MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • మధుమేహం చివరకు క్యాన్సర్ కు దారితీస్తుందా..?

మధుమేహం చివరకు క్యాన్సర్ కు దారితీస్తుందా..?

టైప్ 2 డయాబెటీస్ కేవలం గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధి, స్ట్రోక్ వంటి రోగాలకే కాదు.. క్యాన్సర్ కు కూడా కారణమవుతుందని తాజా పరిశోధన ఒకటి వెల్లడిస్తోంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 22 2022, 09:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈ రోజుల్లో డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది.  ఈ వ్యాధి మధ్యవయస్కులనే కాదు.. చిన్న వయసు వారికి కూడా వస్తోంది. డయాబెటీస్ రెండు రకాలు. ఒకటి టైప్ 1 డయాబెటిస్, రెండు టైప్ 2 డయాబెటీస్. ఈ టైప్ 1 డయాబెటీస్ వంశపారంపర్యంగా వస్తుంది. దీన్ని పూర్తిగా నయం చేసుకోలేం. ఇక టైప్ 2 డయాబెటీస్ చెడు జీవన శైలి వల్ల వస్తుంది. డయాబెటీస్ అనేది ఇన్సులిన్ హార్మోన్. ఇది మనం తినే ఆహారం నుంచి గ్లూకోజ్ ను గ్రహించడానికి సహాయపడుతుంది.

27

అయితే ఈ ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గినప్పుడు.. గ్లూకోజ్ ను గ్రహించడం తగ్గుతుంది. దీంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయి.  అలాగే ఇన్సులిన్ తగినంతగా ఉన్నప్పటికీ.. కణాలు దానిని ఉపయోగించుకోలేని పరిస్థితులు కూడా ఏర్పడతాయి. దీనివల్ల కూడా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. 
 

37

కాగా ఈ మధ్యకాలంలో చాలా మంది టైప్ -2 డయాబెటిస్ తో బాధపడున్నారు. పలు అధ్యయనాల ప్రకారం.. టైప్-2 డయాబెటిస్ చివరికి రోగిని గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధి, స్ట్రోక్ వంటి అనేక పరిస్థితులకు దారితీస్తుంది. దీనిపై ఒక కొత్త అధ్యయనం భయంకరమైన విషయాన్ని వెల్లడించిది. ఏంటంటే.. ఈ డయాబెటీస్ పేషెంట్లు భవిష్యత్తులో కొన్ని రకాల క్యాన్సర్ల బారిన పడొచ్చంటున్నారు పరిశోధకులు. అంతే కాదు టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో కొన్ని జీవనశైలి పొరపాట్లు కూడా దీని మీద ప్రభావం చూపుతాయట.
 

47

డెన్మార్క్, స్వీడన్ కు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. డయాబెటీస్ వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, పురీషనాళ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని వెల్లడించారు.
 

57

ఈ అధ్యయనాన్ని ఏడు సంవత్సరాల నుంచి టైప్ -2 డయాబెటిస్ తో బాధపడుతున్న 6.5 మిలియన్ల మందిపై చేశారు. అధ్యయనం ప్రారంభంలో వీళ్లందరికీ టైప్ -2 డయాబెటిస్ ఉంది. ఈ అధ్యయనం వివిధ దశల్లో 32,000 మందికి పైగా వివిధ రకాల క్యాన్సర్లతో బాధపడుతున్నట్టు పరిశోధకులు కనుగొన్నారు. 
 

67

అలాగే వ్యాయామం చేయని వారు, ధూమపానం చేసే వారిలో కూడా చాలా మంది క్యాన్సర్ బారిన పడ్డట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ రెండు అలవాట్లున్న టైప్ -2 డయాబెటీస్ పేషెంట్లు తొందరగా చనిపోయే ప్రమాదం ఉందని అధ్యయనం స్పష్టం చేస్తుంది. 

77
diabetes

diabetes

ఈ అధ్యయనం ప్రకారం.. టైప్ -2 డయాబెటిస్ ఉన్నవారు .. ధూమపానం చేసే వారి కంటే రెండు రెట్లు ఎక్కువగా మరణిస్తారట. వారి అధ్యయనంలో పాల్గొన్న రోగుల వివరాల నుంచి ఈ నిర్ధారణకు వచ్చారు. ఎక్సర్ సైజెస్ చేయకపోవడం, సిగరేట్ కాల్చడం ఒక్క క్యాన్సర్ ముప్పే కాదు.. ప్రాణాలు కూడా త్వరగా పోయే అవకాశం ఎక్కువగా ఉందని వెల్లడిస్తున్నారు పరిశోధకులు. అందుకే డయాబెటీస్ పేషెంట్లు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్మోకింగ్ చేయడం మానేయాలి. అలాగే ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Hack: ఇలా చేస్తే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎప్పటికీ పాడవ్వవు..
Recommended image2
Rice Water: బియ్యం నీటిలో వీటిని కలిపి రాస్తే జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా!
Recommended image3
Cooking Tips: వంటలో ఉప్పు ఎక్కువైందా? ఇలా చేస్తే రుచి ఇంకా అదిరిపోద్ది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved