పాదాల పగుళ్లు తగ్గాలంటే..!
పాదాలు పగలడమే కాదు అవి విపరీతంగా నొప్పి పెట్టడం, రక్తం కారడం వంటి సమస్యలు కూడా వస్తాయి. అయితే పాదాల అంచులపై చర్మం గట్టిగా మారడం వల్ల కూడా పాదాల పగుళ్లు వస్తాయి. కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ పగుళ్లను తగ్గించుకోవచ్చు.

ప్రస్తుతం చాలా మంది పాదాల పగుళ్లతో బాధపడుతున్నారు. శీతాకాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. మడమలు పగలడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. పాదాల చర్మంలో తేమ కోల్పోవడం. పాదాలకు సరైన సంరక్షణ లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. చాలా మందికి పగుళ్ల వల్ల విపరీతమైన నొప్పి వస్తుంది. అంతేకాదు పగుళ్ల నుంచి రక్తం కూడా కారుతుంటుంది. పాదాల అంచులపై చర్మం చిక్కబడటం వల్ల కూడా పాదాల పగుళ్లు వస్తాయి. పాదాలు అందంగా, పగలకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం. పాదాల పగుళ్లు రాకుండా ఉండటానికి కొన్ని చిట్కాలు మీకోసం..
కొబ్బరినూనె
పాదాల పగుళ్లకు కొబ్బరి నూనె ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు కొద్దిగా కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెతో పాదాలను బాగా మసాజ్ చేయండి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల పాదాలు పగిలిపోకుండా ఉంటాయి. ఒకవేళ పగిలినా అవి మానిపోతాయి.
Image: Getty Images
కలబంద జెల్
కలబంద జెల్ లో ఎన్నో ఔషదగుణాలున్నాయి. ఈ కలబంద జెల్ ఎన్నో శారీరక సమస్యలను తగ్గిస్తుంది. చర్మాన్ని స్మూత్ గా, అందంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. అయితే కలబందతో పాదాలకు మసాజ్ చేయడం వల్ల పగుళ్లు తొలగిపోవడమే కాకుండా చర్మం మరింత సున్నితంగా మారుతుంది.
నిమ్మరసం
నిమ్మరసం మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. ఇది పాదాల పగుళ్లను కూడా తగ్గిస్తుంది. ఇందుకోసం నిమ్మరసాన్ని తీసుకుని పాదాలకు అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి. ఇలా వారానికి మూడు లేదా నాలుగు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఉప్పు
పాదాల పగుళ్లను నివారించడానికి ఉప్పు గ్రేట్ గా సహాయపడుతుంది. దీని కోసం గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి అందులో పాదాలను నానబెట్టండి. దీన్ని 20 నిమిషాల వరకు ఉంచడం వల్ల పాదాల పగుళ్లు తగ్గిపోతాయి. పాదాలు అందంగా కూడా కనిపిస్తాయి.
బేకింగ్ సోడా
బేకింగ్ సోడా మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఇది పాదాల పగుళ్లను కూడా తగ్గిస్తుంది. ఇందుకోసం గోరువెచ్చని నీటిలో బేకింగ్ సోడా, ఉప్పు వేసి పాదాలను పదిహేను నిమిషాల పాటు నానబెట్టండి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.