MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Today Horoscope: ఈ రాశి వారికి స్థాన మార్పిడి, అసంతృప్తి.. !

Today Horoscope: ఈ రాశి వారికి స్థాన మార్పిడి, అసంతృప్తి.. !

Horoscope Today :  రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికీ నష్టాలుంటాయి. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ రోజు రాశి ఫలాల్లో తెలుసుకుందాం

4 Min read
Author : Mahesh Rajamoni
Published : May 17 2022, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
Aries Zodiac

Aries Zodiac

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :-  
 
బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. గృహంలో మార్పులు, చేర్పులు త్వరలో అనుకూలిస్తాయి.  దైవ, సేవా, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. చిత్తశుద్ధితో మెలిగి మీ నిజాయితీని చాటుకుంటారు.  కొత్త వ్యక్తుల పరిచయాలు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల యందు లాభం. కొత్త ఆలోచనలు చేస్తారు. వస్తు వాహన ప్రాప్తి. మహాలక్ష్మీ నమః అనే మంత్రమును 21 మార్లు జపించి న శుభం జరుగుతుంది

213
Taurus

Taurus

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  

శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల యందు లాభం. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. కార్యాలకు శ్రీకారం చుడతారు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత. విద్యార్థులకు అనుకూలం. ఓందుర్గాయై నమః అనే మంత్రమును 21 మార్లు జపించిన శుభం జరుగును.
 

313
Gemini

Gemini

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  

అన్ని పనులకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్లు వాయిదా పడటం మంచిది. స్త్రీలకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి.వృత్తి,వ్యాపారాలలో లాభం. రావలసిన బకాయిలు వసూలగును. పోగొట్టు పోయిన వస్తువు దొరుకుట. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు.ఓం నమశ్శివాయ అను మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును.
 

413

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- 

అనవసరమైన ఆలోచనలు చేస్తారు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవటం మంచిది. నిరుద్యోగులకు అపరిచిత వ్యక్తులపట్ల అప్రమత్తత అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. ఇతరులసహాయం తీసుకుంటారు. వృత్తి,వ్యాపారాల యందు చిక్కులు. సంఘంలో గొడవలు. ఊహించని ఖర్చులు. రుణ బాధ. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకొనవలెను. పనులలో జాప్యం. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అను మంత్రమును 21 మార్లు జపించి నా శుభం జరుగును.
 

513
Leo

Leo

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-

శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు స్థానమార్పిడికై చేయు ప్రయత్నాలలో కొంత అసంతృప్తికి గురవుతారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. వ్యాపారాల యందు ధనలాభం. గృహము నందు శుభకార్యములు. బంధు మిత్రుల కలయిక. సంఘంలో పేరు ప్రతిష్టలు. తలపెట్టిన కార్యములు పూర్తి చేస్తారు. ఆనందంగా గడుపుతారు. ఓం నమో నారాయణాయ అను మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును.

613

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- 

అన్ని పనులకు అనుకూలం.స్త్రీలు గృహోపకరణాలకు విలువైన వస్తువులను కొనుగోలుకై చేయుయత్నాలు వాయిదా . చేతి వృత్తి, వ్యాపారులకు సదావకాశాలు. వస్త్ర, ఆకస్మిక ధనలాభం వంటి శుభపరిణామాలున్నాయి. రావలసిన బకాయిలు వసూలు అగును. శుభవార్తలు వింటారు.  సంఘంలో గౌరవ ప్రతిష్టలు. శుభ కార్యాలకు శ్రీకారం చుడతారు. దుర్గా దేవి ఆరాధన చేసిన శుభం జరుగును
 

713
Libra

Libra

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- 

అవసరమైన గొడవలు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి వంటివి తప్పవు. గృహంలో మార్పులు, చేర్పులు త్వరలో అనుకూలిస్తాయి. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. మానసిక ఒత్తిడి. చెడు స్నేహాలకు దూరంగా ఉండవలెను. కష్టించిన పనులలో లాభం చేకూరును. సమస్యలు ఏర్పడతాయి. అవసరమైన ఆలోచనలు చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో సామాన్యంగా ఉంటుంది. ఓం దుర్గాయై నమః అను మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును.
 

813

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- 

చేయు పనులయందు ఆలస్యం. బంధుమిత్రులతో మనస్పర్థలు.  కుటుంబ సభ్యుల మధ్య కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. అధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.అకారణంగా కోపం. బంధుమిత్రులతో కలహాలు. అనవసరంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. ఉద్యోగ వ్యాపారాల యందు నిరాశ. ప్రయాణాల్లో కొత్త విషయాలు వింటారు. మానసిక ఒత్తిడి. ఓం సూర్యాయ నమః అనే మంత్రమును 21 మార్లు జపించిన శుభం జరుగును.

913


ధనుస్సు రాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :-

బంధు మిత్రులతో పేచీలు. కొత్త వ్యక్తులతో పరిచయాలు. కిరాణా, ధాన్యం వ్యాపారులకు, స్టాకిస్టులకు మెలకువ అవసరం. ఖర్చులు సామాన్యంగా ఉండగలవు. మీకు బాగా ఇష్టమైన వారి కోసం మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు. ఊహించని ఖర్చులు. రుణ బాధ. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. కోర్టు వ్యవహారంలో యందు తెలివిగా వ్యవహరించాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసిన శుభం జరుగును.
 

1013
Capricorn

Capricorn

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- 

అనవసర ఖర్చులు. పనుల యందు నిరాసక్తత.ఉద్యోగస్తులకు అధికారుల నుంచి అనుకున్నంత గుర్తింపు లభించదు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అకారణంగా కోపం. వస్తు వాహన ప్రాప్తి. పోయిన వస్తువు తిరిగి లభించుట. అధికారులతో ఇబ్బందులు. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అను మంత్రమును 21 మార్లు జపించి నా శుభం జరుగును.

1113

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :-

చేయు పనులయందు ఆటంకాలు. గతంలో ఒకరికిచ్చిన హామీ వల్ల ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురికాకండి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది.ఎక్కువగా కష్టపడతారు. అవసరమైన ఆలోచనలు చేస్తారు. సంఘంలో గొడవలు. వృత్తి వ్యాపారాల యందు నిరాశ. ప్రయాణాలలోజాగ్రత్తలు తీసుకొనవలెను. క్రయవిక్రయాల తెలివిగా వ్యవహరించవలెను. మానసిక ఒత్తిడి. ఓం నమశ్శివాయ అను మంత్రము 21 మార్లు జపించి నా శుభం జరుగును.
 

1213

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-

అనవసరమైన ఆలోచనలు చేస్తారు. అతిగా వ్యవహరించి చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. బంధుమిత్రులతో మనస్పర్థలు తలెత్తుతాయి.చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాలలో నిరాశ. కుటుంబంలో చికాకులు. ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించాలి. కష్టించి చేసిన పనులలో లాభం చేకూరును. దుర్గా దేవి ఆరాధన చేసినా శుభం జరుగును.
 

1313

పంచాగం

శుభ కృత నామ సంవత్సరం
ఉత్తరాయణం
వైశాఖ మాసం
కృష్ణపక్షం- పాడ్యమి పగలు08:01ని‌.ల వరకు తదుపరి విదియ
అనూరాధ నక్షత్రం మధ్యాహ్నం.12:43ని|| వరకు
వర్జ్యం సా.05:58ని.ల లగాయతు సా.07:27ని.లవరకు
దుర్ముహూర్తం ఉదయం 08:05ని. లగాయతు 08:56ని.ల వరకు తిరిగి
 రాత్రి10:48ని‌‌.ల లగాయతు 11:33ని.ల వరకు
రాహుకాలం మధ్యాహ్నం 03:00ని.ల లగాయతు సాయంత్రం 04:30ని.ల వరకు
యమగండం ఉదయం 09:00ని.ల లగాయతు ఉదయం.10:30ని.ల వరకు
సూర్యోదయం ఉదయం 5:51ని.లకు
సూర్యాస్తమయం సాయంత్రం 6:21ని.లకు.

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జ్యోతిష్యం
Latest Videos
Recommended Stories
Recommended image1
Weight Loss: ఈ సూప్ తాగితే.. నెలరోజుల్లో బరువు తగ్గడం చాలా ఈజీ..!
Recommended image2
Fridge Placement: ఫ్రిజ్‌కి, గోడకి మధ్య గ్యాప్ ఎంత ఉంటే కరెంటు బిల్లు తక్కువ వస్తుంది?
Recommended image3
Real Love story: ఆమె నాకు జీవితాంతం గుర్తుండి పోయేలా బుద్ధి చెప్పింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved