కిడ్నీలు పాడయ్యే అవకాశం వీరిలోనే ఎక్కువ..
Kidney Failure Symptoms: కిడ్నీలు 90 శాతం పాడైపోయాకే దాని లక్షణాలు బయటపడతాయి. అప్పుడు వైద్యం చేసినా లాభం ఉండదని నిపుణులు చెబుతున్నారు. అలా కాకూడదంటే..

kidney
Kidney Failure Symptoms: మన జీవన శైలీ, మన ఆహారపు అలవాట్లే మన ఆరోగ్యం ఎలా ఉంటాలో డిసైడ్ చేస్తాయి. ఒకరకంగా చెప్పాలంటే మన చేతుల్లోనే మాన ఆరోగ్యం ఆధారపడి ఉందని అర్థం చేసుకోవచ్చు. కాగా మన శరీరంలో కిడ్నీలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి. ఇవి సమక్రమంగా పనిచేసినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము. ఇవి మన శరీరంలోని హార్మోన్లు సమతుల్యంగా ఉండేలా చూస్తాయి. ఇలాంటి కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం పదండి..
చాలా మంది కిడ్నీ సమస్యల బారిన పడుతుంటారు. కానీ కిడ్నీ ఫెయిల్యూర్ కు సంబంధించిన లక్షణాలు అంత తొందరగా బయటపడవు. ఈ కిడ్నీ రోగాలు బయటపడేసమయాన్ని కిడ్నీలు అప్పటికే 90 శాతం పాడై పోయి ఉంటాయి. కాబట్టి కిడ్నీలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వీటిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు కూడా. కిడ్నీలో చిన్న సమస్య ఉన్నట్టు అనిపించినా.. వెంటనే వైద్యులను సంప్రదించడం అవసరం.
అధిక రక్తపోటు, డయాబెటిస్ వంటి వ్యాధులు కిడ్నీ రోగాలకు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ డయబెటిస్ వంటి వ్యాధులను అదుపులో ఉంచుకోవడానికి మన ఆహారపు అలవాట్లు ఆరోగ్యరమైనవిగా ఉండాలి. కిడ్నీ ఆరోగ్యం కోసం కొలెస్ట్రాల్, సోడియం తక్కువ మొత్తంలో ఉండే ఆహారాలనే తినాలి.
మన రక్తంలోని చెడు మలినాలను మూత్రపిండాలు ఫిల్టర్ చేసి బయటకు పంపుతాయి. కాగా డ్రగ్స్, ఆల్కహాల్ ను కూడా ఫిల్టర్ చేస్తాయి.ఈ కారణం చేతనే ఆల్కహాల్ కు బానిసలుగా మారిన వారే ఎక్కువగా కిడ్నీ ఫెయిల్యూర్ బారిన పడుతుంటారు. అంతేకాదు ప్రతి చిన్నసమస్య కు కూడా ట్యాబ్లెట్లను మింగకూడదు. ఇలా మింగితే కూడా కిడ్నీలు చెడిపోయే ప్రమాదం ఉంది. ఆ సమస్యలన్నింటినీ సహజ పద్దతులను ఉపయోగించి తగ్గించుకోవాలి.
yoga
మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ ఎక్సర్ సైజ్లు తప్పకుండా చేయాలి. అధిక రక్తపోటు, బరువు,కొలెస్ట్రాల్, డయాబెటిస్ నియంత్రణలో ఉండాలంటే వ్యాయామాన్ని విస్మరించకూడదు.
kidney
డయాబెటిక్ పేషెంట్లకు, అధిక రక్తపోటు ఉన్నవారికే కిడ్నీ సమస్యలొచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అలాగే గుండెకు సంబంధించిన రోగాలు, స్మోకింగ్, డ్రింకింగ్ , ఊబకాయులకు కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం ఉంది.