ఇలా పడుకుంటే నరాలు దెబ్బతింటయ్.. జాగ్రత్త..
మీరు నిద్రపోతున్నారు సరే.. మరు పడుకునే విధానం ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూసుకున్నారా..? అదెందుకు.. దానితో పనేముంది అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే.. అవును పడుకునే భంగిమలు సరిగ్గా లేకపోతే మాత్రం మీ నరాల వ్యవస్థ దెబ్బతినే ప్రమాదముంది.

పడుకునే పద్దతి(భంగిమలు) ఎలా ఉందో ఎప్పుడైనా చూసుకున్నారా? ఎలా పడితే అలా పడుకుంటే మీ ఆరోగ్యానికే ప్రమాదం. పడుకునే భంగిమలు సరిగ్గా లేకపోతే నరాల వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎలా పడుకుంటే ప్రమాదమో తెలుసుకుందాం పందండి.
వెల్లకిలా పడుకుని చేతులు నెత్తికింద పడుకుంటే బలే కంఫర్టబుల్ గా ఉంటుంది కదూ.. నిద్రకూడా బాగా పడుతుంది. కానీ ఇలా పడుకోవడం మీ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.
దీనివల్ల భుజ నరాలు దెబ్బతింటయ్. అవి డ్యామేజ్ అయ్యి తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. ఇలా పడుకోవడం వల్ల మన సమస్య కూడా ఉంది. ఇలా పడుకుంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి గురక వస్తుందట.
దిండుతో జాగ్రత్త.. చాలా మంది ఒకటి రెండు దిండ్లకంటే ఎక్కువగా వాడుతుంటారు. మెడకింద ఒక్క దిండు ఉంటే సరిపోతుంది. ఇంతకంటే ఎక్కువగా ఉపయోగిస్తే మాత్రం మెడపై చెడు ప్రభావం పడుతుంది. గురక సౌండ్ ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉంది.
ఎలా పడుకుంటే మేలు.. నిద్రించడానికి సరైన భంగిమ అంటే.. వెల్లకిలా పడుకుని చేతులు రెండు చాచి పడుకువాలి. ఇలా పడుకుంటేనే మీ ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాదు ఇలా పడుకోవడం వల్ల మెడ, వెన్నెముక ఆరోగ్యం బాగుంటాయి.