రౌండ్ టాప్స్‌తో ఉండే ఈ టెంపుల్ జుంకాలు ఎవరికైనా ఇట్టే నప్పుతాయి. అమ్మాయిలందరికీ ఇవి ఫేవరెట్. ఎందుకంటే సెలెబ్రిటీ లుక్ అందిస్తుంది.
సౌత్ ఇండియన్ జడావు వర్క్ ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ఇవి కూడా టెంపుల్ జుంకాలే. ఇవి ఎంతో అందంగా కనిపిస్తాయి.
చాంద్ వాలి జుంకాలు చాలా ట్రెండ్ అవుతున్నాయి. ఇవి టెంపుల్ స్టైల్‌లో దొరికితే మీ చెవులకు ఎంతో అందంగా ఉంటాయి.
నెమలి డిజైన్‌లోని ఈ జుంకాలు ఇయర్ కఫ్ స్టైల్‌లో వస్తాయి. ఇందులో జుంకాలతో పాటు గులాబీ రంగు కుందన్‌లతో అందమైన పనితనంతో వస్తాయి.
కనౌటి జుంకాలు చెవులను కప్పేలా ఉంటాయి. ఇవి సాంప్రదాయకంగా ఉంటాయి. టెంపుల్ స్టైల్‌లో నెమలి ఆకారంలో ఉన్న ఈ జుంకాలు పెళ్లికూతుళ్లకు సరిపోతాయి.
జుంకాలో మరో జుంకా… ఇలా రెండు, మూడు అంతస్తుల జుంకాలు ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందాయి. పెళ్లిలో హెవీ, సాంప్రదాయ లుక్ కోసం వీటిని పెట్టుకోవచ్చు.
యాంటిక్ పాలిష్‌తో ఉన్న ఇలాంటి సింగిల్ జుంకా టెంపుల్ డిజైన్ ఈ రోజుల్లో ట్రెండింగ్ లో ఉంది. లక్ష్మీదేవి రూపుతో ఇవి అందమైన లుక్‌ను ఇస్తుంది.
పెళ్లిలో ప్రత్యేకమైన క్లాసీ లుక్ కావాలంటే ఇలాంటి పెద్ద సైజు టెంపుల్ జుంకాలను ఎంచుకోవచ్చు. ఇవి గోల్డ్ ప్లేటెడ్, ఆర్టిఫిషియల్ రెండింటిలోనూ దొరుకుతాయి.