నూనెను కాదు.. ఉల్లిపాయ రసాన్ని ఇలా గనుక పెడితే మీ జుట్టు రాలే ప్రసక్తే ఉండదు..!
జుట్టు రాలకుండా ఉండేందుకు, జుట్టు పొడుగ్గా పెరిగేందుకు, వెంట్రుకలు నల్లగా అయ్యేందుకు ఉల్లిపాయ నూనెను చాలా మంది పెడుతుంటారు. అయితే ఉల్లిపాయ నూనెకు బదులుగా ఉల్లిరసాన్ని పెడితే మీ జుట్టు రాలే అవకాశమే ఉండదని నిపుణులు చెబుతున్నారు.

ఉల్లిపాయలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు జుట్టుకు సంబంధించిన ఎన్నో సమస్యలను నయం చేస్తాయి. ఇవి జుట్టు రాలడాన్ని ఆపుతాయని మార్కెట్ లోకి ఎన్నో కొత్త కొత్త ప్రొడక్ట్స్ వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉల్లిపాయ హెయిర్ ఆయిల్స్. అయితే జుట్టు రాలడాన్ని నయం చేయడానికి ఉల్లిపాయ నూనె కాదు తాజా ఉల్లిపాయ రసం ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు ఎలా అప్లై చేయాలి?
జుట్టుకు ఉల్లిపాయను ఎన్నో విధాలుగా ఉపయోగించొచ్చు. దీని కోసం మీరు చేయాల్సిందల్లా ఉల్లిపాయ రసాన్ని తీసి నేరుగా మీ జుట్టుకు అప్లై చేయండి. జుట్టు రాలడం ఆగడానికి మీరు మీ జుట్టుకు ఉల్లిపాయ నూనెను పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఉల్లి రసాన్ని పెట్టినా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఉల్లి రసం జుట్టు రాలడాన్ని బాగా తగ్గిస్తుంది.
ఉల్లిపాయ రసాన్ని ఎన్ని రోజులు వాడాలి?
ఆశించిన ఫలితాలను పొందడానికి ఉల్లిపాయ రసాన్ని మీ జుట్టుకు 8 వారాల పాటు కంటిన్యూగా అప్లై చేయాలని నిపుణులు చెబుతున్నారు. రోజూ షాంపూకు ముందు వారానికి ఒకసారైనా ఉల్లిరసాన్ని అప్లై చేస్తే తేడా మీకే కనిపిస్తుంది. ఉల్లిపాయ రసం మన జుట్టకు ఇంకా ఎలా ప్రయోజకరంగా ఉంటుందంటే..?
hair care
జుట్టు పొడుగ్గా పెరుగుతుంది
ఉల్లిపాయ వల్ల జుట్టుకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముందు ఈ ఉల్లిపాయ రసం మీ నెత్తిమీద రక్త ప్రసరణను పెంచుతుంది. అలాగే మూసుకుపోయిన రంధ్రాలను తెరవడానికి సహాయపడుతుంది. ఇది జుట్టుకు పోషకాలను అందిస్తుంది. దీనివల్ల మీ జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. అంతేకాదు జుట్టు మూలాల్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ ను తగ్గిస్తుంది. దీని వల్ల మీ తెల్లబడే అవకాశం ఉండదు.
hairfall
జుట్టు రాలడం, చుండ్రును తగ్గిస్తుంది
జుట్టు రాలడం, చుండ్రును తగ్గించడంలో ఉల్లిపాయ రసం ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉల్లిరసంలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చుండ్రుకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపుతాయి. అలాగే నెత్తిమీద శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే జుట్టుకు యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.