ఈ ఆకుకూరలను తినండి తొందరగా బరువు తగ్గుతారు..
కొన్ని రకాల కూరగాయలు బరువు తగ్గిస్తాయన్న ముచ్చట అందరికీ తెలుసు. అయితే ఆకుకూరలు కూడా బరువును ఫాస్ట్ గా తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
leafy vegetables
ఆరోగ్యంగా ఉండేందుకు ఆకు కూరలను తప్పనిసరిగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకు కూరల్లో మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రెగ్యులర్ గా ఆకు కూరలను తినడం వల్ల గుండె జబ్బులు, అధిక రక్తపోటు, ఊబకాయంతో సహా ఎన్నో ప్రాణాంతకమైన రోగాల ప్రమాదం తప్పుతుంది. ఆకు కూరల్లో మెగ్నీషియం, జింక్, కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని తినడం వల్ల మన శరీర రోజు వారి అవసరాలు దాదాపుగా తీరిపోతాయి. మరి ఎలాంటి ఆకు కూరలు బరువు తగ్గేందుకు సహాయపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
బచ్చలికూర
దీనిలో కరగని ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. అలాగే దీనివల్ల కేలరీలు శరీరంలో శోషించుకోబడవు. ఇది బెల్లీ ఫ్యాట్ ను కరిగించడానికి సహాయపడుతుంది. ఈ కూరలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మీ శరీరంలో ఉన్న అదనపు కొవ్వును తగ్గించుకోవడానికి మీ బ్రేక్ ఫాస్ట్ లో లేదా భోజనంలో బచ్చలికూరను తప్పకుండా తినండి.
బ్రోకలీ
బ్రోకలీలో ఫైబర్, మంచి కార్బ్ పుష్కలంగా ఉంటాయి. దీనిలోని ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్దకాన్ని పోగొడుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రిస్తుంది. మీరు అతిగా తినకుండా చేస్తుంది. ఎందుకంటే ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. బ్రోకలీలో కేలరీలు తక్కువగా ఉంటాయి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
Kale
కాలే
కాలేలో కేలరీలు తక్కువగా, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల శరీర శక్తి స్థాయిలు బాగా పెరుగుతాయి. దీన్ని పుష్కలంగా తింటే సులువుగా బరువు తగ్గుతారని పలు అధ్యయనాలు కూడా నిరూపించాయి.
పాలకూర
పాలకూరలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పాలకూరలో ఫైబర్ కంటెంట్, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. దీంతో మీరు అతిగా తినలేరు. దీనిలో కొవ్వు పదార్థం తక్కువగా ఉంటుంది. బరువు తగ్గేవారు పాలకూరను తప్పనిసరిగా తినాలని నిపుణులు చెబుతున్నారు.
మునగాకులు
మునగాకుల్లో క్లోరోజెనిక్ ఆమ్లంతో పాటుగా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకులు కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడానికి కూడా తోడ్పడుతాయి. మునగాకుల్లో మెగ్నీషియం, జింక్, పొటాషియం, ఐరన్, కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.