Insomnia: ఈ అలవాట్లు మానుకుంటేనే మీరు హాయిగా నిద్రపోతారు..
Insomnia: ఆర్థిక సమస్యలు, ఒత్తిడి, సమస్యలు వంటి ఎన్నో కారణాల వల్ల చాలా మంది నిద్రకు దూరమవుతున్నాయి. మీరు హాయిగా నిద్రపోవాలంటే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి.

Insomnia: మారుతున్న కాలంతో పాటుగా..మనుషుల అలవాట్లు కూడా పూర్తిగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఇప్పటి మనుషులకు నిద్రంటే లెక్కేలేకుండా పోయింది. కానీ కంటినిండా నిద్రుంటేనే మన ఆరోగ్యం బాగుండేది. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా ఎనిమిది గంటలు నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు.
నిద్ర తక్కువ అవడం వల్ల చదువులపై, చేస్తున్న పనిపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. మనిషికి నిద్ర తక్కువైనా.. ఎక్కువైనా ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలో కంటినిండా నిద్రపోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మరి హాయిగా పడుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం పదండి..
టైం ప్రకారమే నిద్రపోయేలా చూసుకోండి. నిద్రలేచే సమయానికి అలారంని సెట్ చేసుకోండి. అప్పుడే మీరు ప్రశాంతంగా నిద్రపోతారు. అదేపనిగా టైం చూసుకుంటూ కూర్చుంటే మాత్రం మీరు ప్రశాంతంగా నిద్రపోలేరు.
sleep
పడుకునే అర్థగంట ముందు మీ గది కిటికీలను తెరవండి. దాంతో మీ రూమంతా చల్లగా మారుతుంది. దీంతో మీరు హాయిగా పడుకుంటారు. అంతేకాదు.. పడుకునే ముందు మంచి మెలోడీ సాంగ్ ను వినండి. హాయిగా నిద్రపడుతుంది.
ముఖ్యంగా పడుకునేటప్పుడు కెఫిన్ ఎక్కవుగా ఉండే పానీయాలను అస్సలు తాగకూడదు. ఆల్కహాల్ కూడా మంచిది కాదు. కాఫీ, టీ లకు ఎంతదూరంగా ఉంటే అంత మంచిది. ఇవి తాగకుంటేనే మీరు హాయిగా నిద్రపోతారు. లేకుంటే నైటంతా మీకు జాగారమే.
పడుకునేటప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే పడుకునే ముందు సెల్ ఫోన్స్, ల్యాప్ టాప్స్ ఉపయోగించడం వల్ల వాటినుంచి వచ్చే నీలి కాంతి మీ నిద్రను చెడగొడతాయి. ఇది క్రమ క్రమంగా నిద్రలేమి సమస్యకు కారణమవుతుంది. కాబట్టి నిద్రపోయే ముందు వీటికి వీలైనంత దూరంగా ఉండండి..
డిన్నర్ కు నిద్రకు కాస్త గ్యాప్ ను మెయిన్ టెయిన్ చేయండి. ఎందుకంటే తిన్న ఆహారం జీర్ణం కావడానికి కాస్త సమయం తీసుకుంటుంది. అందే తిన్నవెంటనే నిద్రపోతే అజీర్థి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భోజనానికి నిద్రకు రెండు గంటల సమయం ఉండేట్టు చూసుకోండి.