Lung Health: మీ ఊపిరితిత్తులు హెల్తీగా ఉన్నాయో? లేవో ఇలా తెలుసుకోండి..
Lung Health: ఊపిరితిత్తులు (Lungs) ఆరోగ్యంగా లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా Lungs హెల్తీగా లేకపోతే మీలో ఈ లక్షణాలు కనిపిస్తాయి.

ఊపిరితిత్తుల (Lungs) ఆరోగ్యం బాగుంటునే మీరు అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటారు. ఒకవేల మీ ఊపిరితిత్తుల ఆరోగ్యం దెబ్బతింటే మీ శరీరంలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు వంటి సమమస్యలు కలుగుతాయి. వీటితో పాటుగా మరికొన్ని సమస్యలు కూడా మీ ఊపిరితిత్తుల ఆరోగ్యం దెబ్బతిన్నాయన్న విషయాన్ని వెళ్లడిస్తాయి. అవేంటంటే..
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. ఊపిరితిత్తుల ఆరోగ్యంగా దెబ్బతింటే మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటి సమస్య కనిపించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
ఛాతిలో నొప్పి.. ఛాతి నొప్పి గుండెపోటుకు సంకేతం కూడా. అయితే ఛాతిలో తరచుగా నొప్పి కలుగుతుంటే మాత్రం అనుమానించాల్సిందే. ఎందుకంటే ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యం చెడిపోయినప్పుడు మాత్రమే కలుగుతుంది. అందుకే ఈ నొప్పికి సొంత వైధ్యం చేసుకోకుండా నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
బరువు తగ్గడం.. కొంతమంది ఉన్నట్టుండి బరువు ( Weight) తగ్గుతుంటారు. దీనికి కారణాలు చాలానే ఉంటాయి. అందులో ఊపిరితిత్తుల సమస్య కూడా ఒకటి కావొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా ఎందుకు జరిగిందో ముందు జాగ్రత్తగా వైద్యులను సంప్రదించడం మంచిది.
ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి..
బీట్ రూట్, ఆకు కూరలు.. బీట్ రూట్, ఆకు కూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా బీట్ రూట్ లో ఉండే ఆప్టిమైజ్ చేసే సమ్మేళనాలు, నైట్రేట్ లు ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. ఇక ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచే విటమిన్ సి, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, కెరోటినాయడ్ వంటివి ఆకు కూరల్లో పుష్కలంగా ఉంటాయి.
యాపిల్స్.. రోజుకు ఒక యాపిల్ పండును తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదంటారు ఆరోగ్య నిపుణులు. ఈ పండ్లు ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వారానికి ఐదు యాపిల్ పండ్లను లేదా అంతకంటే ఎక్కువగా వీటిని తినడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటాయి. యాపిల్ పండ్లు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.
గుమ్మడికాయ.. గుమ్మడి కాయలతో పాటుగా వీటి విత్తనాలు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. గుమ్మడికాయలో లటీన్, బీటా కెరోటిన్, జియాక్సంతిన్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలకు పొంది ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి.