MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Pets in Train: ఇక నుంచి మీ పెంపుడు జంతువులు కూడా మీతో రైలు ఎక్కొచ్చు.. ఎలానో తెలుసా?

Pets in Train: ఇక నుంచి మీ పెంపుడు జంతువులు కూడా మీతో రైలు ఎక్కొచ్చు.. ఎలానో తెలుసా?

 Pets in Train: ఇప్పటి వరకు వందే భారత్ రైలులో మీరు ప్రయాణించి ఉండొచ్చు. ఇక నుంచి మీతో పాటు మీ పెంపుడు జంతువులను కూడా హ్యాపీగా వెంట తీసుకెళ్లొచ్చు. అందుకు తగినట్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 26 2026, 05:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Pets in Train
Image Credit : Chat GPt

Pets in Train

వందే భారత్ స్లీపర్ రైలులో పెంపెండు జంతువుల కోసం స్పెషల్ సదుపాయం తీసుకువచ్చారు. పెంపుడు జంతువులు ఉన్నవారికి ఇది నిజంగా శుభవార్తే. ఎందుకంటే...వారు ప్రయాణాలు చేయాల్సిన ప్రతిసారీ.. వాటిని తీసుకువెళ్లడం కుదరక.. ఎవరో ఒకరు ఇంట్లో వాటికోసం ఆగిపోతూ ఉంటారు. లేదంటే..వాటిని వేరే ఇంకెక్కడైనా ఉంచేస్తూ ఉంటారు. అయితే.. ఇక నుంచి ఆ అవసరం లేదు.. మీరు వందే భారత్ లో ప్రయాణిస్తే.. వాటిని మీతో పాటు తీసుకువెళ్లొచ్చు. అందుకు వీలుగా ఇండియన్ రైల్వే ఓ ప్రత్యేక సదుపాయాన్ని తీసుకువచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మీ పెట్స్ తో ప్రయాణం...
Image Credit : Indian Railway

మీ పెట్స్ తో ప్రయాణం...

వందే భారత్ స్లీపర్ రైలులో పెంపుడు జంతువుల కోసం పెట్ బాక్స్ సౌకర్యం ఉంది. నివేదికల ప్రకారం, పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక, సురక్షితమైన ఓ స్థలాన్ని కేటాయిస్తారు. ఈ బాక్సులు రైలుకు ఇరువైపులా లోకో మోటివ్ దగ్గర ఉంటాయి. అయితే, ఈ సౌకర్యాన్ని ఆన్ లైన్ లో బుక్ చేసుకోలేరు. రైల్వే స్టేషన్ కి వెళ్లి మీరు ఈ పెట్ బాక్స్ ని బుక్ చేసుకోవచ్చు.

ఈ సదుపాయం పొందాలంటే.. ప్రయాణికులు తాము బయలుదేరే స్టేషన్ లోని పార్సెల్ లేదా లగేజ్ కార్యాలయాన్ని సందర్శించాలి. అక్కడ ఉన్న అధికారి మీ కుక్క లేదా పిల్లి కోసం ఒక పెట్ బాక్స్ ను బుక్ చేస్తారు. రైలు బయలు దేరడానికి కనీసం మూడు గంటల ముందే.. మీరు ఈ బాక్స్ ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

33
  ప్రయాణికుల టికెట్ తప్పనిసరి..
Image Credit : Asianet News

ప్రయాణికుల టికెట్ తప్పనిసరి..

వందే భారత్ స్లీపర్ రైలులో పెట్ బాక్స్ బుక్ చేసుకోవాలంటే... ప్రయాణికులకు కన్ఫర్మ్ టికెట్ తప్పనిసరిగా ఉండాలి. ఆర్ఏసీ, వెయిటెడ్ లిస్ట్ లో ఉన్న టికెట్లకు ఈ పెట్ బాక్స్ సదుపాయాన్ని అందించరు. అదనంగా, ప్రయాణికులు తమ పెంపుడు జంతువుకు సంబంధించిన ఇటీవలి వెటర్నరీ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ అందించాలి. అది కూడా ప్రయాణానికి 48 గంటల లోపు వెటర్నరీ డాక్టర్ ఇచ్చింది అయ్యి ఉండాలి. అంతేకాకుండా..వాటికి రీసెంట్ గా వేసిన వ్యాక్సిన్ రికార్డు కూడా అందించాలి. పెట్ బాక్స్ ధర మీ పెట్ బరువు ఆధారంగా నిర్ణయిస్తారు. కిలోకి రూ.30 చొప్పున లెక్కిస్తారు. పెట్ బాక్స్ బుకింగ్ కన్ఫామ్ అయితే.. మీ లగేజ్ టికెట్ రూపంలో ఇస్తారు.

క్యాబిన్‌ల లోపలికి అనుమతి లేదు

ఈ సౌకర్యం కింద, పెంపుడు జంతువులను రైలు బోగీకి రెండు చివర్లలోని నిర్దిష్ట ప్రదేశాలలో ఉంచుతారు. పెంపుడు జంతువులను ప్రయాణీకుల క్యాబిన్‌లలోకి అనుమతించరు. ముఖ్యంగా, పెట్ బాక్స్ బుకింగ్ రుసుము వాపసు ఇవ్వరు. ఒక PNRకు ఒక పెంపుడు జంతువును మాత్రమే అనుమతిస్తారు. అందువల్ల, ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది. అంతేకాకుండా, ఈ సేవ అన్ని మార్గాలలో అందుబాటులో ఉండకపోవచ్చు, కాబట్టి ప్రయాణీకులు తాము వెళ్లే రైలుకి ఈ సర్వీస్ ఉందో లేదో చెక్ చేసుకోవడం మంచిది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ప్రయాణం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nita Ambani: స్వదేశీ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నీతా అంబానీ..బనారసి చీరలో లుక్ అదుర్స్
Recommended image2
లిప్‌స్టిక్‌ ఇష్టం లేకపోతే దానికి బదులు వీటిని వాడండి
Recommended image3
Baby Products: బేబీ ప్రొడక్ట్స్ పెద్దవాళ్లు కూడా వాడితే ఏమవుతుంది?
Related Stories
Recommended image1
Old Bedsheet Reuse: పాత, చినిగిపోయిన దుప్పట్లు పారేస్తున్నారా? ఇలా వాడేయండి..!
Recommended image2
Bike Seat: బైక్ వెనక సీటు ఎత్తుగా ఎందుకు ఉంటుంది..? స్టైల్ అయితే కాదు, కారణం ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved