బరువు పెరగాలనుకుంటున్నారా? ఎంత తిన్నా ఒళ్లు రావడం లేదా? ఇలా ట్రై చేయండి..
బరువు పెరగాలంటే కూడా సమతుల్య ఆహారాన్ని వాడాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు దీనికోసం కొన్ని చిట్కాలూ, సూచనలు చెబుతున్నారు.
బరువు తగ్గడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. రకరకాల డైట్లు, ఎక్సర్ సైజులు చేస్తారు. అది తెలిసిందే....దీనికి విరుద్ధంగా బరువు పెరగాలనుకునే వాళ్లూ ఉంటారు. బరువు తగ్గడం ఎంత కష్టమో.. బరువు పెరగడమూ అంతే కష్టం. సన్నని వ్యక్తులకు, త్వరగా బరువు పెరగడానికి కొవ్వు నిండిన ఆహారాన్ని తినొచ్చుకదా అనుకోకవచ్చు. అయితే ఇది అనారోగ్యకరమయింది. ప్రమాదకరం కూడా.
బరువు పెరగాలంటే కూడా సమతుల్య ఆహారాన్ని వాడాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు దీనికోసం కొన్ని చిట్కాలూ, సూచనలు చెబుతున్నారు.
శరీరతత్వం : మీది ఏ రకమైన శరీరతత్వం అనేది కూడా బరువు పెరగడంలో కీలకంగా మారుతుంది. దీంట్లో ఒకటే ఎక్టోమోర్ఫ్. ఈ రకమైన శరీర తత్వం ఉన్నవాళ్లు ఎంత తిన్నా వారి బరువులో తేడా రాదు. బరువు పెరగరు. అయితే దీనికి కొన్ని మార్పులు చేసుకోవాలి.
ఆహారంలో క్యాలరీలు పెంచాలి. రోజువారీ ఆహారంలో 500పైగా క్యాలరీలు ఉండేలా చూసుకోవాలి. రోజువారీ తీసుకునే ఆహారంతో పాటు కొంత ఎక్కువ మొత్తాన్ని తినండి. ఉదా.కు రెండు చపాతీలు తింటున్నట్లైతే.. ముడు తినండి. వీటిని ఫైబర్ ఎక్కువగా ఉండే, బీరకాయ, పాలకూర, ఆలు లాంటి కూరలతో స్టఫ్పింగ్ చేయాలి. దీంతోపాటు పనీర్, రెండు రకాల కూరగాయలు, పెరుగు, పప్పులతో తినాలి.
రెండు చెంచాల నెయ్యిలో చిటికెడు పసుపు, మిరియాల పొడి వేసుకుని తినాలి. నెయ్యిలో కేలరీలు అధికంగా ఉంటుంది. ఇది మీ రోజువారీ తీసుకునే కేలరీలను పెంచడానికి సహాయపడుతుంది. దీనివల్ల మీకు జీర్ణక్రియ మెరుగుపడుతుంది, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. చర్మాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
బ్రేక్ ఫాస్ట్ : ఉదయం పూట టిఫిన్ లో ప్రోటీన్ ఆధారిత స్మూతీలు తీసుకోండి. పాల ఉత్పత్తులు / నట్ మిల్క్ + వోట్స్ + నట్స్, సీడ్స్ + ప్రోటీన్ సప్లిమెంట్ + తేనె, 4 పూర్తి గుడ్లు, 2 అరటిపండ్లు లేదా బంగాళాదుంపలతో పాటు మూడు చపాతీలు, కూరలు, మిక్స్ వెజ్ పచ్చడి, పాలు తీసుకోవాలి.
బ్రంచ్ : నాలుగైదు సార్లు పండ్లు, నట్స్, సీడ్స్ లతో పాటు ఒక పెద్ద గ్లాస్ మజ్జిగ. లంచ్ లో ఏదైనా రెండు రకాల కూరగాయలు, పప్పు, చపాతీలు తీసుకోవాలి.
ఈవెనింగ్ : వేయించిన పనీర్ గానీ, చికెన్ గానీ, ఉడికించిన గుడ్లు, కూరగాయలు వీటితో పాటు ప్రోటీన్ షేక్ తీసుకోవాలి. డిన్నర్ లోకి... మూడు ఓట్స్ ఉతప్పాలు, రెండు కప్పుల సాంబార్, కొబ్బరి చట్నీ లాంటివి తీసుకోవాలి.
డిన్నర్ తరువాత ఒక పెద్ద గ్లాస్ అరటి షేక్ తాగాలి. ఒక గ్లాసు అరటి షేక్, రెండు గుడ్లు, ఫుల్ క్రీం పాలు తీసుకోవాలి. వీటితో పాటు ఆరోగ్యకరమైన ఆకలిని పెంపొందించడానికి కొద్ది కొద్ది మొత్తాల్లో ఎక్కువ సార్లు తినండి. ప్రతిరోజూ మూడుసార్లు భోజనం, 2-3సార్లు స్నాక్స్ తినండి. దీంతోపాటు టిఫిన్ కోసం, రాజ్మా రోల్స్, పనీర్ రోల్స్, సోయా రోల్స్, జున్ను, పెరుగు, పండు, వేరుశెనగ వెన్న టోస్ట్, పండు, గింజ మిశ్రమాలు, గట్టిగా ఉడికించిన గుడ్లు, ట్యూనా లేదా ఎగ్ సలాడ్ తినొచ్చు.