MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఉదయం లేవగానే ఇలా చేస్తున్నారా..? ఈ అలవాట్లు కచ్చితంగా మార్చుకోవాల్సిందే..!

ఉదయం లేవగానే ఇలా చేస్తున్నారా..? ఈ అలవాట్లు కచ్చితంగా మార్చుకోవాల్సిందే..!

ఈ క్రమంలో.. మనకు రోజు కూడా సరిగా గడవదు. మరి అలా కాకుండా ఉండాలి అంటే.. మనం కచ్చితంగా మార్చుకోవాల్సిన అలవాట్లు కొన్ని ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 21 2022, 12:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రతి రోజూ మనం నిద్రలేవగానే.. అలవాటుగా కొన్ని పనులు చేస్తూ ఉంటాం. అయితే.., ఆ అలవాట్లు మనకు భవిష్యత్తులో ఆటంకం కలిగించేవి అయితే.. వాటిని మానుకోవడమే ఉత్తమమైన మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఆ చెడు అలవాట్లు. మనల్ని వెననక్కి లాగేస్తూ ఉంటాయి. మనకు ప్రతికూలంగా మారుతూ ఉంటాయి. మనకు కోపాన్ని తెప్పిస్తూ ఉంటాయి. ఆ కోపాన్ని ఇతరులపై చూపిస్తారు.  ఈ క్రమంలో.. మనకు రోజు కూడా సరిగా గడవదు. మరి అలా కాకుండా ఉండాలి అంటే.. మనం కచ్చితంగా మార్చుకోవాల్సిన అలవాట్లు కొన్ని ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

26

1. చాలా మందికి ఉదయం లేవగానే.. ఫోన్ చూస్తూ ఉంటారు. బెడ్ మీద  నుంచి కిందకు దిగకముందే ఫోన్ పట్టుకుంటారు. ఇది మన కళ్లను ప్రభావితం చేసే అత్యంత విషపూరితమైన అలవాటు. అంతేకాదు.. ఫోన్ చూడటం మొదలుపెడితే తెలీకుండానే టైమ్ అంతా వేస్ట్ అయిపోతుంది. దానికి బదులు.. లేవగానే ఫోన్ చూడకుండా.. దానిని పక్కన పెట్టి గోరువెచ్చని నీరు తాగడం మొదలుపెట్టాలి. కిటికీ, బాల్కనీ వద్దకు వెళ్లి స్వచ్ఛమైన గాలని పీల్చాలి. కనీసం లేచిన తర్వాత, గంట, రెండు గంటల తర్వాత.. ఫోన్ ని పట్టుకోండి.

36
breakfast

breakfast

2.చాలా మందికి ఉన్న చెడు అలవాట్లలో ఇది ఒకటి. ఉదయాన్నే ఆలస్యంగా నిద్ర లేవడం.. ఇక.. ఆఫీసు, కాలేజీలకు ఆలస్యమౌతోందని ఉదయం అల్పాహారం చేయడం మానేస్తూ ఉంటారు. దాని బదులు టీ, కాఫీ తాగడం లాంటివి చేస్తుంటారు. అయితే.. అలా చేయవద్దని నిపుణులు చెబుతున్నారు. అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. గుడ్డు, టోస్ట్ ,ఓట్ మీల్.. తాజా పండ్లు.. ఇలా ఏదో ఒకటి ఖచ్చితంగా తీసుకోవాలి.

46

3.మీరు ఉదయం లేచిన తర్వాత, మీరు మీ రోజును ప్లాన్ చేసుకోవడం ముఖ్యం. అది ఆదివారం అయినా , మీరు షాపింగ్ చేయాలనుకున్నా దానికి అనుగుణంగా పని చేయండి. మీ ప్రణాళికలను ఆలస్యం చేయవద్దు, అది ఎప్పటికీ ఫలించదు. బయటికి వెళ్లే ముందు మీకు సమయం దొరికితే మొక్కలకు నీరు పెట్టండి లేదా ఇల్లు, ఫ్రిజ్ శుభ్రం చేయండి. అంతేకానీ.. బద్దకంగా మాత్రం ఉండకూడదు.
 

56
bath

bath

4.ఇక చాలా మంది ఉదయాన్నే స్నానం చేయరు. తర్వాత చేద్దాంలే.. అని వాయిదా వేసి.. మధ్యాహ్నమో, సాయంత్రమో చేయడం లాంటివి చేస్తారు. అలా చేయవద్దట. ఉదయాన్నే కచ్చితంగా స్నానం చేయాలట. అలా చేయడం వల్ల రోజు మొత్తం ఉల్లాసంగా ఉంటారట. శరీరం నుంచి మంచి హార్మోన్లు విడుదల అవుతాయి. దీని వల్ల ఎక్కువ పని చేయగల శక్తి లభిస్తుందట.

66

5. ఏ విషయంలోనైనా పాజిటివి్ థింకింగ్ ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా ఉదయం వేళ పాజిటివ్ థింకింగ్  చాలా అవసరం. మీరు నిద్ర లేవగానే జీవితంలో ప్రతికూల విషయాల గురించి ఎప్పుడూ ఆలోచించకండి. ధ్యానం చేయండి. మీరు జీవితంలో కలిగి ఉన్న మంచి విషయాలకు కృతజ్ఞతతో ఉండండి. నెగిటివ్ ఆలోచనల కారణంగా.. మనలో నిరాశ పెరిగిపోతుంది. కాబట్టి.. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
లైట్ వెయిట్ లో షార్ట్ నల్లపూసల దండ.. కొత్త డిజైన్స్ చూసేయండి
Recommended image2
Bad Breath: బ్రష్ చేసినా నోరు దుర్వాసన వస్తోందా? ఈ విటమిన్ లోపమే కారణం, ఇవి తింటే చాలు
Recommended image3
Life Destroying Habits : చెక్ చేసుకొండి... ఈ పది అంశాల్లో ఏ మూడు మీ జీవితంలో ఉన్నా దేవుడు కూడా రక్షించలేడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved