Hair Care: జుట్టుకు నూనె రాసేటప్పుడు ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు..
Hair Care: ప్రస్తుత కాలంలో చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొంతమంది షాంపూలను పెడితే..మరికొంతమందేమో.. హెయిర్ ఆయిల్ ను పెడుతుంటారు. అయితే జుట్టుకు ఆయిల్ రాసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల జుట్టు ఊడిపోయే ప్రమాదం ఉంది.

Hair Care: ప్రస్తుత కాలంలో చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. జుట్టు రాలడానికి ప్రధాన కారణం వాతావరణ కాలుష్యం. దీని వల్ల జుట్టు పొడిబారడం, డాండ్రఫ్ వంటి సమస్యలు వస్తాయి. దాంతో చాలా మంది జుట్టుకు నూనెను అప్లై చేస్తుంటారు. జుట్టుకు నూనె పెట్టడం వల్ల మనసు రిలాక్స్ అవడమే కాదు జుట్టు బలంగా కూడా మారుతుంది. అంతేకాదు ఆయిల్ పెట్టడం వల్ల వెంట్రుకలు సహజ మెరుపును సంతరించుకుంటాయి. కానీ నూనె రాయడానికి కొన్ని పద్దతులుంటాయి. అవి పక్కాగా ఫాలో అయితేనే జుట్టుకు ఎటువంటి హాని జరగదు కానీ.. ఆ సమయంలో చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల హెయిర్ ఫాల్ సమస్య వస్తుంది. నూనె అప్లై చేసేటప్పుడు, చేసిన తర్వాత మనం చేసే మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వేడి నూనె: జుట్టుకు గోరు వెచ్చటి నూనెను అప్లై చేయడం వల్ల మంచే జరుగుతుందని మనకు తెలుసు. కానీ వేడి నూనెను జుట్టుకు పెట్టడం వల్ల జుట్టు మూలాలు బలహీనంగా మారుతాయి. తద్వారా జుట్టు రాలడం స్టార్ట్ అవుతుంది. అంతేకాదు ఈ వేడి నూనె వల్ల తల మంట పుడుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే సీజన్లను బట్టి చల్లని లేదా వేడి నూనెను పెట్టాలని సూచిస్తున్నారు. కాగా అన్నింటికంటే గోరు వెచ్చని నూనె జుట్టు మేలు చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
గట్టిగా రుద్దడం: చాలా మంది జుట్టుకు ఆయిల్ పెట్టేటప్పుడు చేసే అతిపెద్ద మిస్టేక్ ఇదే. జుట్టుకు మసాజ్ చేసే టప్పుడు బలంగా రుద్దడం వల్ల వెంట్రుకల మూలాలు బలహీనపడతాయి. దాంతో హెయిర్ రాలుతుంది. అందుకే జుట్టుకు ఆయిల్ తో మసాజ్ చేసేటప్పుడు బలంగా లాగకూడదు.
hair fall
ముడవడం: చాలా మంది జుట్టుకు నూనె పెట్టుకున్న తర్వాత జుట్టును గట్టిగా లాగి ముడివేస్తారు. ఇది మంచి పద్దతి కాదు. ఇలా చేస్తే వెంట్రుకల మూలాలు దెబ్బతింటాయి. అంతేకాదు జుట్టు మూలాలపై ఒత్తిడి కూడా పడుతుంది. దాంతో జుట్టు బలహీనంగా మారి హెయిర్ ఫాల్ అవడం స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా జుట్టుకు నూనె పెట్టిన తర్వాత అస్సలు దువ్వకూడదు.
ఎక్కువ సేపు ఉంచడం: జుట్టుకు నూనెను అప్లై చేసిన తర్వాత కొంత సమయంలో షాంపూతో జుట్టును క్లీన్ చేసుకోవాలి. కానీ చాలా మంది నూనె పెట్టుకున్న తర్వాత గంటలకొద్దీ అలాగే ఉంటారు. దాంతో వారి తల జిడ్డుగా మారుతుంది. తద్వారా డాండ్రఫ్ సమస్య వస్తుంది. ఈ చుండ్రు వల్లే జుట్టు ఎక్కువగా రాలుతుంది. అందుకే జుట్టు కు నూనె అప్లై చేసిన కొద్ది సేపటికే తల స్నానం చేయాలి.