హాయిగా నిద్రపోవాలంటే..?
Insomnia: ఎలా పడుకున్నా నిద్ర మాత్రం రావడ లేదే? నేనేం చేయను.. ఎలా పడుకుంటే నిద్రొస్తది.. దేవుడా.. ప్లీజ్ నిద్ర రప్పించు అని దేవుడిని ప్రార్థించేవారెవరైనా ఉన్నారా? ..అయితే ఈ టిప్స్ మీకు బాగా ఉపయోగపడతాయి.

Insomnia: ప్రస్తుతం ఊబకాయం ఎలా అయితే కామన్ ప్రాబ్లమ్ గా మారిందో.. నిద్రలేమి కూడా అలాగే తయారయ్యింది. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నానని ఎవరైనా.. చెబితే.. హే ఈ ప్రాబ్లమ్ ఇప్పుడు కామన్ రా అని తేలిగ్గా తీసిపారేసేవారు చాలా మందే ఉన్నారు. ఈ సమస్య అంత తేలిగ్గా కొట్టినా.. ఇది చాలా డేంజర్.
నిద్రలేమి సమస్య కామన్ గా అనిపించినా.. దీనివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేయాల్సి ఉంటుంది. గుండెకు సంబంధించిన జబ్బులు, ఊబకాయం, అధిక రక్తపోటు, డయాబెటిస్ వంటి ప్రమాదరకమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సమస్య నుంచి తొందరగా బయటపడటానికి ప్రయత్నించాలి తప్ప కామన్ అంటూ తీసిపారేయకూడదు.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ఏడెనిమిది గంటల నిద్ర అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కానీ చాలా మందికి నిద్ర కరువైంది. పనిలో ఒత్తిడి వల్లనో లేకపోతే డిప్రెషన్ వల్లో లేదా మరెదైనా కారణంగానో కానీ నిద్రించే టైం పూర్తిగా తగ్గిపోయింది. కంటి నిండా నిద్రలేకపోవడం వల్ల పనిలో ఏకాగ్రత చూపలేరు. దాన్ని పర్ఫెక్ట్ గా చేయలేరు. అలా కాకూడదంటే మీరు హాయిగా నిద్రపోవాలి. హాయిగా పడుకోవాలంటే ఈ టిప్స్ ను పాలో అవ్వాల్సిందే..
సైకిల్ ప్రిపరేషన్: ప్రతి ఒక్కరూ నిద్రకు సమయం కేటాయించాలి. ఈ సమయానికే పడుకోవాలని ముందే నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా నిద్రొచ్చే వరకు ఫోన్ చూస్తూ ఉంటానని అనుకోకూడదు. దీనివల్ల మీ నిద్రపోతుంది. ఇక పడుకునే ముందు లైట్ ఆఫ్ చేయండి. మధ్యలో అస్సలు వేయకూడదు. తిన్న ఒక గంట తర్వాత పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది. నైట్ ఎంత తొందరగా పడుకుంటే పొద్దున్న అంత తొందరగా నిద్రలేస్తారు. దీంతో మీరు ఉత్సాహంగా ఉంటారు. మీ పనిని పర్ఫెక్ట్ గా చేస్తారు.
వ్యాయామం చేయాలి: మన ఆహారపు అలవాట్లు, స్ట్రెస్ , యాంగ్జైటీ వంటివి మన నిద్రకు బంగం కలిగిస్తాయి. అంతేకాదు ఈ ప్రాబ్లమ్స్ యే నిద్రలేమి సమస్యకు కారణమవుతాయి. వీటిని బయటపడాలంటే ప్రతిరోజూ కొంత సమయం పాటు వ్యాయామం చేయాలి. రోజుకు 40 నిమిషాలు చాలు ఈ సమస్యలన్నీ పోవడానికి.
sleep
హెవీ ఫుడ్: నైట్ టైం హెవీ ఫుడ్ తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నచ్చిన ఫుడ్ ఐటెమ్స్ తో మీ కడుపును నింపితే మాత్రం ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆల్కహాల్, స్వీట్స్, కెఫిన్ ను ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీటిని కాకుండా కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉండే పాలను తాగితే హాయిగా నిద్రపడుతుంది.
లేట్ డిన్నర్: డిన్నర్ కు నిద్రకు మధ్యన రెండు గంటల గ్యాప్ ఉండాలి. అంతేకాదు రాత్రి టైం చాలా తొందరగా తినాలి. ఎందుకంటే రాత్రి టైం ఫుడ్ అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఒకవేళ మీరు లేట్ గా తింటే గ్యాస్ట్రిక్, అజీర్థి వంటి సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నైట్ టైం లేట్ గా తినకండి. తిప్పలు పడకండి.
డిస్టర్బెన్స్ ఉండకూడదు: చాలా మందికి చీమ చిటుక్కుమన్నా మెలుకువ వస్తుంటుంది. అలాంటి వారు మొబైల్ ఫోన్ ను సైలెంట్ లో పెట్టుకోవడం మంచిది. లేకపోతే ఫోన్ మెసేజ్ వచ్చినా మళ్లీ నిద్రలేవాల్సి ఉంటుంది.