ముక్కలుగా కట్ చేసి ఆపై దాన్ని మెత్తని పేస్టులాగా చేసి ముఖానికి అప్లై చేయండి. 15 నుంచి 20 నిమిషాల సేపు ఉంచిన తర్వాత మెల్లగా మర్దన చేస్తూ ముఖాన్ని నీటితో కడిగేయండి.
మరింత మంచి ఫలితాలు కోసం బంగాళదుంప రసంలో కొంచెం తేనె కలపండి. అలాగే చర్మం తెల్లబడాలి అనుకుంటే బంగాళదుంప రసంలో నిమ్మకాయ రసాన్ని కలపండి. బంగాళదుంప లో ఉండే కాటేకోలేస్ ఎంజైమ్ చర్మాన్ని కాంతివంతంగా ఉంచడానికి సహాయపడుతుంది.
కాబట్టి బంగాళదుంప మాస్కుని తరచుగా పెడుతుంటే కాలక్రమేణా మీ ముఖంలో వచ్చే మార్పుని మీరే గమనించవచ్చు. అలాగే ముఖం మీద మొటిమలతో బాధపడుతున్నట్లయితే ఒక టేబుల్ స్పూన్ బంగాళదుంప రసంలో ఒక టేబుల్ స్పూన్ టమాట గుజ్జుని కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ వేయండి.
అలాగే మీరు పిగ్మెంటేషన్ తో బాధపడుతున్నట్లయితే ఒక టీ స్పూన్ బంగాళదుంప రసానికి 1 స్పూన్ బియ్యం నీరు మరియు ఒక టీ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి మెడకి అప్లై చేసిన తర్వాత ఒక అరగంట ముఖానికి కొంచెం తరువాత వృత్తాకారంలో మర్దన చేస్తూ ముఖాన్ని మెడని శుభ్రంగా చల్లని నీటితో కడుక్కోండి. తరచుగా ఇలా చేయడం వలన మీ ముఖం శీతాకాలంలో కూడా కాంతివంతంగా మెరిసిపోతుంది.