Unhealthy Habits: ఈ చెడు అలవాట్లే మిమ్మల్ని బలహీనంగా మారుస్తాయి..
Unhealthy Habits: ప్రస్తుత కరోనా కాలంలో మనం ఫిట్ గా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఎలాంటి వైరస్ నన్నా ఎదురించగలం. కానీ ఏ మాత్రం ఆరోగ్యం పట్ల అశ్రద్ధగా ఉన్నా.. ఎన్నో రోగాల బారిన పడతారు జాగ్రత్త..

Unhealthy Habits: ఆరోగ్యమే మనకున్న అతిపెద్ద సంపద. ఈ ఆరోగ్యం బావున్నప్పుడే మనం మన పనులను చేసుకోగలం. సంతోషంగా జీవించగలం. కాదు కూడదని ఆరోగ్యాన్ని విస్మరించారో.. ఎన్నో జబ్బుల పాలవడం పక్కాగా జరుగుతుంది. అంతేకాదు శరీరం కూడా బలహీనంగా తయారవుతుంది. అంతేకాదు వృద్ధాప్యం కూడా ముందుగానే వస్తుంది . ఇవన్నీ ఈ క్రింద పేర్కొన్న చెడు అలవాట్ల వల్లే వస్తాయి. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
ఆకుపచ్చ కూరగాయలు తినొద్దు.. ఆకుపచ్చ కూరగాయలు మన ఆరోగ్యానికి ఎంతో మంచివి. అలా అని వీటిని ప్రతిరోజూ తింటే మాత్రం శరీర, కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆకు కూరలు తింటే శరీరానికి తగినంత పోషణ లభిస్తుది. ఇక మీ రోజు వారి డైట్ లో క్యాప్సికమ్, టొమాటోలు, క్యారెట్లు, ఉల్లిపాయలు ఉండేట్టు చూసుకోవాలి.
జంక్ ఫుడ్ మానేయాలి.. ఈ ఆధునిక కాలంలో వంట చేసుకుని తినడానికి కూడా సమయం లేదు. అందుకే చాలా మంది ప్యాకెట్ ఫుడ్స్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ను తినడం అలవాటు చేసుకున్నారు. వీటిని తినడం వల్ల ఒంట్లో షుగర్ లెవెల్స్ పెరిగిపోవడంతో పాటుగా ట్రాన్స్ ఫ్యాట్, సోడియం పరిమాణం కూడా పెరిగిపోతుంది. వీటివల్ల ప్రాణాంతకమైన గుండె జబ్బులు, క్యాన్సర్, అధిక రక్తపోట, సంక్రమన, బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ వంటి సమస్యల బారిన పడాల్సి వస్తుంది.
అనారోగ్యకరమైన అలవాట్లు.. రోజంతా ఒకే దగ్గర కూర్చోవడం, శారీరక శ్రమ చేయకపోవడం వంటి అలవాట్లు మన జీవనశైలిని పాడుచేస్తాయి. ఈ అలవాట్ల వల్ల కండరాలు బలహీనంగా మారుతాయి. అలాగే శరీరం కూడా బలహీనంగా తయారవుతుంది. ముఖ్యంగా ఈ బ్యాడ్ హాబిట్స్ వల్ల గుండె పోటు, స్ట్రోక్, ఊబకాయం, మధుమేహం, బలహీన ఎముకలు వంటి జబ్బుల బారిన పడే అవకాశం ఉంది.
health Checkup
రొటీన్ చెకప్ చేయించుకోవడం.. నెలకోసారి లేదా ప్రతి ఏడాది లేదా రెండు మూడు ఏండ్లకోసారి అవసరమైన చెకప్ లు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఈ చెకప్ లు చేయించుకోవడం వల్ల గుండె జబ్బు, క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధి వంటి ఎన్నో రోగాలను సకాలంలో గుర్తించవచ్చు. కానీ కొంతమంది రొటీన్ చెకప్ లను అస్సలు చేయించుకోరు.
తగినంత నిద్రలేకపోవడం.. ప్రతి వ్యక్తికి 8 నుంచి 9 గంటల నిద్ర ఖచ్చితంగా అవసరం. ఇంత సమయం నిద్రపోకపోతే.. శారీరకంగానే కాదు మానసికంగా కూడా మీరు అసలిపోయినట్టుగా కనిపిస్తారు . ముఖ్యంగా కంటినిండా నిద్రలేకపోవడం వల్ల గుండెపోటు, అధిక రక్తపోటు, డిప్రెషన్, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి.