Milk Side Effects: ఈ వ్యక్తులు పాలు తాగితే వాళ్ల పని మటాషే..
Milk Side Effects: పాలు తాగితే మన ఆరోగ్యానికి ఎంతటి మేలు జరుగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కానీ.. కొన్ని రకాల అనారోగ్య సమస్యలున్నవారు పాలను తాగడం వారి ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పాలు మన ఆరోగ్యానికి ఎంతటి మేలు చేస్తాయో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదేమో. పాలల్లో విటమిన్ ఎ, ఇ, డి, మెగ్నీషియం, ప్రోటీన్, కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి దంతాలు, ఎముకలను బలంగా చేస్తాయి. అందుకే వయసుతో సంబంధం లేకుండా రోజుకు ఒక గ్లాస్ పాలను ఖచ్చితంగా తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
అయితే ఆయుర్వేదం ప్రకారం.. పాలను కొన్ని రకాల శరీరక సమస్యలు ఉన్న వారు తాగకూడదట. పాలను ఎవరు తాగకూడదో తెలుసుకుందాం పదండి..
అధిక బరువు, జలుబు, దురద, చర్మ సంబంధిత రోగాలు వంటి అనారోగ్య సమస్యలున్నవారు పాలను తాగకూడదు, గొంతులో దురద, చెవి నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్న వారు కూడా పాలను తాగొద్దు. వీరు రాత్రి పూట మాత్రమే పాలు తాగొచ్చంట. అయితే పొడిదగ్గు ఎక్కువగా ఉంటే పాలను మొత్తమే తాగకూడదు. ఈ సమస్య కొద్దిగా ఉంటే మాత్రం పాలను తక్కువ మొత్తంలో తాగొచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళ భోజనం ఆలస్యంగా చేయకూడదు. అలాగే పడుకునేటప్పుడు పాలను తాగకూడదు. ఇలా తాగితే తలకాయకు సంబంధించిన రోగాలు వచ్చే ప్రమాదం ఉంది.
పాలను వీరు రోజూ తాగాలి.. ఆవు పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే వీటిని శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు తప్పకుండా తాగాలి. ఒంట్లో వేడి ఎక్కువగా ఉండే వారు తాగితే ఉపశమనం లభిస్తుంది. కడుపు మంట సమస్య ఉన్నవారు పాలను తాగితే చక్కటి ఫలితం ఉంటుంది.
పాలను ఏ సమయంలో తాగాలి.. పాలను ఆకలి అయినప్పుడే తాగాలి. ఏదైనా తిన్న వెంటనే పాలను తాగితే అవి జీర్ణం తొందరగా కావు. అంతేకాదు వాంతులు, విరేచనాలు, జలుబు, తీవ్రమైన జ్వరం, అజీర్థి, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
పాలు నాకు అరగవు అనుకున్న వారు అందులో కాస్త శొంఠి పౌడర్ ను వేసుకుని తాగితే ఎలాంటి సమస్యా రాదు. అయితే ఎట్టిపరిస్థితిలో పాలను ఆహారాల్లో మిక్స్ చేసుకుని తినకూడదట. దీనివల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందట.
Salt, పులుపు మిక్స్ చేసి ఉన్న ఆహార పదార్థాలను పాలతో తినకూడదు. ముఖ్యంగా మామిడికాయ షేక్, మిల్స్ షేక్ లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులోనూ పాలతో మామిడికాయను కలుపుకుని ఎట్టిపరిస్థితిలో తినకూడదు. సిట్రస్ ఫ్రూట్స్, స్ట్రాబెర్రీ షేక్ వంటి వాటిని పాలతో తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు.