Beauty Tips: మిడిల్ ఏజ్ లో కూడా టీనేజర్ లా కనిపించాలంటే.. ఈ చిట్కాలు తప్పనిసరి!
Beauty Tips: నేటి జీవనశైలి కారణంగా ప్రజలు వయసు కంటే ముందుగానే ముసలివారు అవుతున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మిడిల్ ఏజ్ లో కూడా టీనేజర్ లా కనిపించవచ్చు అంటున్నారు బ్యూటీషియన్స్. అదెలాగో చూద్దాం.
Image: Getty Images
కాలుష్యం అనేది ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పాడు చేస్తుంది. అందంగా కనిపించాలని, వయసు తక్కువగా కనిపించాలని అందరికీ ఉంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన మన చర్మాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ, వృద్ధాప్యాన్ని కూడా నివారించడానికి కొన్ని చిట్కాలు పాటించడం తప్పనిసరి అంటున్నారు బ్యూటీషియన్స్.
అవేమిటో చూద్దాం. చాలామంది 30 సంవత్సరాలు దాటిన తర్వాత గాని ఆరోగ్యం పట్ల, శారీరక శ్రద్ధ పట్ల గాని ఎక్కువగా శ్రద్ధ తీసుకోరు. కొంతమంది వయసు పెరిగినప్పటికీ చిన్న వయసులా కనిపిస్తూ ఉంటారు. దానికి కారణం వారు ముందు నుంచి అందం పట్ల ఆరోగ్యం పట్ల తీసుకున్న శ్రద్ధ కారణం.
అయితే మీరు కూడా మిడిల్ ఏజ్ లో టీనేజ్ లా కనిపించాలంటే ఇకనైనా మీ చర్మం పై శ్రద్ధ తీసుకోండి. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం వలన చర్మం ఎప్పుడూ సజీవంగా కనిపిస్తుంది. దీనివలన వృద్ధాప్య సంకేతాలను దూరం చేయవచ్చు.
అందుకోసం మీరు రోజుకి ఎనిమిది నుంచి తొమ్మిది గ్లాసులు నీరు తప్పనిసరిగా తాగాలి. పండ్ల రసాలు ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకుంటూ ఉండాలి. కాలానుగుణంగా స్థానికంగా లభించే పండ్లు తినాలి.
చర్మానికి కొబ్బరినూనె ఉపయోగించండి, దీనివలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ ఈ చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తుంది. ఇది వదులుగా ఉన్న చర్మాన్ని బిగుతుగా మార్చడంలో సహాయపడుతుంది.
ఇందుకోసం వారానికి రెండుసార్లు కొబ్బరి నూనెతో శరీరానికి మసాజ్ చేసి స్నానం చేయండి. అలాగే ముఖానికి సంబంధించిన వ్యాయామాలను చేయటం వలన ముఖంలో వచ్చే మడతలను నివారించవచ్చు. నిత్యం శరీరాన్ని చురుకుగా ఉండేలాగా చూసుకోండి. తగినంత వ్యాయామం వలన కూడా వయసు పైబడకుండా కనిపిస్తాము.