MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ లో ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు ఇవే!

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ లో ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు ఇవే!

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలోని ఆగ్రాకు దక్షిణంగా 122 కిలోమీటర్ల దూరంలో గ్వాలియర్ (Gwalior) పట్టణం ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగవ అతి పెద్ద పట్టణంగా ఉన్న గ్వాలియర్ లో అనేక సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. వీటి సందర్శన పర్యాటకులకు తప్పక నచ్చుతుంది. మరి ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా గ్వాలియర్ లోని సందర్శనీయ ప్రదేశాల గురించి తెలుసుకుందాం.. 

2 Min read
Author : Navya G | Asianet News
Published : Jan 18 2022, 04:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ ప్రదేశంలో అనేక చారిత్రాత్మక స్మారకాలు, కోటలు (Castles), మ్యూజియంలు (Museums) ఇలా మొదలగునవి ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ఈ పట్టణం పారిశ్రామిక నగరంగా కూడా ప్రసిద్ధి. ఈ పట్టణాన్ని 8వ శతాబ్దంలో కనుగొన్నారు. గ్వాలియర్ లో ప్రధాన ఆకర్షణగా గ్వాలియర్ కోట, ఫుల్ బాగ్, సూరజ్ కుండ్, మాన్ మందిర్ ప్యాలెస్, హతి ఫూల్, జై విలాస్ మహల్ ఇలా మొదలగునవి ఉన్నాయి.
 

26

గ్వాలియర్ కోట: గ్వాలియర్ కోట (Gwalior Fort) నగరం మధ్యలో ఉన్న ఒక కొండపై ఉంది. ఈ కోటను తోమార్ వంశానికి చెందిన రాజా మాన్ సింగ్ తోమార్ (Raja Man Singh Tomar) నిర్మించారు. ఈ కోట నిర్మాణం చైనీయులు శిల్పకళ తీరును కలిగి ఉంటుంది. గ్వాలియర్ కోటను జీబ్రాల్టార్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఈ కోట సందర్శన తప్పక మీకు నచ్చుతుంది.
 

36

సన్ టెంపుల్: సన్ టెంపుల్ (Sun Temple) ను సూర్యుడి మందిరం అని కూడా అంటారు. ఇది సూర్యుని గుడి. ఈ మందిర నిర్మాణం ఒరిస్సాలోని కోణార్క్ టెంపుల్ ను పోలి ఉంటుంది. ఈ మందిర నిర్మాణం 1988లో ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన జి. డి. బిర్లా (G. d. Birla) నిర్మించారు. ఈ దేవాలయం లోపల పూర్తిగా మార్బుల్స్ తో నిర్మించగా, బయటి భాగంలో అనేక దేవతా మూర్తులతో నిర్మించారు. ఈ దేవాలయం ఎంతో ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి పర్యాటకులను ఆకట్టుకునేలా ఉంటుంది.
 

46

జై విలాస్ మహల్:  సింధియా వంశస్థుల నివాసంగా జై విలాస్ మహల్ (Jai Vilas Mahal) ఉండేది. ఈ మహల్ ను 1809లో జియాజి రావు సిందియా (Jiaji Rao Scindia) నిర్మించారు. ఈ భవనం అద్భుతమైన శిల్పకళను కలిగి పర్యాటకలను ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ మహల్ సందర్శన సింధియా వంశస్థుల నాగరికతను తెలియజేస్తుంది.
 

56

సూరజ్ కుండ్: గ్వాలియర్ కోటకు సమీపంలో ఉన్న అందమైన కొలనుగా సూరజ్ కుండ్ (Suraj Kund) ప్రసిద్ధి. సూరజ్ సేన్ మహారాజు తన కుష్టు వ్యాధిని (Leprosy) నయం చేసుకోవడానికి ఈ నీటిని తాగడంతో నయమయిందని స్థానిక కథనం. సూరజ్ సేన్ రాజు పేరు మీదుగా ఈ కొలనుకు సూరజ్ కుండ్ అనే పేరు వచ్చింది. ఈ కొలను అందమైన ప్రకృతి అందాలతో పర్యాటకులను ఆకట్టుకునేలా ఉంటుంది. 
 

66

ఫుల్ భాగ్: ఫుల్ భాగ్ (Full Bhag) గ్వాలియర్ రైల్వే స్టేషన్ కు అతి సమీపంలో ఉన్న అందమైన తోట. ఈ అందమైన తోటను మాధవ రావ్ షిండే (Madhava Rao Shinde) నిర్మించారు. ఈ ప్రదేశంలో ప్రధాన ఆకర్షణగా గ్వాలియర్ జూ, గురుద్వారా టెంపుల్, మసీదులు ఇలా మొదలగునవి ఉన్నాయి.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Jeera Water: రోజూ జీలకర్ర నీళ్లు తాగితే ఏమవుతుంది?
Recommended image2
Spinach: రోజూ పాలకూర తింటే ఏమవుతుంది?
Recommended image3
Healthy Teeth: ఈ ఫుడ్స్ తింటే మీ పళ్లు పుచ్చిపోవడం పక్కా.. వీటికి దూరంగా ఉండండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved