Headache: తలనొప్పిని క్షణాల్లో తగ్గించే చిట్కాలిగో..
health tips: కంటినిండా నిద్రలేకపోయినా, సమయానికి తినకపోయినా.. ఒత్తిడికి లోనైనా తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ఈ తలనొప్పి ఏ కారణం చేత వచ్చినా.. దాని వల్ల కలిగే బాధ మాటల్లో చెప్పలేనిది. ఇంకొంచెం సేపైతే తల పగిలిపోతదేమో అనిపిస్తుంటుంది. తీవ్రమైన తలనొప్పిని కొన్ని సింపుల్ చిట్కాలతో క్షణాల్లో తగ్గించుకోవచ్చు. అదెలాగంటే..

health tips: తలనొప్పి రకరకాల కారణాల వల్ల వస్తూ ఉంటుంది. పనిలో ఒత్తిడి పెరిగిపోయినప్పుడు, సమయానికి తినకపోవడం, కంటినిండా నిద్రపోకపోవడం, తీవ్రంగా ఆలోచించడం వంటి కారణాల వల్ల తలనొప్పి వస్తుంది. ఇక వేసవికాలంలో అయితే ఎండలో తిరిగితే పక్కాగా వస్తుంది. అయితే ఈ తలనొప్పి ఏ కారణం చేత వచ్చినా.. దాని వల్ల కలిగే భాద మాత్రం మాటల్లో చెప్పలేనిది. ఈ సమస్య వల్ల ఏ పని చేయాలనిపించదు. ఏకాగ్రత ఉండదు. ఒక స్టేజ్ లో తలకాయ పగిలిపోతదేమోనన్న భయం కలుగుతుంది. ఈ తీవ్రమైన తలనొప్పి కొన్ని సింపుల్ చిట్కాల ద్వారా ఈజీగా తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఏ పనిమీదనన్నా బయటకు వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా తలపై క్యాప్ తప్పుకుండా పెట్టుకోవాలి. లేదా స్కార్ఫ్ లాంటివి చుట్టుకున్నా పర్లేదు. ఎందుకంటే ఎండ నేరుగా మన తలపై పడటం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. అందుకే ఎండలో వెళ్లినప్పుడు మర్చిపోకుండా తలకు ఎండ తగలకుండా చూసుకోవాలి.
ఎండలో తిరగడం మూలంగా తలనొప్పి అటాక్ చేస్తే.. వెంటనే చల్లని ప్లేస్ల్ లో కూర్చోండి. దీనివల్ల మీ తలనొప్పి క్షణాల్లో తగ్గుతుంది. అలాగే ఎండలో తిరిగొచ్చిన తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్నికడిగితే తలనొప్పి వచ్చే అవకాశం ఉండదు. ఎండలో తిరిగిన తర్వాత చల్లని ప్లేస్ లో కూర్చోవడం వల్ల హాయిగా అనిపిస్తుంది. కళ్లను చల్లని నీళ్లతో కడగడం వల్ల బాడీ రిలాక్స్ అవుతుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. దీనివల్ల తలనొప్పి క్షణాల్లో తగ్గిపోతుంది.
మీకు తెలుసా.. శరీరానికి సరిపడా నీరు తాగపోయినా హెడేక్ వస్తుంది. కాబట్టి మీరు రోజూ మీ శరీరానికి సరిపడా నీళ్లను తాగుతూ ఉండాలి. అప్పుడే తలనొప్పి సమస్య వచ్చే అవకాశం ఉండదు.
తీవ్రమైన తలనొప్పి వేధిస్తున్నప్పుడు మజ్జిగనో, చల్లటి కొబ్బరి నీళ్లో తాగితే ఉపశమనం లభిస్తుంది. సహజసిద్దమైన డ్రింక్స్ వల్ల తలనొప్పే ఇట్టే తగ్గిపోతుంది. వట్టివేరుతో చేసిన డ్రింక్ వల్ల కూడా తలనొప్పి క్షణాల్లో తగ్గిపోతుంది.
తలనొప్పిని తగ్గించడంలో పండ్లు ఎంతగానో సహాయపడతాయి. తీవ్రమైన తలనొప్పి వేధించినప్పుడు పైనాపిల్, పుచ్చకాయలు, అరటిపండ్లను తింటే మీ తలనొప్పి ఈజీగా తగ్గిపోతుంది.