Diabetes Causing Foods: వీటిని తింటే షుగర్ వ్యాధి పక్కా వస్తుందట జాగ్రత్త..!
Diabetes Causing Foods: మారుతున్న జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి ఎన్నో కారణాల వల్ల మధుమేహం వస్తుంటుంది. అయితే కొన్ని ఆహారాలకు దూరంగా ఉంటే షుగర్ వ్యాధి బారిన పడే అవకాశమే లేదంటున్నారు నిపుణులు.

Diabetes Causing Foods: చెడు ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, కదలకుండా ఒకే దగ్గర కూర్చోవడం , వారసత్వం వంటి కారణాల వల్ల డయాబెటీస్ వస్తుంటుంది. ఇది ఒకసారి వచ్చాకా.. పూర్తిగా నయం అవడం అంటూ జరగదు. జీవితాంతం ఈ వ్యాధిని ఎదుర్కోవాల్సిందే. అంతేకాదు మరువకుండా ప్రతిరోజూ మందు బిల్లలను మింగాల్సిందే.
అంతేకాదు కొన్ని రకాల ఆహారలను తీసుకోవడం వల్ల వారి రక్తంలో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతుంటాయి. ముఖ్యంగా ఈ వ్యాధిబారిన పడిన వారు బలహీనంగా ఉండటం, అధికంగా చెమట పట్టడం, heart rate పెరుగడం, కళ్లు తిరగడం, తరచుగా అలసిపోవడం, మూత్రం ఎక్కువ సార్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
అయితే షుగర్ ఎందుకు వస్తుందో తెలుసుకుంటే.. దీని బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే డయాబెటీస్ ను దూరంపెట్టొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..
పొట్టు తీసేసిన ఆహారాలు.. చెక్కెర, వైట్ రైస్, మైదా పిండి వంటి వాటివల్ల డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మధుమేహ ప్రమాదం ప్రాసెస్ చేసిన ఆహారాల వల్లే ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మనం తీసుకునే ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల్లో విటమిన్లు, మినరల్స్, ఫైబర్స్, పొట్టు వంటివి ఏవీ ఉండవు. ఇక వీటిని మితిమీరి తిన్నారో.. మీ రక్తంలో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. పలు అధ్యయనాల ప్రాకారం.. ఎక్కువ ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తిన్న చైనీస్ ఆడవారిలో 21 శాతం టైప్ 2 డయాబెటీస్ ప్రమాదం పెరిగిందట.
షుగర్ డ్రింక్స్.. షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే డ్రింక్స్ ను తాగడం మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఈ డ్రింక్స్ ను తరచుగా తాగారో పక్కాగా డయాబెటీస్ బారిన పడతారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాసెస్డ్ జ్యూసెస్, సోడా, సాఫ్ట్ డ్రింక్స్, తియ్యని లెమన్ వాటర్ వంటివి ఎక్కువగా తాగితే టైప్ 2 మధుమేహం వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ డ్రింక్స్ లల్లో కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అంతేకాదు షుగర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
వీటిని ఎక్కువగా తీసుకున్నారో చాలా తొందరగా విపరీతంగా వెయిట్ పెరిగిపోతారు. అంతేకాదు మీ రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా విపరీతంగా పెరిగిపోతాయి. దీంతో ఇన్సులిన్ పై చెడు ఎఫెక్ట్ పడుతుంది. ప్రతిరోజూ షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే డ్రింక్స్ ను తాగితే 26 శాతం టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉందని డయాబెటీస్ కేర్ అధ్యయనం స్పష్టం చేసింది.
వేయించిన ఆహారాలు.. వేయించిన ఆహార పదార్థాలను గానీ, ప్యాకెట్ ఫుడ్స్ ను గానీ ఎక్కువగా తిన్నారో మీరు ఖచ్చితంగా షుగర్ వ్యాధి బారిన పడతారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ ఆహారాల్లో ఉండే saturated fats, ట్రాన్స్ ఫ్యాట్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ను అమాంతం పెంచేస్తాయి. అంతేకాదు కొలెస్ట్రాల్ లెవెల్స్ బ్లడ్ లో పెరిగిపోతే టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. చీజ్, వెన్న, క్రీమ్ మిల్క్ వంటి ఆహారాల్లో saturated fats ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి వీటిని తినడం మానేయండి.
రెడ్ మీట్.. రెడ్ మీట్ మితిమీరి తిన్నా టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే హాట్ డాగ్, బేకన్, డెలి మీట్ వంటి ఆహారాలను కూడా తినడం మానేయండి. ఎందుకంటే ప్రాసెస్ చేసిన ఆ ఆహారాల్లో నైట్రేట్స్, సోడియం చాలా ఉంటాయి. రోజుకు 3 ఔన్సుల రెడ్ మీట్ తీసుకోవడం వల్ల 19 శాతం డయాబెటీస్ వచ్చే అవకాశం పెరుగుతుందని The American Journal of Clinical Nutrition 2011 లో చేసిన అధ్యయనంలో వెళ్లడైంది.
ఉప్పు ఎక్కువగా తీసుకున్నా.. చాలా మందికి ఇది డౌట్ గానే ఉంటుంది. చక్కెర తింటే కదా షుగర్ వచ్చేదనుకుంటారు. నిజానికి షుగర్ తో పాటుగా ఉప్పును ఎక్కువగా తిన్నా డయాబెటీస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువని పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. కాబట్టి ఉప్పును ఎక్కువగా తినడం తగ్గించుకోండి.