- Home
- Life
- Back pain: వెన్ను నొప్పిని భరించలేకపోతున్నారా? ఈ చిట్కాలు పాటించండి వెంటనే ఉపశమనం లభిస్తుంది..
Back pain: వెన్ను నొప్పిని భరించలేకపోతున్నారా? ఈ చిట్కాలు పాటించండి వెంటనే ఉపశమనం లభిస్తుంది..
Back pain: ప్రస్తుత కాలంలో వెన్ను నొప్పి సర్వసాధారణ సమస్యల జాబితాలో చేరిపోయింది. కానీ ఈ నొప్పిని భరించడం కష్టమే. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే ఈజీగా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. అవేంటంటే..

back pain
Back pain: ప్రస్తుతం వెన్ను నొప్పి వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. బరువును ఎత్తడం, సరిగ్గా కూర్చోకపోవడం, సరిగా లేని నిద్రభంగిమలు వంటివి వెన్ను నొప్పికి కారణాలుగా చెప్పవచ్చు. పలు సర్వేల ప్రకారం.. మన దేశంలో 60 శాతం మంది వెన్ను నొప్పితో బాధపడుతున్నారట.
back pain
ఇల్లును శుభ్రం చేయడం గానీ లేదంటే అధిక బరువులు ఎత్తినప్పుడు లేదా శారీరక శ్రమ చేస్తున్న ఏదో ఒక సందర్బంలో వెనక భాగం దెబ్బతినడం వల్ల వెన్ను నొప్పి వస్తుంటుంది. అలాగే Ankylosing spondylitis లేదా ఆర్థరైటిస్ సమస్యల మూలంగా కూడా వెన్ను నొప్పి పుట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
వెన్ను నొప్పి ఏ కారణం చేత వచ్చినా.. దీనిని భరించలేనప్పుడు డాక్టర్ కు చూపించుకోవడమే ఉత్తమం. అయితే వెన్ను నొప్పి తేలికపాటిదిగా ఉంటే కొన్ని ఇంటి చిట్కాలతో దాని నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కదులతూ ఉండండి.. వెన్ను నొప్పిని తగ్గించడానికి సరైన మార్గం తరచుగా ఇకే దగ్గర కూర్చోకుండా అటూ ఇటూ నడవండి. ఇంటి పనులను చేయండి. అప్పుడే మీ వెన్ను నొప్పి తగ్గుముఖం పడుతుంది. నొప్పి పెడుతుంది కదా అని గంటల తరబడి కూర్చుంటే నొప్పి మరింత ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు. ముఖ్యంగా వీరు రోజుకు 30 నిమిషాలైనా నడవాలని నిపుణులు సలహానిస్తున్నారు.
వ్యయామాలు.. పొట్టను సాగదీసే వ్యాయామాలను చేయడం వల్ల వెన్ను నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే పొట్ట కండరాలు వెన్ను నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే వెన్నెముకను బలంగా తయారుచేసే వ్యాయామాలను కూడా నిత్యం చేస్తూ ఉండాలి. ఇందుకోసం పైలేట్స్, యోగా వంటివి చేస్తూ ఉండాలి.
సరైన భంగిమ.. సరైన భంగిమలో కూర్చోవడం, లేదా పడుకోవడం లాంటివి చేస్తూ ఉంటే వీపుపై ఒత్తిడి తగ్గుతుంది.. కాబట్టి వెన్ను నొప్పి ఉండే వారు కూర్చునేటప్పుడు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా వెన్నును సక్కగా ఉంచడానికి స్ట్రెచి బ్యాండ్, పట్టీలు, టేప్ లను కూడా వాడొచ్చు. వీటి వల్ల ఎక్కువ బరువు లోయర్ బ్యాక్ మీద పడదు.
కంప్యూటర్ల ముందు పనిచేస్తున్నట్టైతే మీరు తలను వంచకూడదు. ముఖ్యంగా స్క్రీన్ పైభాగం వైపే చూడాలి. ఇక మీ చేతులు డెస్క్ పై ఫ్లాట్ గా ఉండేట్టు చూసుకోవాలి.
అధిక బరువు.. ఓవర్ వెయిట్ ఉన్న వారిలో వెన్ను నొప్పి సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వీరిలో వెన్ను నొప్పి తగ్గాలంటే మాత్రం ఖచ్చితంగా బరువు తగ్గాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడం వల్ల దిగువ వీపు నుంచి ఒత్తిడి తగ్గుతుంది. దీంతో వెన్ను నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
స్మోకింగ్ మానుకోవాలి.. పలు పరిశోధనల ప్రకారం.. స్మోకింగ్ చేయడం వల్ల 4 రెట్లు వెన్నెముక సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉందని తేలింది. పొగాకు, సిగరేట్ లల్లో ఉండే నికోటిన్ వెన్నెముకపై చెడు ప్రభావం చూపిస్తుంది. ఇది వెన్నెముకను బలహీనంగా చేస్తుంది. అందుకే దీన్ని వీలైనంత తొందరగా మానుకోవడం మంచిది.
ఐస్ ప్యాక్.. తీవ్రమైన వెన్ను నొప్పి నుంచి బయటపడేయడానికి ఐస్ క్యూబ్స్ బాగా ఉపయోగపడతాయి. నొప్పిగా ఉండే చోట వీటిని పెడితే తక్షణమే ఉపశమనం పొందవచ్చు. అలాగే హీటింగ్ ప్యాడ్ తో కండరాలకు విశ్రాంతి కలుగుతుంది. ఈ రెండింటిలో ఏది యూజ్ చేసినా చక్కటి ఫలితం పొందుతారు.