- Home
- Life
- Foods For Skin: ఎప్పటికీ నిత్య యవ్వనంగా ఉంటూ.. వయసు కనిపించకూడదంటే.. ఈ ఫుడ్స్ ను తప్పక తినండి..
Foods For Skin: ఎప్పటికీ నిత్య యవ్వనంగా ఉంటూ.. వయసు కనిపించకూడదంటే.. ఈ ఫుడ్స్ ను తప్పక తినండి..
Foods For Skin: వయసు మీద పడుతున్న కొద్దీ జుట్టు తెల్లబడటంతో పాటుగా చర్మంపై ముడతలు కూడా పడుతుంటాయి. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు మిమ్మల్ని నిత్య యవ్వనంగా ఉంచుతాయి. అవేంటంటే..

బాదం (Almonds): బాదంలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు (Unsaturated fatty acids)పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్ ఇ యొక్క మంచి మూలం కూడా. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, అసంతృప్త కొవ్వు ఆమ్లాలు మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.ఇది ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.
అవిసె గింజలు (Flax seeds): అవిసె గింజల్లో ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం (ALA) అని పిలువబడే ఒమేగా -3 కొవ్వు ఆమ్లం ఉంటుంది. అవిసె గింజలను స్మూతీ లేదా సలాడ్ కు జోడించడం ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
వాల్ నట్స్ (Walnuts): ఈ జాబితాలో వాల్ నట్స్ ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ బి, ఇ లు చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ గింజలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల చర్మంపై వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది. అలాగే ఎక్కువ సమయం చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది.
ఆకుకూరలు (Greens): ఆకుకూరలు తీసుకోవడం వల్ల రక్తహీనతను నివారించడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధులను దూరం చేయడానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకుకూరలు తినడం వల్ల కూడా చర్మానికి చాలా మంచి జరుగుతుంది. వాటిలో ఉండే 'బీటా కెరాటిన్' (Beta keratin) శరీరానికి చేరగానే అది విటమిన్ ఎ గా మారుతుంది. ఇది సూర్యరశ్మి వల్ల కలిగే చర్మ సమస్యలను పరిష్కరిస్తుంది.
క్యారెట్ (Carrot): క్యారెట్ లో బీటా కెరోటిన్లు (Beta carotenes), విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. క్రమం తప్పకుండా ప్రతి రోజూ రెండు క్యారెట్ లను తింటే శరీరం ఆకర్షణీయంగా, అందంగా మారుతుంది. అలాగే క్యారెట్ తో ఇంటిలోనే సులభంగా తయారు చేసుకునే ఫేషియల్స్ (Facials) చర్మానికి మంచి ఫలితాలను అందిస్తాయి.
దానిమ్మ (Pomegranate): దానిమ్మ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తరచుగా తినడం వల్ల రక్తహీనత (Anemia) సమస్య తలెత్తే అవకాశమే ఉండదు. ఇది రక్తాన్ని పుట్టించగలదు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఎన్నో ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా చర్మాన్ని సూర్య కిరణాల నుంచి రక్షిస్తాయి. అలాగే వయసు మీద పడుతున్న కొద్దీ వచ్చే చర్మంపై ముడతలను కూడా పోగొడతాయి.